మెదక్

అధికారుల గైర్హాజర్‌పై ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగు, సెప్టెంబర్ 22: మండల సర్వసభ్య సమావేశానికి గైర్హాజరవుతున్న అధికారుల తీరుపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ఎంపిటిసిలు, సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఎంపిపి వెంకట్‌రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ముందుగా వ్యవసాయాధికారి ప్రవీణ తన నివేదికను వివరించగా అనంతరం స్థానిక వైద్యాధికారి డాక్టర్ స్వప్న తన నివేదిక వివరిస్తుండగా గ్రామాలలో చికెన్‌గున్య, డెంగ్యూ వ్యాదులు సోకినప్పటికీ ఎందుకు స్పందించడంలేదని కర్కపల్లి సర్పంచ్ సుగుణాకర్‌రెడ్డి ప్రశ్నించా రు. అయితే తమకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదని దానిపై రేపటి నుండి తగిన జాగ్రత్తలు తీసుకుంటామని డాక్టర్ స్వప్న వివరించారు. అనంతరం పశువైద్యాధికారి లోహిత్‌రెడ్డి గ్రామాలలో పర్యటించి పశువులకు వైద్యం సరిగ్గా అందించడంలేదని, ఒక్కో రోజు ఒక్కో గ్రామానికి వచ్చి పశువులకు వైద్యం అందించాలని సభ్యులు సూచించారు. అలాగే గ్రామీన ప్రాంతాలలో ఉన్న ఆసుపత్రులల్లో సరైన పరికరాలులేక రోగులు ఇబ్బంది పడుతున్నందున ఈ విషయాన్ని మార్కె ట్ కమిటీ చైర్మెన్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి సరైన సదుపాయాలు కలిగే విదంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశానికి ఆలస్యంగా హాజరైన ఆర్టికల్చర్ నియోజకవర్గ ఇంచార్జి చక్రపాని సామాన్య రైతులను వదిలి దనిక రైతుల కొమ్ము కాస్తున్నారని క్షీరాసాగర్ ఎంపిటిసి సురేశ్, సర్పంచ్‌లు వెంకటేశ్‌గౌడ్, అర్జున్‌గౌడ్‌లు ఆరోపించారు. అయితే అలాంటి సందర్బాలు ఇప్పటి వరకు రాలేదని ఇప్పటి వరకే నియోజకవర్గంలో 68 ఎకరాలల్లో పాలీ హౌజ్‌ల ఏర్పాటుకు సబ్సీడీ 90 లక్షల నుండి కోటి రూపాయల వరకు సబ్సీడీ అందించాలని ఆయన వివరించారు. ఎఎంసి చైర్మెన్ జహంగీర్, జెడ్‌పిటిసి సింగం సత్తయ్య, ఎంపిపి ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ఎంపిడిఒ దిలీప్‌కుమార్, తహశీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపిటిసిలు సురేందర్, కిష్టయ్య, శ్రీను, నర్సింలు, సర్పంచ్‌లు ఈశ్వర్‌సింగ్, కైలాసం, విజయ్ అధికారులు పాల్గొన్నారు.