మెదక్

ఆమరణ దీక్ష భగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయంపేట, సెప్టెంబర్ 22: రామాయంపేటను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా, నిజాంపేటను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టిపిసిసి కార్యదర్శి చౌదరి సుప్రబాత్‌రావు చేపట్టిన ఆమరణ దీక్ష రెండవ రోజు గురువారం రాత్రి 7గంటల ప్రాంతంలో పోలీసులు భగ్నం చేశారు. ఎస్‌ఐ నాగార్జున్‌గౌడ్ తన బలగాలతో దీక్ష స్థలికి చేరుకొని సుప్రబాత్‌రావును బలవంతంగా జీపులో ఆసుపత్రికి తరలిస్తుండగా దీక్షస్థలి వద్ద కాంగ్రేస్ పార్టీ కార్యకర్తలు, ఆయన అనుచరులు పోలీసు జీపుగా అడ్డుగా పడడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు బలగాలు అందరిని పక్కకు నెట్టేసి సుప్రబాత్‌రావుతో పాటు కొంతమందిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సెలేన్ ఎక్కించుకోవాలని, బిపి తగ్గిందని చెప్పినా ఆయన వైద్యానికి నిరాకరించారు. అరెస్ట్ విషయం తెలుసుకున్న కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి తరలివచ్చి ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈసందర్బంగా సుప్రబాత్‌రావు మాట్లాడుతూ శాంతియుతంగా చేస్తు న్న ఆమరణ దీక్షను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించారన్నారు. రామాయంపేట రెవె న్యూ డివిజన్‌గా, నిజాంపేట మండల కేంద్రంగా ఏర్పా టు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించేవరకు ఆసుపత్రిలోనే ఆమరణ దీక్ష చేస్తానన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇక్కడి ప్రజల మనోబావాలను గుర్తించి వెంటనే డివిజన్ కేంద్రంగా రామాయంపేటను ప్రకటించాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షం అద్వర్యంలో శుక్రవారం చేపట్టనున్న బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ఆయన వెంట డిసిసి ప్రదాన కార్యదర్శి పుట్టి రాజు, యువజన కాంగ్రేస్ నాయకులు హస్నోద్దీన్, చింతల యాదగిరి, చింతల స్వామి, అల్లాడి వెంకటి, సాల్‌మాన్‌రాజు, కోనాపురం వెంకటి, విప్లవ్‌కుమార్, గణేష్‌నాయక్‌తో పాటు పలువురు ఉన్నారు.
సుప్రభాత్‌రావు పోరాటానికి టిపిఎఫ్ మద్దతు..సత్తయ్య
రామాయంపేటను డివిజన్ కేంద్రం, నిజాంపేటను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని సుప్రబాత్‌రావు చేపట్టిన పోరాటానికి తెలంగాణ ప్రజా ఫ్రంట్ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆపార్టీ రాష్ట్ర నాయకులు సత్తయ్య అన్నారు. ఆమరణ దీక్ష రెండవ రోజు ఆయన పార్టీ నాయకులతో కలిసి దీక్షకు సంఘీబావం ప్రకటించారు. ఈసందర్బంగా సత్తయ్య మాట్లాడుతూ డిమాండ్‌లేని చోటు జిల్లాలు, డివిజన్‌లు, మండలాలు ఏర్పాటు చేస్తూ డిమాండ్ ఉన్న చోట చేయకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శమన్నారు. ఆయన వెంట పాతూరి రమేష్‌గౌడ్, సిద్దరాములు, ఎల్లాగౌడ్, అస్గర్‌లు ఉన్నారు. అంతకు ముందు మెడికల్ అసోసియోషన్, ఆర్‌ఎంపి వైద్యుల అసోసియోషన్, నిజాంపేట గ్రామస్థులు తరలివచ్చి సుప్రభాత్‌రావుకు సంఘీబావం ప్రకటించారు.