మెదక్

దశాబ్దానికి దశ తిరిగిన సింగూర్ ఎత్తిపోతల పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, సెప్టెంబర్ 22: సరిగ్గా దశాబ్ద కాలానికి సింగూర్ ఎత్తిపోతల పథకానికి దశ తిరిగింది. మూడున్నర దశాబ్దాల క్రితం పుల్కల్, మునిపల్లి, సదాశివపేట మండలాల సరిహద్దులో మంజీర నదిపై సింగూర్ ప్రాజెక్టును నిర్మించారు. జంటనగరాలకు తాగుకు, జిల్లా వ్యవసాయానికి సాగుకు అందించాలనే సంకల్పంతో ప్రాజెక్టును నిర్మించినా నేటి వరకు కేవలం తాగునీటి సరఫరాకే ప్రాధాన్యతను ఇచ్చారు. హైదరాబాద్‌కు గోదావరి, క్రిష్ణ జలాలు పుష్కళంగా సరఫరా అవుతుండటంతో సింగూర్ ప్రాజెక్టును సాగుతో పాటు జిల్లా ప్రజల దాహర్తి తీర్చడానికి ఉపయోగించాలనే లక్ష్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినట్లు తెలుస్తోంది. చెంతనే నీరున్నా సాగుకు బొట్టు కూడా అందడం లేదని ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా 102 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలను ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందుగా జిల్లా గుండా నిర్వహించిన వైఎస్ పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సింగూర్ నీటిని సాగుకు అందిస్తామని హామి ఇచ్చారు. అదే తరుణంలో 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు స్వీకరించడం జరిగాయి. ఇచ్చిన మాట ప్రకారంగా 2006 సంవత్సరంలో సింగూర్ ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకానికి 99 కోట్లు మంజూ రు చేసి వైఎస్ తన స్వహస్తాలతో పనులకు శంఖుస్థాపన చేసారు. అందోల్ నియోజకవర్గంలోని మొత్తం 40 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఎడమ ప్రక్కన 24 కిలోమీటర్ల పొడవు ప్రధాన కాలువలను నిర్మించగా, కుడి ప్రక్కన 12 కిలోమీటర్లకు కాలువలను నిర్మించడానికి ప్రణాళికలు సిద్దం చేసారు. ముందుగా ఎడమ ప్రక్క పనులను పూర్తి చేసేందుకు సాగునీటి పారుదల శాఖ అధికారులు ఉపక్రమించారు. కాంగ్రెస్ హయాంలో పనులు నత్తనడకన, నాసీరకంగా, ప్రణాళిక సక్రమంగా లేకపోవడంతో పథకం నీరుగారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకావడం, అధికారంలోకి టిఆర్‌ఎస్ రావడం, ఎన్నికల సందర్భంగా సిఎం కెసిఆర్ సైతం సింగూర్ ఎత్తిపోతల పథకాన్ని సరిదిద్దుతామని హామి ఇచ్చారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు స్వీయ పర్యవేక్షణలో లోపాలను సరిదిద్ది కాలువల నిర్మాణాన్ని యుద్ద ప్రాతిపధికన పూర్తి చేయించారు. కాలువల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణలో నెలకొన్న ఇబ్బందులను అధిగమించారు. 1700 ఎకరాల భూ సేకరణ చేసి కాలువల నిర్మాణం చేపట్టడం గమనార్హం. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో సింగూర్ ప్రాజెక్టు ఎండిపోయిన విషయం తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం పుణ్యమాని సింగూర్ ప్రాజెక్టుకు ఎగువన భారీ వర్షాలు కురియడంతో వరద పోటెత్తింది. దీంతో సుమారు 19 టిఎంసిల నీటి నిల్వ కావడం, మరోవైపు ఎత్తిపోతల పథకం పనులు కూడా పూర్తికావడంతో సాగుకోసం నీటిని అందించడానికి అధికారులు సిద్దమయ్యారు. అందోల్, పుల్కల్ మండలాల్లోని మొత్తం 42 గ్రామాలకు చెందిన 30 వేల ఎకరాలకు ఎత్తిపోతల ద్వారా సాగునీటిని అందించడానికి సర్వం సిద్దమైంది. శుక్రవారం మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడానికి సాగునీటి పారుదల శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసారు. అదే విధంగా ఇతర కార్యక్రమాలను కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో మంత్రి పర్యటన కొనసాగుతుందా వాయిదా పడుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వర్షం నిలువకుండా కురిస్తే కేవలం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభింపజేసి ఇతర కార్యక్రమాలను వాయిదా వేయించాలనే లక్ష్యంతో అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. మొత్తంమీద పదేళ్ల కాలానికి కర్షకులకు కావల్సిన సాగునీటిని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ద్వారా అందుతుందని చెప్పవచ్చు.