మెదక్

పనులు పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 22: జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అధికార యంత్రాంగం చేయాల్సిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులు, కార్యాలయాలకు సంబంధించిన వివరాలను అప్‌లోడింగ్, స్కానింగ్ ప్రక్రియను సత్వరం పూర్తి చేయాలన్నారు. అలాగే కార్యాలయాలకు అవసరమైన ఫర్నిచర్ వివరాలు సమర్పించాలని సూచించారు. ఇప్పటి వరకు ఎన్ని ఫైల్స్ అప్‌లోడ్ చేశారు, ఇందులో కరెంట్ ఫైల్స్, డిస్పోజబుల్ ఫైల్స్ ఎన్ని, ఎన్నింటిని స్కాన్ చేశారన్న దానిపై శాఖల వారిగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, ఎజెసి వెంకటేశ్వర్లు, డిఆర్వో దయానంద్‌తో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.