మెదక్

వలస కూలీలను రక్షించిన రెస్క్యూ బృందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపన్నపేట, సెప్టెంబర్ 25: ఏడుపాయల మంజీరలో చిక్కుకున్న ఒరిస్సా, మధ్యప్రదేశ్‌లకు చెందిన 23 మంది వలస కూలీలను రెండు ఆర్మీ హెలిఫ్యాడ్‌ల ద్వారా ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎయిర్‌ఫోర్స్ రెస్క్యూ బృందాలు రక్షించాయి. ఏడుపాయల్లో ఆదివారం ఉదయం 7:30 గంటలకు రెండు ఆర్మీ హెలికాప్టర్లు చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు రంగంలోకి దిగి ఆపరేషన్ ప్రారంభించాయి. ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎయిర్‌ఫోర్స్ రెస్క్యూ బృందాలు చర్యలను వేగవంతం చేసి రెండు హెలికాప్టర్లతో 40 నిమిషాల్లో ఆపరేషన్‌ను పూర్తి చేశారు. ఏడుపాయల ఘటన స్థలంలో దగ్గరుండి సహాయక చర్యలను ఎప్పటికప్పుడు శాసనసభ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి పర్యవేక్షించారు. మంజీర ఉదృతంగా ప్రవహించడం, ఏడుపాయల టేకుల గడ్డ ప్రాంతంలో రోడ్డు అండ్ చెక్‌డ్యామ్‌ల నిర్మాణ పనులు చేస్తున్న 23 మంది కూలీలు మంజీరలో చిక్కుకున్న విషయం విధితమే. శనివారం ఉదయం నుండి మంజీరలో చిక్కుకున్న 23 మంది కూలీలను రక్షించేందుకు ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్, మెదక్ ఆర్డీఓ మెంచు నగేష్, మెదక్ డిఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో సహాయక చర్యలను వేగవంతం చేశారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ రెస్క్యూ బృందాలు చేసిన ప్రయత్నాలు, వాతావరణం అనుకూలించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌ను ఆదివారానికి వాయిదా వేశారు. ఆదివారం ఉదయం రెండు ఆర్మీ హెలికాప్టర్లు ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎయిర్‌ఫోర్స్ రెస్క్యూ బృందాలు వచ్చి చర్యలను అత్యంత వేగవంతం చేశాయి. మంజీరలో చిక్కుకున్న కూలీల వద్దకు రెండు ఆర్మీ హెలికాప్టర్లు, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎయిర్‌ఫోర్స్ రెస్క్యూ బృందాలు చేరుకొని వారిని సురక్షితంగా హెలికాప్టర్ల ద్వారా బయటకు తీసుకువచ్చి హరిత రెస్టారెంట్ ప్రాంతంలో వదిలిపెట్టారు. రెండు ఆర్మీ హెలికాప్టర్ల సహాయంలో మూడు దఫాలుగా 23 మంది కూలీలను రెస్క్యూ బృందాలు క్షేమంగా ఒడ్డుకు చేర్చాయి. క్షేమంగా ఒడ్డుకు చేరిన కూలీలు గోపాల్, సుక్‌చంద్, సోనా, దేవా, రమేశ్, శంకర్, రుద్ర, సాయిలిన్, స్వప్న, వినోద్, చింటు, మని, కైలాస్, శివప్రసాద్, సతీష్, మనోజ్, కృష్ణ, సురేందర్, సోను, ముకేష్, చోటు, దేవిలాల్‌లు సంతోషం వ్యక్తం చేశారు. తమను కాపాడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్, జిల్లా అధికార యంత్రాంగానికి కూలీలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. క్షేమంగా చేరుకున్న కూలీలతో పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.