మెదక్

పేట లోతట్టు ప్రాంతాల్లో మంత్రి హరీష్ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, సెప్టెంబర్ 25 : సిద్దిపేట కోమటిచెరువు మినిట్యాంక్ బండ్‌ను ఆదివారం ఉదయం మంత్రి హరీష్‌రావు మరో సారి సందర్శించారు. మత్తడి దూకుతున్న దృశ్యాలను మంత్రి హరీష్‌రావు వీక్షించి సంతోషం వ్యక్తం చేశారు. కోమటిచెరువుకు వచ్చిన పర్యాటకులతో మమేకపై ఆప్యాయంగా పలకరించి వారితో జళకళ ఆనందాన్ని పంచుకున్నారు. కోమటిచెరువుకు పర్యాటక శోభ సంతరించుకోవటం మంత్రి హరీష్‌రావు ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి హరీష్‌రావు ఫోన్ లైన్లో నియోజక వర్గంలోని అధికారులు ప్రజాప్రతినిధులతో పాటు కురుస్తున్న వర్షాల తీరును అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో మంత్రి హరీష్‌రావుతో పాటు ఇరిగేషన్ ఇఇ రవీందర్‌రెడ్డి, విద్యుత్ డిఇ శ్రీనివాస్‌రెడ్డి, డిఎస్పీ షేక్‌లాల్ ఆహ్మద్, ఓఎస్‌డి బాలరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తర్ పటేల్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.