మెదక్

చెరువులో పడి యువకుడు..నల్ల్లాగుంతలో పడి చిన్నారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హత్నూర, సెప్టెంబర్ 26: ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని నాగుదేవునిపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సార మల్లేశం (28) ఆదివారం రాత్రి బహిర్బుమికని వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. అనుమానంతో కుటుంబ సభ్యులు చెరువువద్దకు వెళ్లి చూడగా జారిపడ్డ ఆనవాళ్లు కనిపించినట్లు గ్రామస్థులు తెలిపారు. వెంటనే జాలీ, వల వేసి గాలించగా మల్లేశం మృతదేహం లభించింది.
మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాల్‌రెడ్డి తెలిపారు.
నల్ల్లా గుంతలో పడి బాలిక మృతి
నల్లా గుంతలో పడి బాలిక మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన హత్నూర ఆదివారం చోటు చేసుకుంది. వెల్దుర్తి గ్రామానికి చెందిన జ్యోతి శ్రీనివాసుల దంపతులకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. కాగా జ్యోతి పుట్టిల్లయన హత్నూరకు పిల్లలతో కలిసి వచ్చింది. రెండవ కూతురైన శ్రీవాణి (18నెలలు) ఆదివారం మధ్యాహ్నం ఆడుకుంటూ వెళ్లి నల్లగుంతలో పడి మృతి చెందింది.