మెదక్

నేడు జిన్నారం బంద్‌కు అఖిలపక్షం పిలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిన్నారం, సెప్టెంబర్ 26: జిన్నారం మండలాన్ని మెదక్ జిల్లాలో కలిపితే సహించేది లేదని హెచ్చరించారు అఖిల పక్ష నాయకులు. సోమవారం ఎంపీపీ కార్యాలయంలో మండల అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపితో పాటు ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎంపీపీ రంవీదర్‌రెడ్డి, జడ్పిటిసి ప్రభాకర్, ఎంపీపీ ఉపాద్యక్షుడు నాగెందర్‌గౌడ్‌తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. జిన్నారం, నూతనంగా ఏర్పడే గుమ్మడిదల మండలాలను మెదక్‌లో కలిపేందుకు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిలు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సంగారెడ్డికి కేవలం 30కిలో మీటర్ల దూరంగాలో ఉన్న జిన్నారం మండలం 70కిలో మీటర్ల దూరంగాలో ఉన్న మెదక్‌లో ఏ విధంగా కలుపుతారని ప్రశ్నించారు. వారి స్వార్ధ రాజకీయాల కోసమే అలా చేస్తున్నారని మండిపడ్డారు. వారి ప్రయత్నాలను తిప్పికొడతామన్నారు. నేడు జిన్నారం మండల బంద్‌కు అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. ఉదయం బొంతపల్లి వద్ధ ధర్నా రాస్తారోకో నిర్వహిస్తామన్నారు. బొల్లారం, బొంతపల్లి, గుమ్మడిదల జిన్నారం, గడ్డపోతారంలలో ధర్నాలు చేస్తామన్నారు. ప్రజలు స్వచ్చందంగా బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశంగౌడ్, ఇందెల సుంరెందర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.