మెదక్

పాపం పసివాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్, సెప్టెంబర్ 26: వరదనీటిలో గల్లంతయిన చిన్నారి ముజాహిద్ ఆచూకి సోమవారం లభించింది. పోలీసులు మున్సిపల్ సిబ్బంది సహకారంతో సోమవారం మూడోరోజు చేపట్టిన గాలింపుల్లో సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న చెక్‌డ్యాం వద్ద బురదలో కూరుకుపోయిన చిన్నారి మృతదేహం లభించింది. జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. శనివారం ఎడ్లబండిపై కూర్చుని ఇంటికి తిరిగొస్తుండగా వరదనీటి ధాటికి బండి పల్టీ కొ ట్టింది. దీంతో ఆ చిన్నారి వరదనీటిలో కొట్టుకుపోయాడు. ఈ సమాచారం తెలుసుకుని గ్రామస్థులు, పోలీసులు బాలునికోసం వాగులో గాలించారు. బాగా చీకటి కావడంతో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా గాలించారు. ఫలితం లేక పోవడంతో సోమవారం చివరి ప్రయత్నంగా మున్సిపల్ సిబ్బందితో గాలించారు. అధికార, విపక్ష పార్టీలకు చెందిన రాజకీయ నాయకలు, ప్రతినిధులు కూడా గ్రామాన్ని సందర్శించి సంఘటనను సమీక్షించారు. కుటుంబ సభ్యులను పరామర్శిచారు. గ్రామాన్ని సందర్శించిన వారిలో ఎంపి.బిబి పాటిల్‌తోపాటు మాజీ మంత్రి ఎండి.్ఫరీదుద్ధీన్, ఇన్‌చార్జి మాణిక్‌రావు, టిడిపి ఇంచార్జి వై.నరోత్తం ఇతర నాయకులున్నారు.