మెదక్

జలవనరుల సంరక్షణతోనే మానవమనుగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, సెప్టెంబర్ 26: జల వనరుల సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యపడుతుందని మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్ పాండవుల చెరువులో ప్రత్యేక పూజలు చేసిన సందర్బంగా ఆయన మాట్లాడారు. సిఎం కెసిఅర్ ప్రత్యేక దృష్టి కారణంగా పాండవుల చెరువు మినీట్యాంక్‌బండ్‌గా రూపుదిద్దుకుందని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ పనులు త్వరితగతిన పూరె్తైన కారణంగా చెరువులలో సంవృద్ధిగా నీరు చేరి భూగర్భ జల మట్టం పెరగడానికి అవకాశం ఏర్పడినట్లు తెలిపారు. ముఖ్యంగా ఖరీఫ్ సాగు కొంత నష్టం చేసినప్పటికీ రబీలో ఆశా జనకమైన దిగుబడులు వస్తాయని తెలిపారు. కాగా అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్షాలకు ప్రజలే గునపాఠం చెబుతారని, ఎలాంటి సాగునీటి వనరులూ లేని నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ వర ప్రదాయనిగా మారుతుందని వివరించారు. ఈ కార్యక్రమాలలో గఢా అధికారి హన్మంతరావు, మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మెన్ దుంబాల అరుణ బూపాల్‌రెడ్డి, నియోజకవర్గ టిఅర్‌ఎస్ ఇంచార్జ్ బూంరెడ్డి, ఎంపిపి అధ్యక్షులు చిన్నమల్లయ్య, జెడ్‌పిటిసి వెంకటేశంగౌడ్, నేతలు మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్‌రావు, నర్సింగరావు, రాజ్‌కుమార్, సత్యనారాయణ, సుబాష్‌చంద్రబోస్, జకియొద్దీన్, గోపాల్‌రెడ్డి, ఆకుల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.