మెదక్

ప్రత్యేక మండలం కోసం టవరెక్కి హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, సెప్టెంబర్ 26 : జిల్లాల పునర్విభజనలోభాగంగా నారాయణరావుపేట గ్రామాన్ని మండలం చేయాలని డిమాండ్ చేస్తు గ్రామానికి చెందిన యువకుడు సెల్‌ఫోన్ టవరెక్కి 6 గంటల పాటు హైడ్రామా సృష్టించారు. నారాయణరావు పేట గ్రామానికి చెందిన బామండ్ల కిషన్ (27) సెల్‌ఫోన్ టవర్ ఎక్కి ..గ్రామాన్ని మండలం చేయకుంటే అక్కడ నుండి దూకుతానని బెదిరించి 6గంటల పాటు హైడ్రామాకు పాల్పడటం చర్చనీయంశంగా మారింది. సిద్దిపేట మండలంలోని మేజర్ గ్రామపంచాయితీన నారాయణరావుపేట గ్రామాన్ని మండలం చేయాలని గత 31 రోజులుగా అఖిల పక్షం ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు చేస్తున్నారు. గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు మూకుమ్మడి రాజీనామా చేసి ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికి ఏలాంటి స్పందన లేకపోవటంతో గ్రామానికి చెందిన కిషన్ (27) సోమవారం ఉదయం 10 గంటలకు సెల్‌ఫోన్ టవర్ ఎక్కాడు. ఈవిషయం తెలుసుకున్న గ్రామస్తులంత టవర్ వద్దకు చేరుకున్నారు. నారాయణరావుపేట గ్రామాన్ని మండలం చేస్తానని ప్రకటించేవరకు ఆందోళన విరమించేది లేదన్నారు. ఈవిషయాన్ని తెలుసుకున్న రూరల్ సిఐ సైదులు, ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి ఓఎస్‌డి బాలరాజులు ఫోన్‌లోమాట్లాడి నచ్చచెప్పిన తనకు మంత్రి హరీష్‌రావు స్పష్టమైన హామీనిస్తేనే టవర్ దిగుతానని స్పష్టం చేశారు. మంత్రి హరీష్‌రావు సిఎం కెసిఆర్ సమీక్ష సమావేశంలో ఉన్నాడని తర్వాత మాట్లాడిస్తామని నచ్చచెప్పిన టవర్ దిగేందుకు కిషన్ అంగీకరించలేదు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నా 3గంటల వరకు హైడ్రామా కొనసాగింది. సమీక్ష ఆనంతరం మంత్రి హరీష్‌రావు పిఎ రాజు కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి హరీష్‌రావుతో కిషన్‌కు ఫోన్‌లో మాట్లాడించారు. తాను సాయంత్రం వరకు సిద్దిపేటకు వస్తానని, మండలం విషయంపై చర్చిస్తామని హామీ నివ్వటంతో కిషన్ సెల్‌ఫోన్ దిగారు. దీంతో 6గంటల హైడ్రామాకు తెరపడింది.