మెదక్

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలులో అక్రమాలకు పాల్పడితే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, మార్చి 17: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలులో మధ్య దళారీల ప్రమేయాన్ని ఎంత మాత్రం ఉపేక్షించబోమని అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ సూర్యనారాయణ అన్నారు. గురువారం సంగారెడ్డిలోని ఎసిబి కార్యాయలంలో ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద నిబంధనలకు విరుద్ధంగా మద్య దళారులు చేరి బోగస్, బాల్య వివాహాలు జరిపించడం, నిధుల దుర్వినియోగానికి పాల్పడటం వంటి సంఘటనలు పాల్పడితే అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో విడాకులు పొందిన వారికి తిరిగి వివాహాలు జరిపించడం, రెండవ వివాహాలు, బాల్య వివాహాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు జహీరాబాద్, సదాశివపేట, న్యాల్‌కల్, జోగిపేట తదితర ప్రాంతాలలో ఎసిబి సర్కిల్ ఇన్స్‌పెక్టర్లు, తాను స్వయంగా పర్యటించి దళారిల ప్రమేయంతో పాటు పలు సంఘటనలపై ఆరా తీసినట్లు వివరించారు. ఈ రోజు వరకు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలులో ఏలాంటి అవకతవకలు, అక్రమాలు, దళారీల ప్రమేయం వంటి సంఘటనలు చోటు చేసుకోలేదని వివరించారు. ఈ విషయంలో ఏలాంటి పుకార్లను నమ్మరాదని ప్రజలకు సూచించారు. ఈ పథకాల కింద లబ్ధిపొందిన వారిని నేరుగా కలిసి వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఎవరైన అవినీతి, అక్రమాలకు పాల్పడే వెంటనే 9440446149 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల సహకారం ఉన్నప్పుడే అవినీతి, అక్రమాలను నివారించగలమన్నారు. జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు, విఆర్‌ఓలపై చాల ఫిర్యాదులు వస్తున్నాయని, తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.