కర్నూల్

నష్టపరిహారం ఎకరాకు రూ. 10 లక్షలివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సిపిఎం జాతీయ నాయకులు ప్రకాష్‌కారత్
ఓర్వకల్లు, డిసెంబర్ 18:సోలార్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మండ ల పరిధిలోని శకునాల గ్రామంలో భూ ములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ. 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జాతీయ నాయకులు ప్రకాష్‌కారత్ డిమాండ్ చేశారు. శకునాలలో శుక్రవారం ఆయన రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని పాటించలేదన్నారు. పరిశ్రమల స్థాపనకు గ్రామంలో 80 శాతం రైతుల అనుమతి ఉండాలన్నా రు. సోలార్ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ఈ నిబంధనను ప్రభుత్వం ఉల్లంఘించిందన్నారు. భూ సేకరణ చట్టం ప్రకారం మార్కెట్ ధరకు భూమికి 4 రెట్లు అధికంగా ఇవ్వాలని, రైతులకు పరిహారంతో పాటు పునరావాసం కూడా కల్పించాలని, నిబంధన ఉన్నా ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కిందన్నారు. దేశంలో ప్రతి చోటా భూసేకరణ చట్టం కింద పలు ప్రభుత్వాలు రైతుల భూములను తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాయని విమర్శించారు. శకునాల గ్రామ రైతులకు తాము అండగా ఉంటామన్నారు. అంతకుముందు ఆత్మహత్యకు పాల్పడిన రైతు మద్దిలేటి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి రూ. 5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
సభను అడ్డుకున్న కెడిసిసి బ్యాంక్ చైర్మన్
సోలార్ ప్రాజెక్టు భూ బాధితులతో సిపిఎం జాతీయ నాయకులు ప్రకాష్‌కారత్ సమావేశం జరుపుతున్న సమయంలో కెడిసిసి బ్యాంక్ చైర్మన్ మల్లికార్జురెడ్డి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు సమావేశానికి అడ్డుతగిలారు. నల్లజెండాలు పట్టుకుని పరిశ్రమల స్థాపనను అడ్డుకోవద్దని నినాదాలు చేశారు. ఈ సందర్బంగా మల్లికార్జునరెడ్డి ప్రకాష్‌కారత్‌తో మాట్లాడుతూ సోలార్ పరిశ్రమ వస్తే గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా ఉపాధి లభిస్తుందన్నారు. భూములు కోల్పోతున్న ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందని అందుకు సహకరించాలని కోరారు. పరిశ్రమల స్థాపనను రాజకీయం చేయవద్దని విన్నవించారు. నష్ట పరిహారం జాబితాలో ఒకటి రెండు పొరపాట్లు జరిగినా అందులో ప్రభుత్వ ప్రమేయం ఉండదన్నారు. గ్రామంలో అధిక శాతం ప్రజలు పరిశ్రమ స్థాపనను కోరుకుంటున్నారని, ఈ విషయాన్ని అన్ని పార్టీల నాయకులు గమనించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి.షడ్రక్, జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి, రాధాకృష్ణ, రైతు సంఘం జిల్లా నాయకులు రమేష్ కుమార్ పాల్గొన్నారు.