కర్నూల్

మార్చిలోగా నంద్యాల-యర్రగుంట్ల రైల్వేలైన్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* గుంటూరు-నంద్యాల మధ్య 2016 మార్చికి విద్యుత్ రైళ్ల పరుగులు..
* గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్ లైన్‌కు ప్రతిపాదనలు:దక్షిణ మధ్య రైల్వే జిఎం రవీంద్ర
నంద్యాల, డిసెంబర్ 18: 2016 మార్చి నాటికి నంద్యాల - యర్రగుంట్ల మధ్య రైల్వే లైన్ నిర్మాణాన్ని పూర్తి చేసి రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్త తెలిపారు. శుక్రవారం వార్షిక తనిఖీల్లో భాగంగా నంద్యాల రైల్వే స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2016 మార్చి నాటికి గుంటూరు - నంద్యాల మధ్య విద్యుద్దీకరణ పనులు పూర్తి చేసి గంటకు రూ.110 కి.మీ.ల వేగంతో విద్యుత్ రైళ్లను నడపనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే గుంటూరు - గుంతకల్లు మధ్య డబ్లింగ్ పనుల కోసం ప్రతిపాదనలు పంపామని, 2016 బడ్జెట్‌లో నిధులు మంజూరైతే పనులు ప్రారంభిస్తామని, డబ్లింగ్ లైన్ పనులు పూర్తయితే గుంతకల్లు, గుంటూరు మద్య రైళ్లవేగం పెరగడంతో పాటు కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. ప్రధాన జంక్షన్లలో ప్రయాణికులు రైళ్లను మారేందుకు గంటల తరబడి వేచి ఉండకుండ ఒక రైలు దిగిన అనంతరం మరో కనెక్టివిటీ రైలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం నంద్యాల నుంచి గుంటూరు వరకు రైల్వే ట్రాక్‌తో పాటు కొన్ని రైల్వే స్టేషన్లను తనిఖీ చేసినట్లు ఆయన తెలిపారు. రైళ్లు సక్రమంగా నడిపేందుకు అన్ని విభాగాలు ఏవిధంగా పనిచేస్తున్నాయో తెలుసుకోవడంతోపాటు భద్రత చర్యల పట్ల అధికారులను అప్రమత్తం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో గుంటూరు డివిజన్ కొత్తగా ఏర్పాటు అయిందని, ఈ డివిజన్‌ను ఇంకా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్త శుక్రవారం తెల్లవారుజామున సికింద్రాబాదు నుండి అన్ని శాఖల జోనల్ అధికారులతో కలసి ప్రత్యేక రైలులో నంద్యాల చేరుకున్నారు. నంద్యాల రైల్వే స్టేషన్‌లో గుంటూరు డి ఆర్‌ఎం విజయశర్మ, నంద్యాల స్టేషన్ మేనేజర్ వింజమూరి కృష్ణమూర్తి, ఎంప్లాయిస్ సంఘ్ నాయకులు జయరామిరెడ్డిలు జిఎంకు పూలబొకేతో స్వాగతం పలికారు. అనంతరం రైల్వే స్టేషన్‌లోని పలు విభాగాలను ఆయన తనిఖీ చేశారు. రైల్వే ట్రాక్‌ను పరిశీలించిన అనంతరం రైల్వే క్యాంటీన్ పనితీరును పరిశీలించారు. అలాగే క్రూ బుక్కింగ్ లాబీలో ఎలక్ట్రానిక్ బుక్కింగ్ సిస్టంను ఆయన ప్రారంభించారు. అలాగే రైల్వే స్టేషన్‌లోని జిఆర్‌పి స్టేషన్ శిధిలావస్థకు చేరుకుందని, జిఆర్‌పి పోలీసులు జిఎం దృష్టికి తీసుకురాగా, వెంటనే జిఆర్‌పి స్టేషన్ నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. రైల్వే కార్మికులు విశ్రాంతి తీసుకొనే రన్నింగ్ రూములో కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. రన్నింగ్ రూములో అల్పాహారాన్ని రుచి చూసి చక్కగా చేశారని నిర్వాహకునికి రూ.5 వేలు నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. నూతనంగా నిర్మించిన రైల్వే ఆసుపత్రిని డిఆర్‌ఎం విజయశర్మతో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం రైల్వే ఆసుపత్రిని పరిశీలించి అక్కడ కార్మికులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్న అనంతరం అక్కడ కూడా ఆసుపత్రి సేవలు చక్కగా ఉన్నాయని, రూ.5 వేలు ప్రోత్సాహకాన్ని అందజేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన కార్మికుల వసతి గృహాలను ప్రారంభించారు. ఈయన వెంట కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ దినేష్‌కుమార్ సింగ్, చీఫ్ ఇంజనీర్ కన్‌స్ట్రక్షన్ బికె సింగ్, దక్షిణ మధ్య రైల్వే ఆర్థిక సలహాదారు రాధాకృష్ణ, సిఎస్‌టిఇ మహబూబ్‌వలి, సిసియం లక్ష్మినారాయణ, సిఓఎం జెఎన్‌ధా, సిపివోఆర్‌ఆర్ ప్రసాద్, సిఎన్‌డి ఉషా, సిఎస్‌ఇ సంజయ్, సిఇఇ సోలన్ గుప్త, సిఎంఇ కబీర్ అహ్మద్, ఎస్‌డి జిఎం గజానన మాల్యా తదితరులు పాల్గొన్నారు.