దంతెవాడలో భారీ ఎన్‌కౌంటర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
భద్రాచలం, నవంబర్ 16: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్లుగా పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. భద్రత బలగాలు ఇంకా అడవుల్లోనే ఉన్నాయని వారు బయటకు రాగానే పూర్తి వివరాలు వెల్లడౌతాయని బస్తర్ ఐజీ కల్లూరి అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే... దంతెవాడ జిల్లా మటంపెర-గాడ్‌పల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారనే పక్కా సమాచారంతో బుధవారం మధ్యాహ్నం దంతెవాడ, సుక్మా జిల్లాల నుంచి డీఆర్‌జీ, సిఆర్‌పిఎఫ్, ఎస్టీఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. బుర్‌గూం పెరమా గ్రామ సమీపంలో మావోయిస్టులు భద్రతా బలగాలను చూసి కాల్పులు ప్రారంభించాయి. వెంటనే తేరుకున్న పోలీసులు కూడా కాల్పులు జరపడంతో దాదాపు గంటన్నర సేపు అడవి కాల్పులతో హోరెత్తింది. అనంతరం గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆయుధాలు, విప్లవ సాహిత్యం, ఇతర సామాగ్రి భారీ స్థాయిలో లభ్యమయ్యాయి. గాలింపు ఇంకా కొనసాగుతోంది. ఆరుగురు నక్సల్స్ చనిపోయినట్లుగా చెబుతున్నప్పటికీ ప్రస్తుతానికి ఇద్దరి మృతదేహాలే లభ్యమయ్యాయి. భారీ సంఖ్యలోనే చనిపోయారని పోలీసు వర్గాలు అంటున్నాయి.
చిల్లర కోసం అల్లాడుతున్న జనం
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, నవంబర్ 16: చిల్లర కోసం సామాన్యుడు చిందర వందరవుతున్నాడు... చిన్న నోట్లు లేక వ్యాపారులు డీలా పడుతున్నారు... ఒకప్పుడు బిచ్చగాళ్ళు మాత్రమే చిల్లర కోసం చేయి చాచేవారు. ఇప్పుడు సామాన్యుడు చిల్లర కోసం దేవులాడుతున్నాడు... కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేయడంతో గత వారం రోజులుగా ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటు పేద, మధ్య తరగతి వర్గాలకు చెందినవారు పాత నోట్ల మార్పిడికి డిపాజిట్లు చేయడంతో పాటు విత్‌డ్రాల కోసం బ్యాంకుల వద్ద పోటెత్తుతున్నారు. నోట్ల మార్పిడి కోసం వస్తున్న వారి కోసం ఆయా బ్యాంకుల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసినప్పటికీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఆధార్ కార్డును పరిశీలించిన పిమ్మట ఒక్కొక్కరికి రూ.4000 వంతున పంపిణీ చేస్తున్నారు. అయితే రెండు వేల రూపాయల నోట్లను మాత్రమే ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు. ఈ పరిణామం తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని వర్గాలకూ శిరోభారంగా మారింది. ఎక్కడ చూసినా రెండు వేల నోట్లే దర్శనమిస్తున్నాయి. దీంతో బహిరంగ మార్కెట్‌లో చిల్లర కొరత తీవ్రస్థాయికి చేరింది. నిత్యావసర సరుకులు, మందులు, పాలు, పండ్లు కొనేందుకు రెండు వేల నోట్లను వినియోగించాలంటే వ్యాపారులు పెద్దనోట్లను తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. చిల్లర ఉంటే ఇవ్వాలని, లేని పక్షంలో సరుకులు ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఎటిఎంలకు విత్‌డ్రాల కోసం వెళ్ళిన వారికి కూడా రెండు వేల రూపాయల నోట్లే పలుకరిస్తున్నాయి. కాగా బ్యాంకులు, పోస్ట్ఫాసుల ద్వారా చిన్న నోట్లను ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నప్పటికీ ఆచరణలో సాధ్యం కావడంలేదు. రద్దయిన రూ.500 నోట్లస్థానే కొత్త రూ.500 నోట్లు కూడా ప్రజలకు చేరువ కాకపోవడం సమస్యలకు కారణమయ్యిందని పలువురు వాపోతున్నారు. రూ.500 నోట్లను కూడా బ్యాంకులు జారీ చేయనున్నట్టు అధికారులు చెబుతుండగా, అసలు ముందుగా వెయ్యి కంటే రూ.500 నోట్లనే అందుబాటులో ఉంచివుంటే ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి కాదంటున్నారు. మరోవైపు ఆయా బ్యాంకులకు చెందిన ఎటిఎంలు నిత్యం పనిచేయకుండా మొరాయిస్తుండటం ఖాతాదారులకు శిరోభారంగా మారింది. ఎటిఎంలలో నగదును వెనువెంటనే లోడ్ చేయకపోవడంతో పలుచోట్ల ఎటిఎం సెంటర్లు అలంకారప్రాయంగా కనిపిస్తున్నాయి. గంటల తరబడి ఎటిఎంల వద్ద నిరీక్షిస్తున్న ప్రజల సహనానికి పరీక్షగా మారింది. ఏదైనా కొనుగోలు నిమిత్తం వెళితే నోటు విలువ ఎంతైతే అంత మొత్తంలో కొనుగోలు చేస్తేనే పాత రూ.500, రూ.1000 నోట్లను వ్యాపారులు స్వీకరిస్తున్నారు.
రాజమండ్రి నగరంలోని ఓ జాతీయ బ్యాంక్ వద్ద బారులు తీరిన ఖాతాదారులు