స్పాట్ లైట్

టోరీలు డీలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటన్ ప్రధాని థెరిస్సామేకు ఏదీ అనుకున్నట్టుగా కలిసిరావడం లేదు. బ్రెగ్జిట్ లక్ష్యాలను సాధించాలన్న ఆతృతతో ముందుస్తు ఎన్నికలకు సిద్ధమైన థెరిస్సామే ఇప్పుడు ప్రతిపక్ష లేబర్ పార్టీ నుంచి తీవ్రస్థాయిలోనే సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ముందస్తు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారం తమదేనన్న ఆశలు అధికార టోరీలకు రోజురోజుకూ ఆవిరవుతున్నాయి. ఈ పరిస్థితల్లో లేబర్ పార్టీని ఏ విధంగా ఎదుర్కోవాలన్నదని ప్రజల్లో పెరుగుతున్న ప్రతికూలతను ఏ విధంగా నిలువరించాలన్నది అధికార కన్జర్వేటీవ్ పార్టీకి అంతుపట్టడం లేదు. గత వారం రోజులుగా జరుగుతున్న ఎన్నికల సర్వేలు అన్నీ లేబర్ పార్టీకి అనుకూలంగానే ఫలితాలు అందించిన నేపథ్యంలో అధికార పార్టీ అధినేత్రి థెరిస్సామే మళ్లీ తమ ఎన్నికల ప్రచార వ్యూహానికి పదునుపెట్టడం మొదలెట్టారు. పరిస్థితిని ఇలాగే వదిలేస్తే అది లేబర్‌పార్టీ విజయానికి దారితీసే అవకాశం ఉంటుందన్న ఆందోళన మే కూటమిలో ఇప్పుడే మొదలైంది. విధానపరమైన లోపాలను సరిదిద్దుకుంటూ ప్రజలకు పూర్తి స్థాయి భద్రతను కల్పించాలన్న లక్ష్యంతోనే ఆమె కొత్త ప్రచార వ్యూహానికి పదునుపెడుతున్నారు. ఒకప్పుడు లేబర్ పార్టీకంటే కూడా అత్యధికస్థాయి ఆధిక్యత కలిగిన కన్జర్వేటీవ్ పార్టీ క్రమంగా డీలాపడడడం అన్నది ప్రధాని థెరిస్సాకు సంకటంగా మారింది. ఇందుకు అనేక అంశాలు కారణం అయ్యాయని ముఖ్యంగా ప్రధాని తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయని విశే్లషకులు చెబుతున్నారు. తీసుకున్న నిర్ణయాల విషయంలో వెనక్కితగ్గితే నాయకత్వ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. ఈ వాస్తవానికి విరుద్ధంగానే థెరిస్సామే ప్రకటించిన కొన్ని నిర్ణయాలు లేబర్ పార్టీ క్రమంగా పుంజుకోడానికి దారితీస్తున్నాయని సంకేతాలు వెలువడుతున్నాయి. తాజాగా గృహహింస నిరోధన, ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించి టోరీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు ప్రజల్లో కొంతమేర సానుకూల అభిప్రాయాన్ని పాదుగొల్పుతుందని చెబుతున్నారు. గత ఏడేళ్ల కాలంలో ఎంతో చేశామని చెబుతున్న అధికార పార్టీ రానున్న ఎన్నికల్లో గెలవడం అన్నది లేబర్‌పార్టీని కట్టడి చేయడంపైనే కాకుండా సొంత తప్పులను సరిదిద్దుకోవడం పైనే ఆధారపడి ఉంటుందన్నది ఎంతైనా నిజం.
బ్రిటన్ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ రాకపోతే మాత్రం ధెరీసామేకు ఇబ్బందికర పరిస్థితే ఎదురవుతుంది. ఆమె వేసే ప్రతి అడుగునూ గమనిస్తున్న లేబర్ పార్టీ నాయకత్వం ప్రతి వ్యూహాలతో ఎప్పటికప్పుడు చెక్ పెడుతూనే వస్తోంది. రెండు పార్టీల మధ్య ఇప్పటి వరకూ ఉన్న వ్యత్యాసం తగ్గడానికి..లేబర్ పార్టీ అనూహ్యంగా పుంజుకోవడానికీ ఇదే కారణం. లేబర్ పార్టీపై 20పాయింట్ల ఆధిక్యతతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ధెరీసా ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఎత్తుకు పైఎత్తు వేయాల్సిందే! ఈ విషయంలో ఏ మాత్రం తప్పటడుగు వేసినా అది ఎన్నికల్లో పరాజయానికే కాకుండా ఐరోపా యూనియన్ నుంచి అనుకున్న పరిమాణంలో బ్రిటన్‌కు ప్రయోజనాలను చేకూర్చే ప్రయత్నాలనూ దెబ్బతీస్తుంది. ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ అన్ని రకాలుగా తన హక్కులను సాధించుకోవాలంటే దేశ రాజకీయ పక్షాల్లో ఎలాంటి విభేదాలు ఉండకూడదు. అసలు ఐరోపా యూనియన్ నుంచి ఎందుకు తప్పుకోవాలన్న వాదన ఇప్పటికీ గట్టిగా వినిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలను తన వైపు తిప్పుకోవడమన్నది థెరిసాకు అసాధ్యమే. దీనికి విరుగుడుగానే ఆమె ముందస్తు పార్లమెంట్ ఎన్నికల పాచిక విసిరారు. ఇది అన్ని విధాలుగా కలిసొస్తే ఐరోపా యూనియన్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చి మరీ బ్రిటన్ ప్రయోజనాలను సాధించుకునే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో తమ డిమాండ్‌లో ఐక్యతాంటు లేకుండా బ్రిటన్ నష్టపోవడానికే ఎక్కువ అవకాశాలుంటాయన్నది నిజం. మరి థెరిసా ఈ సంకటాన్ని ఎలా అధికమిస్తారన్నది ఆసక్తిని కలిగించేదే.