స్పాట్ లైట్

సవాళ్లతో ముఖాముఖి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా అధ్యక్ష పదవిని ఇప్పటివరకూ చేపట్టిన అందరిలోనూ అత్యంత వివాదాస్పదుడిగా పేరుతెచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్ వంద రోజుల పాలన, అదేస్థాయి వివాదాలతోనూ, ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతతోనూ సాగిందనడం అతిశయోక్తి కాదు. గత ప్రభుత్వం తీసుకున్న విధానాలను రద్దు చేయడం, అవి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ వాటి ప్రాధాన్యతను విస్మరించడం అన్నది ఇతర దేశాల్లో ఉంటుందేమోకాని అమెరికా వంటి దేశంలో ఇలాంటి నిర్ణయాలు చాల అరుదే. కాని ట్రంప్ మాత్రం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకున్న కీలక నిర్ణయాలను తోసిరాజన్నారు. ముఖ్యంగా ఒబామా కేర్ ఎంతగానో జనానికి ఉపయోగపడ్డా, తన పాలనలో మళ్లీ అదెందుకు అంటూ దాన్ని అటకెక్కించారు. దీంతోపాటు ఇమ్మిగ్రేషన్ నిర్ణయాలు, అన్ని విషయాల్లో అమెరికాకు పట్టం కట్టాలన్న ఆలోచనలు ఎంతగా తమ దేశానికి ఉపయోగపడ్డా, ఇతర దేశస్థులెవరూ తమ దేశంలో ఉండడానికి వీలులేదన్న వీసా ఆంక్షలు ట్రంప్ వందరోజుల పాలన విషయంలో భిన్నాభిప్రాయాలకు ఆస్కారం ఇచ్చాయి. ముఖ్యంగా మెక్సికో సరిహద్దు చుట్టూ గోడ కడతాననడం అమెరికాలో ఉంటున్న ఆ దేశస్థుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. దేశీయంగా అనేక సవాళ్లు, సమస్యలను ఎదుర్కొంటూ వచ్చిన ట్రంప్, అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు కూడా అదేస్థాయిలో విస్మయానే్న రేకెత్తించాయి. ముఖ్యంగా సిరియా విషయంలో ఆకస్మికంగా ట్రంప్ ప్రభుత్వం దాడులకు దిగడం అంతకుముందు వరకూ చైనాతో ఉన్న సంబంధాలు మరింత క్షీణించేలా చేశాయి. అదేవిధంగా ఉత్తర కొరియాకు సంబంధించి కూడా తాజాగా ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు అంతర్జాతీయంగా భద్రతాపరమైన సవాళ్లను విసురుతోంది. ఉత్తర కొరియా విషయంలో ట్రంప్ నిజంగా దాడులకు దిగుతారా? ఒకవేళ అదే జరిగితే చైనా, రష్యాల నుంచి వచ్చే ప్రతిస్పందన ఏమిటి? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఉత్తర కొరియాను ఆదుకునేందుకు, దానికి అవసరమైన సాధన సంపత్తిని అందించేందుకు ఇటు చైనాతోపాటు, అటు రష్యాకూడా సన్నద్ధం కావడం, అనవసరమైన దాడులకు దిగితే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగానే ఉంటాయని చెప్పడం రానున్న రోజుల్లో అంతర్జాతీయ రాజకీయాలు ఏ రకమైన మలుపు తిరుగుతాయోనన్న ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మొత్తం మీద 100 రోజుల పాలనలో సాధించిన విజయాల కంటే కూడా రేకెత్తించిన వివాదాలే అత్యధికం అంటూ ప్రతిపక్ష డెమొక్రాట్లు తమ వాదనలతో హోరెత్తిస్తున్నారు. అయితే ట్రంప్ ప్రభుత్వం మాత్రం తమ అధ్యక్షుడు సాధించిన విజయాలు వందరోజుల వ్యవధిలో ఎవరూ సాధించనేలేదంటూ చెప్పడం విడ్డూరంగానే కనిపిస్తోంది.
పారిశ్రామికవేత్తగా ఎన్నో విజయాలను నమోదు చేసుకున్న ట్రంప్ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఆయన తీసుకున్న నిర్ణయాల తీరుపై అనుమానాలకు ఆస్కారాన్నిచ్చింది. అమెరికా అధ్యక్ష పదవంటే నల్లేరుపై బండినడక కాదన్న వాస్తవం ఆయనకు అనతికాలంలోనే బోధపడింది. అందుకు కారణం- అధ్యక్షుడిగా తాను చేపట్టిన ప్రతి నిర్ణయాన్ని ఇటు డెమొక్రాట్లు అటు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడమే. దాంతోపాటు ఇమ్మిగ్రేషన్ విధానాలకు కోర్టులు తరచూ అడ్డుకట్ట వేయడమే తన వంద రోజుల పాలన గురించి ట్రంప్ ఎంతగా చెప్పుకుంటున్నా ప్రజల్లో మాత్రం ఆయన పట్ల అనుకున్న స్థాయిలో సానుకూలత పెరగలేదన్నది నిజం. జరిగిందాన్ని బేరీజు వేసుకోవడం కంటే ఇక రాబోయే వంద రోజుల్లో ట్రంప్ ఏంచేయబోతున్నారు? గత తప్పటుడుగులను సరిదిద్దుకుంటూ తన ఆలోచనలను గుణాత్మక రీతిలో తీర్చిదిద్దుకోబోతున్నారా? చైనా నుంచి ఆర్థికంగా ఎదురవుతున్న సవాళ్లను ఏవిధంగా ఆయన అధిగమించే అవకాశం ఉంటుందన్నది ఆసక్తిని రేకెత్తించేదే. రానున్న మూడు నెలల్లో రాజకీయంగా ట్రంప్‌కు పెనుసవాలు లాంటి పరిస్థితే. తాను అనుకున్న విధంగా శాసనాలను తీసుకురావడానికి కాంగ్రెస్‌లో తన మద్దతును నెగ్గించుకోవడానికి సామరస్యపూర్వంగా వ్యవహరించాలే తప్ప దుందుడుకుగా, పట్టిందే పట్టుగా దూసుకుపోతే మాత్రం అపజయాలే ఎదురవుతాయన్న నిజాన్ని ఆయన గ్రహించాలి. దేశీయ సమస్యల మాట ఎలావున్నా, రష్యాతోను చైనాతోను క్రమంగా సంబంధాలు బెడిసికొడుతున్నాయి. ఇందుకు ఉత్తర కొరియా కేంద్ర బిందువు కాబోతోంది. అమెరికా అధ్యక్షుడిగా తాను అన్ని దేశాల ప్రయోజనాలను కాంక్షిస్తానంటూ చెబుతున్న ట్రంప్ తొలిసారిగా విదేశీ పర్యటనలకు కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ పర్యటనల్లో ఆయనకు అడుగడుగునా చుక్కెదురయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన పారిస్ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నానంటూ ప్రకటించడం సభ్యదేశాలన్నింటిలోనూ విఘాతక పరిణామాలకే దారితీస్తోంది. అమెరికా వంటి దేశాలు కాలుష్య ఉద్గారాల నియంత్రణ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ఇతర దేశాలు కూడా అదే బాటలో వెళతాయన్నది వాస్తవం. మెక్సికో సరిహద్దులో గోడ కట్టడం అంత తేలికైన విషయం కాదనే వాస్తవాన్ని ట్రంప్ గ్రహించారు. అందుకు అవసరమైన నిధులను సేకరించడం ఆనేది ఆయనకు తలకు మించిన భారమవుతోంది. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు సైతం ఈ సరిహద్దు గోడ నిర్మాణానికి విరాళాలు ఇచ్చేదిలేటంటూ బీష్మించుకు కూర్చున్నాయి. అధ్యక్షుడిగా తొలినాళ్లలో చేసిన వివాదాస్పద ప్రకటనలు, తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇప్పుడు ట్రంప్‌కు గుదిబండగా మారుతున్నాయి. నాటో దేశాల విషయంలో తన మాటలను వెనక్కు తీసుకోవడం ద్వారా కొంతమేర ఉత్సాహం పొందిన ట్రంప్ తన విదేశీ పర్యటనను ఏ విధంగా విజయవంతం చేసుకుంటారన్నది అనేక సానుకూల నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది.
*