స్పాట్ లైట్

కల చెదిరిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరోపా యూనియన్ నుంచి ఆగమేఘాల మీద వైదొలగిన బ్రిటన్ అంతిమ లక్ష్యాన్ని సాధించుకునే అవకాశం ఉందా? తాజా పరిస్థితులు, పరిణామాలను బట్టి చూస్తే ప్రధాని థెరిసామెకు ఇది కష్ట సాధ్యంగానే కనిపిస్తోంది. నిజానికి ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలన్న దానిపై దేశ ప్రజల్లో ఏ కోశానా ఏకాభిప్రాయం లేదు. స్వల్ప మెజారిటీతోనే ఇందుకు సానుకూలమైన తీర్పు వెలువడిందే తప్ప ప్రజల ఏకగ్రీవ ఆమోదంతో కాదు. ఈ నేపథ్యంలోనే దేశ రాజకీయ పార్టీల్లో కూడా భిన్నాభిప్రాయాలు, భిన్న స్వరాలు, వ్యక్తిగత విభేదాలు రోజురోజుకూ తీవ్రమవుతూ వచ్చాయి. బ్రెగ్జిట్ విషయంలో బ్రిటన్‌కు పూర్తి న్యాయం చేయాలన్నదే తన ఏకైక లక్ష్యమని కంకణం కట్టుకున్న ప్రధాని థెరిసా ఆ మార్గంలో ఏమాత్రం ముందుకు వెళ్లలేని అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మొదట్లో పార్లమెంటులో మెజారిటీ లేకపోవడం వల్లే బ్రెగ్జిట్ చర్చల విషయంలో పట్టుదలగా, ధైర్యంగా ముందుకు వెళ్లలేకపోతున్నానని భావించిన ఆమె ముందస్తుగానే పార్లమెంటు ఎన్నికలను నిర్వహించారు. కచ్చితంగా తమకు మెజారిటీ వస్తుందని, ఆ విధంగా ప్రతిపక్ష లేబర్ పార్టీతో నిమిత్తం లేకుండానే సొంత బలంతో ఐరోపా యూనియన్‌తో లాభదాయకమైన చర్చలు జరుపగలుగుతానని థెరిసా ఆశించారు. కాని ఆ పార్లమెంటు ఎన్నికల్లో అధికార కన్సర్వేటివ్ పార్టీకి ఉన్న మెజారిటీ కూడా పోయి మద్దతు ఇవ్వడానికి అనేక డిమాండ్లు పెట్టిన ఓ చిన్న పార్టీతోనే పొత్తు పెట్టుకుని మనుగడ సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకూ బ్రెగ్జిట్ విషయంలో ఐరోపా యూనియన్‌తో జరిపిన చర్చలేవీ అనుకున్న ప్రకారం ముందుకు సాగలేదు. తాజా పరిణామాలను బట్టి చూస్తే ఈ వ్యవహారం థెరిసా అధికారానికే ముసురు తీసుకువచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అసలు బ్రెగ్జిట్ చర్చల విషయంలో బ్రిటన్ ప్రయోజనాలను పరిరక్షించే మాట ఎలా ఉన్నా ఎలాంటి విభేదాలకు తావు లేకుండా దేశాన్ని సజావుగా పరిపాలించే సత్తా అయినా థెరిసాకు ఉందా అన్న సందేహాలకు కూడా తాజా పరిస్థితుల నేపథ్యంలో కలుగుతున్నాయి. ఈ వారంలోనే ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి సంబంధించిన బిల్లును కామన్ సభలో ప్రవేశపెట్టి ఆమోదాన్ని పొందాల్సి వుంది. అయితే ఐరోపా యూనియన్‌లోనే ఉండాలని పట్టుబడుతున్న టోరీలు (కన్సర్వేటివ్ పార్టీ) దీన్ని అడ్డుకునే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఈ బిల్లులో కీలకమైన మార్పులు చేయాల్సిందేనని అవసరమైతే ప్రతిపక్ష లేబర్ పార్టీతో చేతులు కలిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అధికార పార్టీ ఎంపీలు చెబుతున్నారు. అదే క్రమంలో అసలు అధికార పార్టీపై ప్రధానికి ఏమాత్రం పట్టు లేదని ఇటు లేబర్ పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రచారం చేయడంతో థెరిసా పరిస్థితి దిక్కుతోచని చందంగానే మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిల్లును ఆమె ఆమోదింపజేసుకునే అవకాశాలు సన్నగిల్లుతున్నాయన్న సంకేతాన్ని ఈ పరిణామాలు అందిస్తున్నాయి. దాదాపు 40 మందికిపైగా అధికార పార్టీ ఎంపీలే థెరిసాపై తమకు ఏమాత్రం విశ్వాసం లేదంటూ ఓ లేఖను కూడా అందించేందుకు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు బ్రెగ్జిట్ కుంపటిని మరింతగా రగిలిస్తున్నాయి. ఈ పరిస్థితులను బట్టి బ్రెగ్జిట్ చర్చలు కుప్పకూలినట్లేనా అన్న అనుమానాలకు ఆస్కారం ఏర్పడుతోంది. దాదాపుగా ఐరోపా యూనియన్ కూడా ఇదే అభిప్రాయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. కేవలం బ్రెగ్జిట్ చర్చలే కాదు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్ల థెరిసా మె ప్రభుత్వం కూడా కుప్పకూలిపోయే అవకాశం ఉందన్న సంకేతాలు కూడా ఈ పరిణామాల నేపథ్యంలో తలెత్తుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రిటన్ ప్రయోజనాల విషయంలో రాజీ పడకూడదని, ఈ విషయంలో ఏమాత్రం తొందరపడ్డా అనేక రకాలుగా ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడతాయని అధికార పార్టీకి చెందిన కొందరు ఎంపీలు హెచ్చరిస్తున్నారు. మరోపక్క అధికార పార్టీలో ఏర్పడ్డ ఈ లుకలుకలను రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు లేబర్ పార్టీ అన్ని రకాలుగానూ పావులు కదుపుతోంది. సొంత పార్టీపైనే పట్టులేని థెరిసాకు బ్రిటన్ ప్రయోజనాలను పరిరక్షించుకునే విధంగా బ్రెగ్జిట్ చర్చలను ముందుకు తీసుకెళ్లే సత్తాయే లేదని లేబర్ పార్టీ ప్రచారం మొదలుపెట్టింది. ఈ పరిణామాలన్నీ కూడా రానున్న కాలంలో థెరిసాకు ముందు నుయ్యి... వెనుక గొయ్యి లాంటి పరిస్థితిని కల్పించే అవకాశం ఉంది. ఎన్నో ఆశలతో బ్రిటన్ ప్రయోజనాలను పరిపూర్ణంగా పరిరక్షించడమే ధ్యేయమన్న రీతిలో ముందుకొచ్చిన థెరిసాకు అతి తక్కువ వ్యవధిలోనే అంతా ప్రతికూలంగా మారడం స్వయంకృతమా లేక తన మాటకు ఎదురు లేదన్న ధీమాతో ముందుకు సాగడమా? మొత్తం మీద చారిక్రత రీతిలో సాగిన బ్రెగ్జిట్ ఎన్నికలు అంతిమంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి? బ్రిటన్ సొంతంగానే మనుగడ సాగిస్తుందా లేక తూచ్... అంటూ ఐరోపా యూనియన్‌లోనే కలిసిపోతుందా అన్నది వేచి చూడాల్సిందే.

బి.రాజేశ్వర ప్రసాద్