స్పాట్ లైట్

మధ్యప్రాచ్యం కొలిక్కి వచ్చేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశాబ్దాల ఇజ్రాయెల్-పాలస్తీనా పెను సమస్యకు పరిష్కారం అందేదెన్నడు? ఇజ్రాయెల్‌తో జరుగుతున్న నిరంతర పోరాటంలో తల్లడిల్లుతున్న పాలస్తీనా ప్రజల హక్కుల్ని కాపాడేదెవరు? గతంలో అమెరికా జోక్యంతో శాంతి చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం రాలేదు. జార్జి బుష్, బరాక్ ఒబామా ఇలా ఒకరి తర్వాత ఒకరుగా వచ్చిన అమెరికా అధ్యక్షులు ఇజ్రాయెల్‌ను వెనకేసుకొచ్చారే తప్ప పాలస్తీనా వౌలిక డిమాండ్లను ఖాతరు చేయలేదు. తాజాగా అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ పర్యటనతో మళ్లీ కొత్త ఆశలు చిగురించాయి. ఇరు దేశాల మధ్య సఖ్యతకు ఆయన బలమైన సంకేతాలివ్వగలరన్న సంకేతాలూ వస్తున్నాయి. ఇది మధ్యప్రాచ్య సమస్య శాశ్వత పరిష్కారానికి దారితీస్తుందా? ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఘర్షణల స్ధానే సయోధ్యకు దారులు తీస్తుందా వేచిచూడాల్సిందే.

దీర్ఘకాలం తర్వాత మళ్లీ పాలస్తీనా - ఇజ్రాయిల్ అంశం తెరపైకి వచ్చింది. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సమస్య పరిష్కారం ఎప్పటికప్పుడు ఎండమావిగా మారుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్‌లో పర్యటించడం సరికొత్త ఆశలను రేకెత్తించింది. మొదట్నుంచీ పాలస్తీనా హక్కులను పక్కనపెట్టి ఇజ్రాయిల్‌ను వెనకేసుకుంటూ వచ్చిన అమెరికా ధోరణిలో మార్పు వస్తే తప్ప మధ్యప్రాచ్య సమస్యకు పరిష్కారం అందే అవకాశం లేదన్నది ఎంతైనా వాస్తవం. దేశాధ్యక్షుడుగా తొలిసారి ఇజ్రాయిల్‌లో అడుగుపెట్టిన ట్రంప్ ఏవిధంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు? రెండు వైరి దేశాల మధ్య సఖ్యతను సామరస్యాన్ని సాధించి మూల సమస్యను ఛేదించి శాశ్వత పరిష్కారాన్ని కనుగొంటారన్నది ఆసక్తి కలిగించే అంశమే. ముఖ్యంగా పాలస్తీనా ప్రజల వౌలిక హక్కులను కాపాడనంతవరకు వారి ఉనికిని గౌరవించనంతవరకు ఈ సమస్యకు పరిష్కారం లేదన్నది ఎంతైనా నిజం. తాజాగా ట్రంప్ ఇజ్రాయిల్ నాయకత్వంతో జరిపే చర్చల్లో పాలస్తీనా ప్రజల వౌలిక హక్కులకు సంబంధించిన అంశం లేకపోవడమన్నది ఈ పర్యటన వృథా ప్రయాసేనా అన్న అనుమానాలకు ఆస్కారమిస్తోంది. ఏకపక్షంగా ఇజ్రాయిల్‌ను బలపరిచినంతవరకు పాలస్తీనా హక్కులను విస్మరించినంతవరకు ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం అందే అవకాశమే ఉండదు.
ఇజ్రాయిల్ వల్ల ఎంతగానో నష్టపోయి తమ హక్కులను, ప్రాంతాలను కోల్పోయిన పాలస్తీనా ప్రజలు అమెరికా ఏకపక్ష ధోరణిపై నిప్పులు చెరగడమన్నది అతిశయోక్తి ఏమీ కాదు. మొదట్నుంచీ కూడా అగ్రరాజ్యమైన అమెరికా తమ హక్కుల పట్ల శీతకన్ను వేసిందన్న ఆవేదన, ఆందోళన పాలస్తీనా ప్రజల్లో వుంది. ఈ పర్యటనలో భాగంగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతో ట్రంప్ ఏ రకమైన చర్చలు జరుపుతారు? అందులో పాలస్తీనాకు సంబంధించి ప్రస్తావనకు వచ్చే అంశాలు ఏమిటన్నదానిపైనే అంతిమ ఫలితం ఆధారపడి వుంటుంది. పాలస్తీనా అథారిటీతో కూడా ట్రంప్ సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహవౌద్ అబ్బాస్ వాషింగ్టన్‌లో పర్యటించి మధ్యప్రాచ్య సమస్యకు సత్వర పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరం గురించి ట్రంప్‌తో చర్చించారు. ఇక్కడ శాశ్వత శాంతిని పాదుకొల్పేందుకు అమెరికా ఎలాంటి చర్యలు చేపట్టినా అందుకు తమనుంచి పూర్తిస్థాయిలో మద్దతు ఉంటుందన్న హామీని అందించారు. ఇంతగా పాలస్తీనా శాంతి కోసం వెంపర్లాడుతున్నా అమెరికా ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తే మాత్రం ఇజ్రాయిల్ హక్కులే హక్కులు అన్నట్లుగా దాని అధికారానికి వంతపాడే పక్షంలో అంతిమ ఫలితం పూజ్యమే అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలస్తీనాతో పోలిస్తే ఇజ్రాయిల్ అన్నివిధాలుగా ఆయుధ సంపత్తి కలిగిన బలమైన దేశం. మొత్తం మధ్యప్రాచ్యంలో అమెరికాలో తన ఉనికిని చాటుకోవాలంటే పట్టును బిగించి, ఆయా దేశాలపై పెత్తనం చెలాయించాలంటే కీలక మిత్రదేశమైన ఇజ్రాయిల్‌ను అన్ని విషయాల్లోనూ సమర్ధించక తప్పని పరిస్థితి అమెరికాకు ఉంటుంది. ఇదే ధోరణితో తన తాజా పర్యటనను ట్రంప్ ముగించుకుంటే మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఈ రెండు దేశాల సమస్య మిగిలిపోతుందనడం అతిశయోక్తి కాదు. ప్రపంచ శాంతి తమ బాధ్యత అంటూ వ్యవహరిస్తున్న అమెరికా ఈ విస్తృత లక్ష్యాన్ని సాధించే దిశలో ఏకపక్ష ధోరణికి ఆస్కారమివ్వకూడదు. మంచి చెడుల వివేచనతో ముందడుగు వేస్తేనే పాలస్తీనా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇటు పాలస్తీనా ప్రజలను, అటు ఇజ్రాయిల్ నాయకత్వాన్ని కూర్చోబెట్టి మాట్లాడితే తప్ప అసలు సమస్య ఏమిటో వెలుగులోకి వచ్చే అవకాశం ఉండదు. దీర్ఘకాలం తర్వాత అమెరికాకు వచ్చిన ఈ అవకాశాన్ని ట్రంప్ ఏవిధంగా సద్వినియోగం చేసుకుంటారో, తన ఇజ్రాయిల్ పర్యటనను మధ్యప్రాచ్య సమస్య పరిష్కారానికి బలమైన ఆయుధంగా ఉపయోగించుకుంటారన్నది వేచిచూడాల్సిందే. అంతేగాని ట్రంప్ వచ్చారు వెళ్లారు అన్న చందంగా ఈ వ్యవహారం సాగితే మాత్రం ప్రపంచ శాంతి సాధనలో మధ్యప్రాచ్య సమస్య జటిలమే అవుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఏ రెండు దేశాల మధ్య ఇంత తీవ్ర స్థాయిలో నిరంతర ఘర్షణలు చోటుచేసుకున్న దాఖలాలు లేవు. పైగా ఇజ్రాయెల్‌తో పోలిస్తే ఇటు సైనిక బలగం, ఆర్థిక శక్తి విషయంలో పాలస్తీనా ఎంత మాత్రం సరిపోదు. ఇంత చిన్న దేశాన్ని ఆదుకోవాల్సిన పెద్ద దేశాలు ఇజ్రాయెల్‌కే వంతపాడటమే అసలు సమస్య. ట్రంప్ పర్యటనతోనైనా ఈ వ్యవహారం ఓ కొలిక్కి వస్తే మొత్తం మధ్యప్రాచ్యమే శాంతి మండలం అవుతుంది. ఇది విశ్వ శాంతి సాధనకు ఎంతైనా కీలకం. ఐక్యరాజ్యసమితి సహా ప్రపంచ దేశాలన్నీ ఇందుకు సత్వర ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మధ్య ప్రాత్యం శాంతి మండలం కావాలంటే ముందుగా ఇరాన్ తన దారి మార్చుకోవాలంటూ గల్ఫ్ దేశాల పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికను పరిగణనలోకి తీసుకొని అన్ని దేశాలు ముందుకు సాగినప్పుడే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం ఇజ్రాయల్‌కు ధీమా అందించడానికే ట్రంప్ ఈ తాజా పర్యటన తలపెట్టి ఉంటే మాత్రం ఎలాంటి ఉపయోగం లేదన్నది కళ్లకు కట్టే వాస్తవం. ఇప్పటికైనా జటిల సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడం కేవలం ప్రాంతీయంగానే కాకుండా అంతర్జాతీయంగాను అత్యంత కీలకం.

ట్రంప్ ఇజ్రాయిల్ పర్యటనతో కొత్త ఆశలు
పాలస్తీనా హక్కులను విస్మరిస్తే సమస్య మళ్లీ మొదటికి

వారం గడుస్తున్నా వెనిజులా అనిశ్చితికి అంతూపొంతూ లేదు. అధ్యక్షుడు మదురో విధానాలను వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. వివిధ మార్గాల్లో వినూత్న రీతిలో వేలాదిగా ప్రజలు వీధికెక్కి ఉద్యమాలను సాగిస్తున్నారు. ఇదంతా విపక్షాల కుట్రేనంటూ కొట్టిపారేస్తున్న అధ్యక్షుడి భవితవ్యం ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. పారిపోతున్న ఓ నినసనకారుడికి గురిపెట్టి సాగుతున్న జల దాడి

- బి.రాజేశ్వర ప్రసాద్