స్పాట్ లైట్

సిరియాపై ఇంతే సంగతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంత చేరువో అంత దూరం అన్నట్టుగా తయారైంది అమెరికా, రష్యాల పరిస్థితి. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన రెండు అగ్రరాజ్యాల మధ్య సిరియా చిచ్చు రగులుకుంది. ప్రపంచ శాంతి కోసం తమ వద్దనున్న ఆయుధానలను భారీస్థాయిలో త్యజించడానికి అంగీకరించి ఈ రెండు దేశాలు ఓ సరికొత్త వొరవడికి బీజాన్నివేసి తమ శాంతికాముకతను చాటుకున్నప్పటికీ, ఇప్పుడు సిరియా వ్యవహారంలో మాత్రం ఎవరికి వారు తమదే పైచేయి అన్నట్టుగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అమెరికా రాజకీయాలతో నిమిత్తం లేకుండా సుదీర్ఘకాలంపాటు వ్యాపారంలోనే రాణించి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌కు అంతర్జాతీయ రాజకీయాలకు సంబంధించి ఓ స్పష్టమైన విధానంగాని, అవగాహనగాని లేకపోవడం, ప్రచ్ఛన్న యుద్ధ ప్రత్యర్థి అయిన రష్యాతో సానుకూలంగా ముందుకు వెళ్లే మార్గమే ఎప్పటికప్పుడు మూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సిరియా అధ్యక్షుడు అసాద్‌ను తొలగించడం అన్నది రెండు దేశాల మధ్య ఓ పెద్ద మీమాంశగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా మాత్రం సిరియాపై ఏ రకమైన నిర్ణయం తీసుకోలేని స్థితికి వచ్చేసింది. ఏళ్ల తరబడి సిరియాలో రగులుకున్న మంటలు ప్రాంతీయంగా అశాంతిని రగిలించటంతోపాటు, అంతర్జాతీయంగా కూడా శాంతియుత పరిస్థితికి చిచ్చు పెడుతున్నాయి. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నపుడు అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించి అమెరికా ఆలోచనల్లో ఒక రకమైన స్పష్టత ఉండేది. కాని, ట్రంప్ వచ్చిన తరువాత అంతా అగమ్యంగా మారింది.
బరాక్ ఒబామా హయాంలో అమెరికా రష్యాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవి. ట్రంప్ రావడంతో తమమధ్య సానుకూల బంధం పెంపొందుతుందని రష్యా నాయకత్వం బలంగానే ఆశించింది. అంతేకాదు, ముఖ్యంగా సిరియా విషయంలో ఉభయతారకమైన రీతిలో పరిష్కార మార్గాన్ని కనుగొనే అవకాశాలూ బలపడతాయని ఆకాంక్షించింది. కానీ, అవేవీ కనుచూపుమేరలో లేని పరిస్థితి నేడు నెలకొంది. ట్రంప్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా సిరియా సమస్య పరిష్కారం ఎండమావిగానే మారింది. ముఖ్యంగా సిరియా ఇరాక్ సరిహద్దులోని తన్ఫ్ పట్టణంలోను, అలాగే రఖ్ఖాలోనూ గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను బట్టి చూస్తే అమెరికా రష్యాల మధ్య సహకారం అన్నది ఓ భ్రమగానే మారిపోయింది. ఈ నేపథ్యంలో సిరియా వ్యవహారాల్లో ఇంకెంతమాత్రం జోక్యం చేసుకోకూడదన్న ఓ స్పష్టమైన నిర్ణయానికి రష్యా వచ్చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సిరియాను అడ్డంపెట్టుకుని పశ్చిమ దేశాలతో సానుకూల సంబంధాలను పెంపొందించుకునేందుకు రష్యా గట్టి ప్రయత్నమే చేసింది. అయితే అమెరికా వైఖరిలో స్పష్టత లేకపోవడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ విసిరిన ఈ పాచిక బెడిసికొట్టింది. ఉక్రెయిన్ విషయంలో దెబ్బతిన్న రష్యా, సిరియాను ఆలంబనగా చేసుకొని పశ్చిమ దేశాల మచ్చిక కోసం వేసిన ప్రతి అడుగూ కూడా ప్రతికూల పరిణామాలనే అందించింది. ఈ నేపథ్యంలో సిరియా వ్యవహారాల్లో మరింత తల దూర్చడంకంటే చేతులు దులిపేసుకోవడమే ఉత్తమమన్న నిర్ణయానికి పుతిన్ వచ్చేసినట్టుగా కనిపిస్తోంది. ఓపక్క సిరియా మరోపక్క ఇరాన్‌లు అమెరికాను రెచ్చగొడుతున్న నేపథ్యంలో వాటి మధ్య తలదూర్చడం అన్నది రాబోయే సాన్నిహిత్యానికున్న అవకాశాలకు కూడా గండికొట్టుకోవడమే అవుతుందని విజ్ఞతాయుత రీతిలో రష్యా పావులు కదుపుతోంది.