స్పాట్ లైట్

కొత్త పుంతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ ప్రధాని నరేంద్ర మోదీ పోర్చుగల్‌లో జరిపిన తాజా పర్యటన ఇరుదేశాల మధ్య రాజకీయ, ఆర్థిక మైత్రి బంధాన్ని బలోపేతం చేయడంతోపాటు ద్వైపాక్షిక సంబంధాలను కొత్త పుంతలు తొక్కించింది. అతి తక్కువ వ్యవధిలోనే ఇరుదేశాలు 11 ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకున్నాయంటే వీటి మధ్య 1947 నుంచి ఎప్పటికప్పుడు బలోపేతమవుతూ వస్తున్న పరస్పర సానుకూల అవగాహనకు ప్రత్యక్ష నిదర్శనం. పోర్చుగల్ ప్రధాని ఆంటోనియా కోస్టాతో భారత ప్రధాని మోదీ జరిపిన చర్చలు అనేక రంగాల్లో ఇరుదేశాల మధ్య విస్తృత స్థాయి సహకారానికి బలమైన బాటలు వేశాయి. ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాటం చేయడంతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కలసికట్టుగా ముందుకు సాగాలని ఇరువురు నిర్ణయించడం భవిష్యత్ సాన్నిహిత్యం మరింత నమ్మకాన్ని కలిగించేదే. ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధనలను బలోపేతం చేయడానికి ఉమ్మడి నిధితో ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సంకల్పించడం కూడా సానుకూల పరిణామం. ఇటీవల పర్యావరణ అంశంపై చెలరేగిన వివాదం నేపథ్యంలో ఈ అంశాన్ని మోదీ చాలా బలంగా ప్రస్తావించడం కూడా వాతావరణ మార్పులను నిరోధించడానికి రెండు దేశాలు కలసికట్టుగా పనిచేయాలన్న దృక్ఫదానికి అద్దం పట్టేవే. పోర్చుగల్‌లో అడుగుపెట్టిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నారు. ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృతం చేసుకోవడంతో పాటు ఉగ్రవాదాన్ని ఉమ్మడి చర్యలతో ఎదుర్కోవడానికి రెండు దేశాలను సమాయత్తం కావడానికి ఈ సమావేశం ఎంతగానో దోహదం చేసింది. ముఖ్యంగా రెండు దేశాల మధ్య సముద్రతీర అనుసంధానత ఉండడం వల్ల వ్యాపార, వాణిజ్యపరమైన సానుకూలత ఎప్పటికప్పుడు విస్తరిస్తూ వచ్చింది. తాజాగా డిజిటల్ సంబంధాలను కూడా పెంపొందించుకోవాలని ఇరుదేశాలు సంకల్పిండం వల్ల ద్వైపాక్షిక సంబంధాలను కొత్త మలుపుతిప్పే అవకాశం ఉంటుందనడంతో ఎలంటి సందేహం లేదు. ప్రభుత్వ పరంగా సహకారాన్ని పెంపొందించుకుంటునే సాంస్కృతికంగా కూడా ఇరుదేశాలు మరింత చేరువకావడానికి మోదీ పర్యటన ఎంతగానో దోహదం చేసింది. శాస్త్ర సాంకేతిక విద్యారంగాల్లో పరస్పరం సహకరించుకోడవంతో పాటు ఉమ్మడి ప్రయోజనాల కోసం అంతరిక్ష పరిశోధనలను చేపట్టాలన్న బలమైన ఆకాంక్ష ఇరుదేశాల్లోనూ ద్యోతకమైంది. ముఖ్యంగా ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్న భారత్‌కు పోర్చుగల్ మద్దతును అందించడం సుహృద్భావ మైత్రి బంధానికి మరింత ఊతమే.