స్పాట్ లైట్

వ్యూహాత్మక బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్- అమెరికాల మధ్య సరికొత్త రీతిలో స్నేహసౌరభం వెల్లివిరిసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిపిన విస్తృత స్థాయి చర్చలు రెండు దేశాల మధ్య గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన స్నేహబంధాన్ని మరింత పటిష్టపరిచాయి. ఓ పక్క అంతర్జాతీయ ఉగ్రవాదంతో పాటు అంతర్గత సమస్యలను ఎదుర్కొంటున్న అమెరికా దక్షిణాసియాలో భారత్‌ను బలమైన మిత్రదేశంగా, ప్రధాని మోదీని నిజమైన మిత్రుడిగానే భావించి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలను అందించేందుకు ముందుకు రావడం అన్నది అనేక రకాలుగా ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ఆశావహ పరిణామమే. గతంలో ఎన్నడూ లేని రీతిలో భారత్-అమెరికాల మధ్య ద్వైపాక్షిక, ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం కావడానికి అనేక ప్రాంతీయ,అంతర్జాతీయ అంశాలపై ఈ రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య భావసారుప్యత, పరస్పర విశ్వసనీయత ఉండడమే నిదర్శనం. గత మూడేళ్ల కాలంలో అమెరికా సహా అన్ని దేశాలతో మోదీ సారధ్యంలోని ఎన్‌డిఏ సర్కార్ బలమైన, స్థిరమైన, విశ్వసనీయమైన సంబంధాలు పాదుగొల్పుకోవడమే లక్ష్యంగా పనిచేస్తూ వచ్చింది. అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ భారత దేశంలో ఎన్‌డిఏ పగ్గాలు చేపట్టినప్పటికీ ఈ రెండు దేశాల సంబంధాల విషయంలో ఎడతెగని బాంధవ్యమే కొనసాగుతోంది. ముఖ్యమంత్రి మోదీ ప్రభుత్వం తీసుకున్న అనేక సంస్కరణలు అమెరికా ఇనె్వస్టర్లలో సరికొత్త ఉత్సాహాన్ని పాదుగొల్పాయని అని చెప్పడానికి అనేక భారీ కంపెనీలు గరిష్టస్థాయి పెట్టుబడులతో భారత్‌లోకి అడుగుపెడతామని చెప్పడమే నిదర్శనం. అన్నింటి కంటే ముఖ్యంగా మోదీతో ట్రంప్ సమావేశానికి ముందే ఉగ్రవాదం కూకటి వేళ్లు పెకిలించే రీతిలో అమెరికా అత్యంత కీలకమైన నిర్ణయమే తీసుకుంది. ఎప్పటికప్పుడు కాశ్మీర్ సమస్యను ఎగదోస్తూ హింసాకాండను రగిలిస్తూ అరాచకాన్ని సృష్టిస్తున్న హిజ్బుల్ ముజాహిదిన్ ఉగ్రవాది సలాహుద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం ఈ చర్యద్వారా ఉగ్రవాద నిర్మూలన విషయంలో కలసికట్టుగా సాగుదామన్న దృఢ సంకల్పాన్ని వ్యక్తం చేయడమే కాకుండా భవిష్యత్‌లో కూడా చెక్కుచెదరని రీతిలో భవిష్యత్‌లో కూడా ఇదే స్థాయిలో పరస్పర సహకారం కొనసాగించడం కోసం ఇరుదేశాలు సమాయత్తం కావడం మరింతగా నమ్మకాన్ని పెంచే పరిణామం. అంతర్జాతీయ శాంతి భద్రతలకు పెను విఘాతం కలిగించే ఉగ్రవాదమే అనేక రకాలుగా ప్రపంచ దేశాలను కకావికలు చేస్తోంది. ఈ మహమ్మారిని కూకటి వేళ్లతో సహా పెకిలించివేయాలంటే అది భారత్- అమెరికాలు పరిష్టమైన రీతిలో పరస్పరం సహకరించుకోవడం ఒక్కటే మార్గం. ఇదే విషయం మోదీ, ట్రంప్ చర్చల్లో భిన్నకోణాల్లో భిన్నపార్శ్వాల్లో స్పష్టమైంది. వ్యాపార, వాణిజ్య రంగాల్లో మరింత చేరువ కావడంతోపాటు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కూడా ఇరుదేశాలు పెంపొందించుకునే దిశగా బలమైన అడుగులే వేశాయి. యుపిఏ హయాం నుంచి నేటి ఎన్‌డిఏ పాలన వరకూ.. కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ భారత్-అమెరికాల మధ్య తిరుగులేని మైత్రి బంధమే కొనసాగుతోంది. దక్షిణాసియాలో బలమైన శక్తిగా ఎదుగుతున్న భారత్‌లో సన్నిహిత సంబంధాలు అమెరికాకు అత్యంత కీలకం. ఇటు చైనా దూకుడుకు కళ్లెం వేయాలన్న అటు పాకిస్తాన్ ఉగ్రవాద చేష్టలను అరికట్టాలన్నా కూడా ఈ రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు సన్నిహితం కావల్సిందే. అందుకు మోదీ పర్యటన స్ఫూర్తిదాయకమైన రీతిలోనే ఊతాన్నిచ్చింది.

- బి. రాజేశ్వర ప్రసాద్