స్పాట్ లైట్

కొరియాపై కింకర్తవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర కొరియా విషయంలో అన్ని దారులూ మూసుకుపోతున్నాయి. అటు ఐరాసను, ఇటు అగ్రరాజ్యాన్ని ధిక్కరిస్తూ అణు బలంతో విర్రవీగుతున్న ఉత్తర కొరియాను దారికి తేవడానికి దౌత్యం ఎంతమాత్రం ఫలించదన్న బలమైన వాదన వినిపిస్తోంది. ఇప్పటివరకూ క్షిపణి పరీక్షలతో పొరుగున ఉన్న దక్షిణ కొరియాను, అగ్రరాజ్యమైన అమెరికాను రెచ్చగొడుతూ వచ్చిన ఉత్తర కొరియా తాజాగా అణు పరీక్ష నిర్వహించడం సర్వత్రా హాహాకారాలు రేకెత్తిస్తోంది. ఈ కొరకరాని కొరియాను దారికి తెచ్చుకోవాలంటే ఆంక్షలు పనికిరావని, అంతకుమించిన స్థాయిలోనే చర్యలను చేపట్టక తప్పదన్న వాదన కూడా పదునెక్కుతోంది. చమురు పరంగా ఆంక్షలు విధిస్తే తప్ప ఉత్తర కొరియాను గట్టిగా అదుపుచేయడం సాధ్యం కాదన్న వాస్తవం తేలిపోయింది. ఇది జరిగితే తప్ప మొత్తం ఉత్తర కొరియా సంక్షోభం పడిపోయే అవకాశం ఉండదు. అలాంటి పరిస్థితులను కల్పించగలిగితే అణు బలాన్ని ప్రదర్శించడం కంటే కూడా అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొవడమే ఉత్తర కొరియాకు ప్రధాన సమస్యగా మారుతుంది. ఇప్పటివరకూ ఉత్తర కొరియా తీసుకున్న చర్యలన్నీ కూడా దాదాపు అన్ని దేశాలనూ ఏకకాలంలో కవ్వించే రీతిలో ఉన్నాయే తప్ప సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకునేందుకు దోహదపడేవిగా లేవు. ఒకవేళ యుద్ధమే జరిగితే... దానే్న గనుక ఉత్తర కొరియా కోరుకుంటే కోలుకోని రీతిలో నష్టపోయేది కిమ్ జోంగ్ రాజ్యమేనన్నది కళ్లకు కడుతున్న వాస్తవం. అయితే ఈ యుద్ధ పర్యవసనాలు కేవలం ఉత్తర కొరియాకు మాత్రమే పరిమితం కావు. దాని పరిణామాలు అనేక రకాలుగా ఇతర సమస్యలకూ దారితీసే అవకాశం ఉంటుంది. అంతేగాదు, హిరోషిమాను మించిన స్థాయిలో మరణాలకు అది తెరతీసే సంకేతాలూ స్పష్టం. దౌత్యపరంగానే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవాలన్నది ఆధునిక రీతి, నీతి. అయితే ఇలాంటి ప్రయత్నాలు గతంలోనూ జరిగాయి. వాటిని ఎప్పటికప్పుడు తిరస్కరించడంతోపాటు కయ్యానికే తాము సిద్ధమన్న రీతిలో ఉత్తర కొరియా రెచ్చిపోతూ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో దౌత్య ప్రయత్నాలతో ఉత్తర కొరియా సమస్యను పరిష్కరించాలన్నదానిపై మెజారిటీ దేశాల నుంచి సానుకూల ప్రతిస్పందన రావడం లేదు. తాజా అణు పరీక్ష ద్వారా అణువ్యాప్త నిరోధక ఒప్పందానే్న ఉత్తర కొరియా ధిక్కరించింది. దాన్ని తూటు పొడిచింది. ఈ విషయంలో ఉత్తర కొరియాను దారికి తెచ్చేందుకు శాంతి సంయమన మార్గాల్లో సమస్యను పరిష్కరించేందుకు పియోంగ్‌యాంగ్, బీజింగ్, వాషింగ్టన్, టోక్యో, మాస్కో, సియోల్‌ల మధ్య ఆరు దఫాలుగా చర్చలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ హయాంలో ఈ ఆరు దేశాలు ఈ సమస్యను పరిష్కరించేందకు ఎడతెగని ప్రయత్నాలు చేసినా ఎలాంటి ప్రయోజనాలు కనిపించలేదు. అణు కార్యక్రమాన్ని వదిలిపెట్టాలంటూ ఉత్తర కొరియాను బుజ్జగించినా, గట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా దాని నాయకత్వం మాత్రం నిమ్మకు నీరెత్తిన చందంగానే వ్యవహరించింది. ఉత్తర కొరియా నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో సమస్యల కూపంలోకి నెట్టివేయడమే దాని బరితెగింపును అడ్డుకోవడానికి ఏకైక మార్గమన్న వాదన వినిపిస్తోంది. ఇందులో భాగంగా అక్కడనుంచి జరిగే ఎగుమతులు, ఆ దేశ నాయకత్వం చేసుకునే దిగుమతులను పూర్తిగా అడ్డుకోవడంపై ప్రపంచ నాయకత్వం దృష్టి సారిస్తోంది. ఈ రకమైన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకున్న తర్వాత ఉత్తర కొరియా దారికి రాకపోతే దానిపై దండెత్తడమొక్కడే మార్గమవుతుందన్న అంశాన్ని పరిశీలిస్తోంది.