మొదలైన పెట్రో ట్యాంకర్ల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 29: డీజిల్, పెట్రోల్ ట్యాంకర్ల యజమానులు నేటినుంచి సమ్మె చేస్తున్నట్టు ప్రకటించారు. పెట్రో ఉత్పత్తులపై 14.5 శాతం వ్యాట్ ఉపసంహరించాలన్న డిమాండ్‌తో సమ్మెకు దిగినట్టు ట్యాంకర్ల యజమానుల సంఘం ప్రకటించింది. వ్యాట్‌ను ఎత్తివేయాలన్న తమ దీర్ఘకాలిక డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించనందున సమ్మెకు పూనుకున్నట్టు తెలిపారు. తెలంగాణవ్యాప్తంగా 3500 ట్యాంకర్లు నిరంతరం సేవలందిస్తున్నాయని, ప్రభుత్వం ఇటీవల పెంచిన 5 శాతం ట్రాన్స్‌పోర్టు చార్జీలను రద్దు చేసుకోవాలని ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో ఆదివారం జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచే సమ్మెలో పాల్గొనాలని అసోసియేషన్ పిలుపునిచ్చింది. దేశంలోని ఏ రాష్ట్రం కూడా 5 శాతం ట్రాన్స్‌పోర్ట్ చార్జీని విధించడం లేదని 2011లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 శాతం ట్రాన్స్‌పోర్ట్ చార్జి విధించి విఫలమైందని డీజిల్, పెట్రో ట్యాంకర్ల యజమానుల సంఘం నాయకులు ఎన్ దినేష్ రెడ్డి, జి వినయ్‌కుమార్, ప్రభాకర్ రెడ్డి, రాజీవ్ అమారం, కళాధర్ అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం 14.5 శాతం వ్యాట్‌ను ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో నిరవధిక ట్రాన్స్‌పోర్ట్ బంద్‌ను పాటిస్తూనే ఆందోళన ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు. తెలంగాణలో ట్రాన్స్‌పోర్ట్ బంద్‌కు ఆంధ్రప్రదేశ్ డీజిల్, పెట్రో ట్యాంకర్ల అసోసియేషన్ తమ సంపూర్ణ మద్దతును ప్రకటించిందని వారు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి కొనసాగే ట్రాన్స్‌పోర్ట్ బంద్‌కు అందరూ సహకరించాలని వారు కోరారు.