బాబుకు ముందే ఎలా తెలిసింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: కరెన్సీ నోట్ల రద్దు విషయం ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముందే తెలిసిందని, ప్రధాని తీసుకున్న నిర్ణయం చంద్రబాబుకు ఎలాతెలిసిందో కేంద్రం నిఘా పెట్టాలని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఐదు వందలు, వెయ్యి కరెన్సీ నోట్ల రద్దును స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు. బుధవారం ఆయన ఇక్కడ లోటస్‌పాండ్‌లో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ కరెన్సీ నోట్ల రద్దును ముందుగానే తెలుసుకుని చంద్రబాబు జాగ్రత్తపడ్డారన్నారు. ఓటుకు నోట్ల కేసులో రూ.500 నోట్ల కట్టలను రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు పంపించారని ఆయన గుర్తు చేశారు. ఒక వైపు కరెన్సీ నోట్లు రద్దు అవుతాయని గ్రహించి జాగ్రత్తపడడం, ఈ నోట్లను రద్దు చేయాలని కేంద్రానికి లేఖలు రాయడం లాంటి పనులను చంద్రబాబు చేశారన్నారు. ముందుగానే నోట్లను రద్దు చేయాలని తానే కోరినట్లు కితాబులు ఇచ్చుకుంటారని ఆయన విమర్శించారు. దేశంలో 60 శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని, ఆరు లక్షల 3 వేల గ్రామాలు దేశంలో ఉన్నాయన్నారు. అక్కడ కేవలం 38 వేల బ్యాంకులు ఉన్నాయన్నారు. భారీ మొత్తంలో లావాదేవీలు జరపడానికి చాలా ఇబ్బందులు ఏర్పడవచ్చన్నారు. రాత్రికి రాత్రే పెద్ద నోట్లను రద్దు చేయడంతో ప్రజలంతా ఆందోళనలో ఉన్నారన్నారు. గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వాలు దానికి తగ్గట్టు ప్రజలకు ఇబ్బందులు ఏర్పడకుండా ముందుకు వెళ్లాలని ఆయన కోరారు.