తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

ఘటనల సుడిగుండంలో మేధావులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నపిల్లవాడు మారాం చేస్తాడు. ఇవ్వలేని దానిని తెచ్చి ఇవ్వమని అడుగుతాడు. ఇన్నాళ్లు తనది అనుకున్న వస్తువు పరులపాలైపోతుంటే గింజుకుంటాడు. 3‘గీ’2 పెడతాడు. కేకలేస్తాడు. అప్పుడు పెద్దలు తెలివిగా వాడి దృష్టిని మరలుస్తారు. అలా మరల్చడానికి అబద్ధాలు చెబుతారు. ఐనా ఏడుస్తాడు. ఏడ్చి ఏడ్చి వాడు అలసిపోతాడు. పెద్దలు వాడిని పక్కదారి పట్టించే ప్రయత్నాలు అనేకం చేస్తారు. తల్లిదండ్రులే కాదు. అమ్మమ్మలూ తాతయ్యలు ఈ విషయంలో అందరూ ఒకటవుతారు. పాపం వాడికి ఇతర బాధిత పిల్లలు ఎవరూ సహాయానికి రారు. రాలేరు. వాడు ఒంటరి అవుతాడు. ఎదిగే చిన్న దేశం సామ్రాజ్యవాద దేశాల కూటమి వలలో విలవిలలాడినట్టు.
పెద్దలు, పిల్లవాడి మనసుని మరల్చడానికి ఏదో ఒక భీకర శబ్దాన్నో, అద్భుతం వంటి దాన్ని ఏదో సృష్టించి భ్రమ కల్పిస్తారు. వాడి అంతరాలల్లో వాడికి తెలుసు. కాని వాటిని ప్రతిఘటించలేక, ఆ ఘటన ప్రభావంలో పడిపోతాడు. తెలిసి కూడా ఏమీ చేయలేనితనంతో కూరుకుపోతారు. అలాంటి పసిపిల్లల పరిస్థితి ఇప్పుడు మేధావులకు దాపురించింది. దాన్ని గురించి చూద్దాం.
పిల్లలు ప్రజల వంటివారు. పెద్దలది పాలకుల స్వభావం. కుటుంబం రాజ్యం వంటిది. రాజ్యంలో ఘటనలు సృష్టింపబడి ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించడానికే యంత్రాంగం నిర్మింపబడి ఉంటుంది. దానివల్ల కొన్ని పనులు సాధ్యం కానప్పుడు రాజ్యాన్ని నడిపేవారు ప్రజలను భయపెడతారు. భయానికి బూచోడిని సంకేతం చేస్తారు. వాడి పేరు చెప్పి వాడి ఆహార్యం గురించి భయం గొలిపేలా చేస్తారు. వాడు తాటకిలా కొడతాడు. మదించిన పులిలా పైబడి చంపుతాడు. మాంత్రికుడిలా గుహలో బంధిస్తాడు. ఆ బూచోడే మనకు పోలీసు. ఓ చేతిలో లాఠీ, మరోచేతిలో తుపాకీ. క్షణాల్లో దాడిచేసి చంపగలడు. ఎక్కడున్నా పట్టేసి లాకర్లో బంధించగలడు. కారణం లేకుండా జైల్లో తోయగలడు. ఇప్పుడు ప్రజలను పోలీసు బూచి చూపి భయపెడుతున్నారు.
నిజానికి ఆనాడు బూచోడు లేడు. అది భ్రమ. మనం కల్పించిన కల్పన. కాని ఇప్పుడు బూచోడంటే పోలీసు. ఒక్కడు కాదు, వందలమంది పోలీసులు కళ్లముందు కనిపిస్తారు. అందుకే గద్దెనెక్కే ముందే పాలకులు పోలీసులను మచ్చిక చేసుకుంటారు. గద్దెక్కే ముందే వారికి బూచాళ్ల ప్రతాపం తెలుసు. వారిలో కూడా ఎక్కడో బూచాడి భయం పట్టి పీడిస్తుంటుంది. అందుకే పీచు మిఠాయిల పంపిణీ. ఎన్ని కానిపనులు చేసినా ఈ బూచాడి దన్ను ఉంటేచాలు. దేవుడైనా తప్పు చేస్తాడేమో కాని బూచాళ్లు తప్పు చేయరు. పిల్లల్లో మంచివాళ్లుంటారు. మొండివాళ్లుంటారు. అంద రూ భయపడేది బూచాళ్లకే. పెద్దలు పిలిస్తే తలుపు చాటున చటుక్కున వాలేది వాళ్లే. చీకట్లో క్రౌర్యంతో కళ్లముందు కళ్లెర్ర చేసేది వాళ్లే. భయం గుండెల్లో గూడు కట్టేలా, నిరంతర ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది.
ప్రజల దృష్టి మరల్చడానికి బూచాళ్లు ఎప్పుడూ ముందుంటారు. వాళ్లు చాలా సృజనశీలురు. కాల్పనిక రచనా దురంధరులు. వినూత్న, అత్యాధునిక నాటకరంగ నిపుణులు. కాళిదాసు, షేక్స్‌పియర్ వాళ్లముందు బలాదూర్. వీరు ఘటనలు అనే నాటకంలోని అంకాలను సృష్టించడంలో సిద్ధహస్తులు. అది వీలుకానప్పుడు, మరికొంతమంది పెద్దలు తోడ్పడి రకరకాల సంఘటనలను రచిస్తారు. పిల్లలు దానిగురించే ఆలోచించాలి. అందులో పడిపోయి అన్ని సమస్యలను, మానసిక ఆందోళనలను మరిచిపోవాలి.
ఘటనని వ్యతిరేకిస్తూ కరపత్రాలు రాయాలి. పోస్టర్లు వేయాలి. ప్రెస్‌మీట్‌లో వాటిని విడుదల చేయాలి. ప్రెస్‌నోట్లు పంచాలి. తీసిన ఫోటోలు వార్తలు కావాలి. వార్తలను తెల్లారి తామే చదవాలి. రకరకాల సభలు, సమావేశాలు పెట్టాలి. రాతల్లో, ఉపన్యాసాల్లో, ప్రెస్‌మీట్లల్లో వీరావేశంతో ఖండించాలి. ఎంతగా ఖండించాలంటే యిక ఇంతకన్నా వేలరెట్ల పాశవిక ఘటనలేవీ జరగనట్లు కనబడనంతగా ఖండించాలి. ఈ ఖండనల పర్వంలో మొత్తం సమాజం జ్వరపీడితం కావాలి. చివరి ఘట్టంలో కొన్ని వందల మందిలో పదుల మంది వక్తలతో సభ ముగుస్తుంది. అంతే. మరో ఘటన కోసం ఎదురు చూడాల్సిందే. మధ్య మధ్యలో విశ్రాంతి. పాలకులు ప్రసాదించిన విరామం. తెర తెరుచుకోవడం కోసం మేధావుల కళ్ళు మిటకరింపులు.
పెద్దలు పిల్లల్ని ఏడిపిస్తుంటారు. వారి బొమ్మల వినోదాన్ని విషాదం చేస్తారు. నేలతల్లి వంటి ఉయ్యాలలను వాళ్ల శరీరాలనుండి లాక్కుంటారు. రంగురంగుల కాగితాల కలలపై ఉక్కుపాదాలు మోపుతారు. మళ్లీ మారాం. మళ్లీ ఖండనలు. సంఘటనలకు ఖండనలు తప్ప-ఆ సంఘటనలు ఎప్పుడెప్పుడు, ఎందుకు సృష్టింపబడుతున్నాయో తెలియచెప్పలేని మేధావిత్వం విజృంభిస్తున్న తరం. నగరాల్లో మేధావులు తగ్గి, యాంత్రిక కార్యకర్తలు పెరిగారు. ప్రగతిశీల సిద్ధాంతాల వికాసం, అన్వయం ఢీలా పడింది.
ఒక ఎదురుదాడి ఘటన జరగగానే సిద్ధంగా ఒక స్క్రిప్టు తయార్. అంతే. అదేపని. సమాజాన్ని సిద్ధం చేయలేని తేలికతనం. ఉదయం కాగానే హోటల్ ముందు 3‘్భజనం తయారు’2 లాగా అప్పటికప్పుడు వ్యాసాలు పత్రికలలో ప్రత్యక్షం. రాసేవాళ్లకు ఘటనకు ముందే ఎలా తెలుసా అని విస్తుపోవడం చాలామందికి షరా మామూలే. ప్రసాదంలు బహిరంగంగా చంపబడతారు. కొన్ని ప్రాణాలు సేదతీరతాయి. వాళ్ళ రక్తం గడ్డకట్టేలోపే పత్రికలు తాజా వ్యాసాలు, ప్రచురించి తమ ప్రత్యేకతను రుజువు చేసుకుంటాయి. ఎందుకు చంపబడ్డారో కారణాలు అనే్వషించరు. మళ్లీ ఏనాడూ గురించి మాట్లాడబడదు. అలా మాట్లాడితే మరణించినవాడు విగ్రహం అవుతాడని కొంతమంది అతని పూర్వ సహచరుల భావన. కాని వాళ్ళ గురించి రాసిన వాళ్లు కాలరెత్తి, ముసిముసి నగవుల విగ్రహంగా మారడంకోసం నిరీక్షిస్తుంటారు. ప్రభుత్వం దగ్గర వర్షాలకోసం మేఘమథనం ప్రణాళిక, బడ్జెట్‌లో సిద్ధంగా ఉన్నట్లుగా ఈ మేధావి రచయితలు కొందరి గుర్తింపుల్ని మన్ననల్ని నిచ్చెన మెట్లు చేసుకునే ప్రయత్నాలు నిరంతరం జరుగుతుంటాయి. తామే హీరో కావాలనుకుంటారు. కాని నమ్మిన సిద్ధాంతాలు జీరో అవుతుంటే దాని గురించి ఏమాత్రం ఆలోచించరు.
ఈ కోవకు చెందిన రచయితలకు మేధావులకు 3ఘటనలు లేకపోతే వారి అస్తిత్వమే లేదు. నిరీక్షణలో కాలం గడిచిపోతుంది. వెనకటికి తపస్సులాగే ఇప్పుడు నగరాల్లోని ఫ్లాట్లలో పడిగాపులు. వీరికి ప్రభుత్వం అంటే అప్పుడప్పుడు వల్లమాలిన అభిమానం ఉంటుంది. ప్రభుత్వంతో మిత్రత్వం నెరపే వాళ్లతో తమ కృతజ్ఞతల్ని నిరంతరం సరఫరా చేస్తుంటారు. ఎలాంటి ఘటన జరిగినా, తదనుగుణంగా ఉద్యమం చేసినా, ఈ కృతజ్ఞతా భావ వ్యక్తీకరణ ఆగదు. ఎన్నికలప్పుడు గెలిచే ముఖ్యమంత్రులకు అభ్యర్థనలు అందజేసే నెపంతో వారి ఇంటికి వెళ్ళి షేక్‌హ్యాండ్‌లు ఇస్తారు. షేక్‌హ్యాండ్ ఇచ్చి చల్లగా చూడమని అక్షరాలలో రాయలేక, దేహభాషతో విన్నవించుకుంటారు. ఈ పనిచేయలేనివారు, ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోని కార్యకరత్లు ఘటనలవుతుంటారు. ఢిల్లీలో ఓ ఆచార్యుడు కావచ్చు, ఓయూలో ఓ కవి, సంపాదకుడు కావొచ్చు. అడుగు వర్గాల అనాలోచనా పరులు, ఘటనల వెంటపడి అస్తిత్వాన్ని నిరూపించుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతుంటారు. పైకుల వర్గాలవారు ఘటనల మధ్య ఘటనగా మారకుండా ఉండడానకి సవాలక్ష స్వీయ సంక్షేమ మార్గాలు వెదుకుతారు.
పర్యావరణ ఘటనలను, రాజకీయ ఘటనలకు తోలుబొమ్మలుగా చేసి పాలకులు ఆడిస్తుంటారు. కొంతమందికి పసుపురంగు ఘటనలే కనుపిస్తాయి. కొద్ది మందికి సాధారణ ఎరుపు రంగు ఘటనలే కనిపిస్తాయి. ఎంతపెద్ద ఘటన అయినా దాని ప్రభావం ఏడు రోజులే. సామాజిక ఘటనలే ఇప్పుడు పాలకుల్ని కుదిపే ఉద్యమాలు. మనుషులను కాదని ఐడీ కార్డులున్న వాళ్లే తమ పార్టీ వర్గాలవారిని మాత్రం ఆలింగనం చేసుకునే సంకుచిత మేధావుల సంఖ్య గణనీయంగా తగ్గావరి అనిపిస్తోంది.
బలవన్మరణమో, స్వేచ్ఛా రాహిత్యమో, నిషేధాలో ఏదైనా ఘటన కావచ్చు. అలాంటి వాటి వెనుక, పార్టీ, కులం, మతం, వర్గం, ప్రాంతం చూసి స్పందించే పరిస్థితి రావద్దు. దానిని చూసి పై అంశాలకు సంబంధించని కోట్లాది మంది దూరం కావద్దు. వారు నెమ్మదిగా నిశ్శబ్దం అయ్యే ప్రమాదం గుర్తించాలి. ఘటనల పరిధిలో పనిచేయడం, అవి సంభవించినప్పుడే ఆలోచించడం, అడ్‌హాకిజం. ప్రగతిశీల పార్టీలు, ఉద్యమాలు, విప్లవ సిద్ధాంతాలు, ఈ 3‘ఇజం’2 తెరల మధ్య నుండి బయటపడలేక పోవడం విచారకరం. ఇది ఒక అతిపెద్ద ఇటీవలి సహజ రుగ్మత.
ఇప్పుడు పాతవిధానంలో ఘటనలను సృష్టించి పాలకవర్గాలు తమ పక్షాన తప్పు నిలుపుకోవాలనుకోవడం లేదు. 3ఘటనను సృష్టించి దానిని అలవాటు చేసి ఆ చట్రంలోనే పని చేసే మైండ్‌సెట్ చట్రాన్ని తయారు చేశారు. ఇప్పుడు చాలామంది మేధావులు అందులో సేద తీరుతున్నారు. పాలకులు మాత్రం అభివృద్ధి లేబుల్ వెనుక చాలా సున్నితంగా ఘటనలు తయారు చేస్తున్నారు. ఆ చట్రంలో మేధావులు ఖండనలు దండిగా పండించాలి. నిజానికి అసలు సమస్యలను వదిలిపెట్టి, చిన్న చిన్న ఈ ఘటనల వెంటపడి శక్తినీ, మేధనీ, కాలాన్ని వృధా చేయడం పెద్ద జబ్బు. ఈ జబ్బును పాలకవర్గాలు మేధావులకి తెలియకుండా అంటించాయి. దానినుండి బయటపడండని అన్నవాడు శత్రువు. దీనివల్ల సామాజిక చలనం చాలా ఆలస్యం అవుతుందనేవాడు వ్యతిరేకి. అదే కదా ఇప్పుడు ప్రభుత్వాలకు కావలసింది. మనకు ఇష్టం ఉన్నా లేకున్నా, మనం కొత్త రాజధాని గురించే ఆలోచించాలి. పాత రాజధాని చుట్టూరా వందమైళ్లలోని అభివృద్ధి గురించి తర్జన భర్జనలు పడాలి.
వలలో చిక్కుకుని వలకు వలనే తన్నుకుపోయే ప్రజల పన్చతంత్రం లిఖించబడాలి.
మరి ఆపని నేటి సంఘటనా మేధావులు అంత సులభంగా జరగనివ్వరేమో?
నాణేనికి మరోకోణం చూడలేనివారు జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాల్ని చూడగలరని అంటే ఎలా?