తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

అద్భుత అక్షరంతో పరిచయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈరోజు హైదరాబాదులో 3మిత్ర2 రాసిన 3‘‘కైతల కవాతు’’2 పొత్తం ఆవిష్కరణ సభ.
3మిత్ర అనే కవిని దశాబ్దాలనుండి చూస్తున్నాం అని అనకూడదు. వింటున్నాం అనాలి. అతని పాటలు, రూపకాలు ప్రజారాశులలో అత్యంత ప్రచారం పొందాయి.
మిత్ర అసలు పేరు కూర దేవేందర్. కె.డి అని ముద్దుగా పిలిచేవారు. విప్లవోద్యమంలో 3అమర్4 అయ్యాడు. ముప్పై ఐదేళ్ల క్రితం మిత్ర పేరుతో రచనలు చేసిన క్షణంనుండి అదే కలం పేరు. ఇప్పుడు 3కైతల కవాతు2 సమగ్ర పాటల పుస్తకం మన ముందుకు వస్తోంది. రచయితగా అతను ఏనాడూ సాహిత్య సభలో పాల్గొనలేదు. ఏవేదిక పైకెక్కక్కలేదు. సాహిత్య లోకం అతడిని పెద్దగా పట్టించుకోలేదు. దానిని అతను ఖాతరు చేయడు. కానీ అతను వేలాది రరచనలు చేసిన కవి, రచయిత. కవిగా ఎలాంటి గుర్తింపు, ప్రచారం కోరుకోడు. తన రచనలు ప్రజల జీవితాలలో మాత్రం భాగం కావాలనుకుంటాడు. అతను రాసిన పాటల్ని ఆయన సహచరి, ఉద్యమకారిణి విమలక్క తన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య బృందంతో కలసి పాడుతుంది.
ఆమె స్వరం వెంట మరిన్ని బృందగాన గళాలు, డప్పులు, డోలక్‌లు, గజ్జెలు వచ్చి చేరతాయి. ఆ పాటల రాగాలాపనలో శారీరక కదలికలు ఆటగా మారి, నృత్యమై సంగీతమై, ప్రేక్షకులను సమ్మోహితం చేస్తుంది. 3మిత్ర4 పాట అలా కొత్త రూపంగా విస్తృతించి, విజృంభించి అక్షరాల పరిధిని దాటి అమోఘమైన శబ్ద శక్తిగా మారుతుంది. అలా అతని పాట పలు రూపాలలో నలు దిశలలో ప్రవహిస్తుంది. ఇది గొప్ప విషయమే. కానీ పాటకి మిత్రతో లింకు సన్నగిల్లి విమలవుతుంది. అరుణోదయమవుతుంది. జనరాగ జాజ్వల్యభందమవుతుంది.
అత్యధిక ప్రగతిశీల గీతాలు రాసినవాడు మిత్ర. మిత్రకి తక్షణాన్ని, కళ్లమందరి ఘటనని కవిత్వం చేయడం అవసరం. అందుకే రాస్తాడు. అందుకే అవి పాడబడతాయి. ఆకలిగొన్న ఉద్యమ సమాజానికి కడుపు నిండి ఊరటనిస్తుంది. ప్రజలు తమ చైతన్యాన్ని అలా కాపాడుకుంటూ మరో మెట్టు ఎదగడానికి సహకరిస్తాయి.
ఉద్ధృత పోరాటంలో అకస్మాత్తుగా కలవడం సులభం. అదొక ఆకర్షణ. కాని అలా కలిసినవారు అంతే వేగంగా వెనక్కి రావడం సహజం. కాలక్రమంగా జ్ఞానంతో కూడిన ఆలోచనల మెట్లు ఎక్కడం చాలా అవసరం. ఆ అవసరం తీర్చే అక్షరానికి పర్యాయపదం మిత్ర.
అందుకే ఈ వారం 3మిత్ర4 పరిచయం.
గడిచిన మూడున్నర దశాబ్దాల చరిత్రని కైతల కవాతు పేజీల్లో చూడబోతున్నాం.
గతంలో చాలావరకు చెవులతో విన్నదే. కళాత్మక విన్యాసాలతో రంగస్థలంపై చూసినవే. ఇప్పుడు కళ్లతో చదవబోతున్నాం.
గతం వర్తమానాల మధ్య ఈ అక్షరాలు, శబ్దాలు, మనల్ని వెంటాడి వేటాడినవే. ఐనా ఇప్పుడు నల్లని అక్షరాల అచ్చు సంకేతంగా మన రక్తంలో ఇంకి ఒక కొత్త వారసత్వ సంపదగా కొనసాగబోతున్నది.
గడిచిన, నడుస్తున్న రేపటి చరిత్ర చలనంలోంచి ఈ రాగాలు జీవస్పందనతో కదులుతున్నాయి. ఇవి ఆకస్మిక అబ్బురాలు కావు. వీటికి ఒక తెగని పోరాటపు బొడ్డుతాడు, కనబడని ముడి ఒకటి పెనవేసుకుని ఉంది.
ఇవ్వాళ చరిత్ర సమగ్రతను వీడి శకలాలుగ మారింది. పోరాటం ఏక ఖండిత స్థితినుండి బహుపాయలుగా విస్తరించింది. ఇది కాల స్వభావం. అనేతలు, ఏకతల మధ్య సందిగ్ధ స్థితి ఇది. నానా యుద్ధాలు చేసి ఒక సమగ్ర పోరాటాన్ని విజయం చేసే దిశగా అస్తశ్రస్త్రాలు అనేకం కదలాలి. శత్రువు బలవంతుడే కాదు. బహుముఖీనుడు. వాడు బహుళం. ఇవ్వాళ వలస పాలకుల స్థానంలోనే బహుళజాతి పెట్టుబడిదారులు నానారకాల వేశాలతో, రూపాలతో, స్వభావాలతో వేంచేస్తున్నారు. వీరికి దేశీయ దోపిడీదారులు రంగురంగుల స్వాగత తివాచీలు పరుస్తున్నారు. ఏ రూపంలో శత్రువు విస్తరిస్తున్నాడో కూడ అంతుబట్టని పరిస్థితి. కొత్త ప్రపంచం క్రమం పేరుపేరుతో మన నేలకింది నేల పొరలలో సమీకరణలు జరుగుతున్నాయి.
ఐనా మన కళ్లు వెనువెంటనే తెరుచుకోవు. ఎవరి పీఠాలు వారివి. ఎవరి అహాలు, అగ్రాధిపత్యాలు వారివే. మెట్టు దిగనివాడు శత్రువు చేతికి జుట్టు ఇవ్వక తప్పదు. గిడసబారిన మేధావిత్వం గిలగిలలాటనే పోరాట రూపమని నమ్మబలకడం ఈ శతాబ్దపు వింత. అంతటా బహుముఖాల అంతరం. ఇప్పుడు ఆంతర్యమే అంతరం అయినవేళ. మాటకి, అక్షరానికి, ఆలోచనకీ, కళ్ల కదలికలకీ పొంతన లేదు. తార్రోడ్డుపై అడుగుల ఊగిసలాటని ఆయుధం బరువుగా నిర్వచించడం నటనాకళ అత్యున్నత రూపం. పెదాలని కదలించి వీరోచిత భావన కలిగిస్తున్నాననుకునే కవులు ప్రజలని శాసించడం ఒక రకమైన నియంతృత్వమే. దరువేస్తున్నట్టు వేలు కదిలించి జనరాగాన్ని ఆలపిస్తున్న ముసుగు.
ఇవ్వాళ పోరాట పాట ఒళ్లు హూనం ఐందా. పెత్తనాల అదృశ్యం కోరలకు బలైందా? స్వీయ మానసికానందాల తోటలో ప్లాస్టిక్ పూవు అయిందా? ఎక్కడా రికార్డుకాని వాస్తవం. ఇది మొత్తానికి ప్రజల చెంతకు జారని నీడ.
సామాజిక జీవన రాగం ఎంత ముఖ్యమో పోరాటం, ఉద్యమ ప్రగతిశీల కైతల కవాతు అంతే ముఖ్యం. ఈ కవాతుని నాలుగు కాలాలనుండి ఏక ఛత్రాధిపత్యంగా నిర్వహిస్తున్న వారిలో మిత్ర అగ్రభాగాన ఉన్నాడు. చాలామంది గొప్ప కవులు ఆగిపోయి దశాబ్దాలైంది. ఈ దశాబ్దంలో కొద్దిమంటే పుట్టుకొచ్చారు. పుట్టిన పాట పెద్దల ప్రాపకంలో గిట్టిపోతున్న దృశ్యం! ఇప్పుడు రాగాలాపన తగ్గింది.కవులు సర్కారీ గుర్తింపు కోసం క్యూలు కడుతున్నారు.
వివిధ సంద్భాల్లో మిత్ర రాసిన సమగ్ర గీతాల సంపుటి ఇప్పుడు అచ్చు అవుతున్నది. ఆ పుస్తకం పేజీలు తిప్పుతుంటే మన చరిత్రని, మనం కళ్లతో చూస్తున్న అనుభవం. నిన్నటి చరిత్రని ఇలా చూడ్డం ఒక నవ కార్యాచరణకి ఆరంభం. రేపటి చరిత్రని మార్చడానికి అదొక పరికరం. మనం గత చరిత్రని శాసనాలు, పుస్తకాలు, కైఫీయుత్తుల్లో చూసేవాళ్లం. నిన్నటి చరిత్రను ఇవ్వాళ ఈ మిత్ర పాటల్ని చూస్తే చాలు అనిపిస్తోంది. ఎనె్నన్ని సమస్యలు, ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు. కొన్ని విజయాలను సైతం నమోదు చేసే చరిత్ర. ఇది రేపటి తరానికి జీవవాయు కేంద్రకం.
మిత్ర చిన్నతనంలోనే మోసిన బరువులు చాలా ఎక్కువ. అనుభవించిన విషాదాన్ని, ఒడిదుడుకుల్ని చూసి డీలా పడకుండా పాటని ఆలంబన చేసుకున్నాడు. అటు రాజకీయ నిర్మాణం. సాంస్కృతిక రంగ పోరాటం జమిలిగా, ఎత్తుగడగా అనివార్య అవసరంగా ఎంచుకోక తప్పలేదు. అందుకే అతని పాత్ర జలజలమని జారే నిరంతర ప్రవాహం. పాటతో తనకుతానే కాదు వేలాది సహచరులను, ప్రజలను ఆటుపోట్లనుండి రక్షించుకోవడం కోసం పాటకన్నా మించిన సాధనం లేదనుకున్నాడు
సమాజాన్ని కదిలించే పాటలు రాసిన కవులు, అలాంటి గొప్ప పాటలను తరచు రాయాలని ఆశించడం తప్పుకాదు. కాని తక్షణ అవసరం ఉండి కూడా రాయలేకపోవడం లోపం. వచన కవి, వ్యాసకర్త చేరని, దూరని చోటుకి ప్రజాకవి మాత్రమే ప్రవేశించగలడు. ఆ జన సందోహంలోకి పాట పాస్‌పోర్ట్ వంటిది. సమాజ అంతర్లీన భావనా ప్రపంచంలోకి చొరబారగలిగిన కవి మాత్రమే ఒక కొత్త సమాజాన్ని నిర్మించగలడు. కవికి ఈ పునాదితో నిరంతర బాంధవ్యం ఉన్నప్పుడే పాట రాయాలనే నిబంధన, అవసరం, బాధ్యత పెరుగుతుంది. ఈ తల్లి పేగు సంబంధం పకడ్బందీగా ఉన్నప్పుడే కవులు గొప్ప గానాలాపన చేస్తారు. అదొక పెను అలజడి.
కవిలోని అలజడి కైతగా మారి ప్రజల గుండెల్లో దూరి జాతీయ శ్రమ గీతంగా మారుతుంది. ప్రతి దశలోని ప్రతి ఉద్యమం ఒక గొప్ప మలుపు. ఆ మలుపుని విశాలతరం, విశ్వజనీనం చేయడమే పాట పని. పాట ఒక గొప్ప నిర్మాణం. వానపాము వంటి టెక్నాలజీ పాటది. ఎక్కడ తెగినా అక్కడనుండే కొత్త కదలిక. జీవం దాగిన శరీరం. పాట శరీరంలో ప్రతి చరణం ఒక ప్రత్యేక జీవ విభాగం. కొన్ని చరణాలు తెగవచ్చు. కొన్ని అంతరించవచ్చు. అలాంటి జీవ గీతాల నిర్మాణం అంత సులభం కాదు. ఐతే అన్ని పాటలూ అలా తయారు కాలేకపోవచ్చు. ఆ క్రమంలో అవి తమ ప్రయాణం కొనసాగిస్తాయి. వాటిని ప్రజలు ఆత్మీయ అవసరంతో స్వీకరించే ఒడుపు, లక్షణం పాట కలిగి ఉండాలి. పాటని పకడ్బందీగా నిర్మించడంలో ఒక జాతి వర్తమానం, భవిష్యత్ దాగి ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదు
3రాజ్యం2 ఉన్నంత కాలం నిద్రపుచ్చే పాటకు పురస్కారాలు, మెదళ్లని నిద్రలేపే పాటకు హత్కడీలు, చెరసాలలు. మిత్ర చాలాసార్లు బేడీలతో జైళ్లకెళ్లాడు. రెండు చేతులకున్న బేడీలు తగిలిన శబ్దాన్ని లయగా గీతాల్ని రూపొందించాడు. జ్ఞాతంగా, అజ్ఞాతంగా పోరాడుతూ పోరాటంలో అనేకమంది ఆత్మీయులను కోల్పోయాడు. చివరకు ప్రభుత్వంతో చర్చల సందర్భంగా తనతో వచ్చిన సహచరులను సైతం కోల్పోయి ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని కూడా కార్యాచరణని విస్మరించలేదు. సమాజమే ఒక పెద్ద విప్లవ రంగ స్థలం. అక్కడ గెలవడం కష్టం. ఐనా ప్రయత్నించడం అవసరం. అంతిమంగా దాని పురిటి స్థలం అదే.
భావరంగంలో ఆచరణలో కాలం కలిసిరాని కాలంలో భావ విప్లవ ఆచరణలో మమేకమయ్యాడు మిత్ర. అతని సాహిత్యం అంత విస్తృతం కావడానికి కారణం అదే. కాలానుగుణంగా విస్తరించిన అక్షరాలగురించి తెలపడం బాధ్యత అనుకుంటున్నాను.