తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

చివరి కినె్నర- కొన్ని తోలుబొమ్మలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొన్న పనె్నండో తేదీన వికారాబాద్ దాటి తాండూరు వెళ్లాం. అంతరించిపోతున్న రెండు ఆదిమ కళల పరిస్థితి గురించి, ఆ కళాకారుల జీవన స్థితిగతుల గురించి తెలుసుకోవాలని బయలుదేరాం. నాతోపాటు ఓ ఆంగ్లపత్రిక విలేఖరి, ఫోటో జర్నలిస్టు , పారిస్ నుండి వచ్చిన పరిశోధకుడు డా.డానియల్ నేజర్స్ మాతో జతకలిశారు. నాతో వచ్చిన మహిళా విలేఖరి కినె్నర తంత్రీ వాద్యం గురించి ఓ వ్యాసం రాయాలి. తెలుగు బుర్రకథలపై ముప్పై ఏళ్ల కింద తెలుగు నేర్చుకుని పరిశోధన చేసిన డానియల్‌కు ప్రాచీన భారతీయ కళల వర్తమానాన్ని కళ్లారా చూడాలని కోరిక.
ఎప్పటి నుండో డక్కలి బాలమ్మని, ఆమె నివసించే పరిసరాలను మరోసారి చూడాలని నా కల. ముప్పై ఏళ్లకింద ఓసారి ఆమెని మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్లలో కలిశాను. చీరని గోచికట్టి, గుర్రంపై స్వారీ చేస్తూ, కినె్నర వాద్యం వాయిస్తూ వీధుల్లోంచి పోతున్న బాలమ్మని చూశాను. అప్పడు ఆమె పేరు బాలమ్మ అని తెలియదు. సంగీత కళాప్రపంచంలో ఒక రాణిలా ఆమెను చూశాను. కినె్నర వాద్యం చేతుల్లో ధరించి, రాగగానాలతో ఆమె అంటరాని వీధుల్లో గుర్రంపై నడయాడింది. ఆ బాలమ్మకి ఇప్పుడు తొంభై ఐదేళ్లు. ఆమెకి చెవులు వినపడవు. కళ్ల దృష్టి తగ్గిపోయింది. ఐనా ఆమె చేతుల్లో స్పర్శ ఉంది. కినె్నర వాద్యం తగలగానే ఆమె శరీరం పులకించిపోతుంది. తన తల్లిని హత్తుకున్నట్టు ఆ వాద్యాన్ని హృదయానికి నిమురుకుంది.
పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు బాలమ్మ టార్పాలిన్, ప్లాస్టిక్ కవర్ కప్పిన గుడిసెలో బతుకీడుస్తున్నది. కొడుకు, కోడలు, మనుమలు ఉన్నారు. ఇప్పటికీ కినె్నరే వారి జీవనాధారం. ఏభై ఏళ్లు పైబడిన కొడుకు. అప్పుడప్పుడు పిట్టలు, చేపలు పట్టి జీవిస్తున్నారు. చదువు వారి దరి చేరదు. బడివారికి ‘మడి’ కట్టుకున్న గుడి. ఏ ప్రభుత్వ పథకానికైనా అల్లంత దూరం. వారికి గుర్తింపు లేదు. కళాకారులుగా అసలే లోకానికి తెలియదు.అలాంటి బాలమ్మ తాను వయసులో ఉన్నప్పుడు తన కళతో పదిమందిని మెప్పించింది. వారి వద్దనుండి బహుమతులు పొందింది. ఆర్థికంగా తాను నిలదొక్కుకుని తనవారిని చక్కగా సాకింది. తనకన్నా బాగా పాడగలిగిన ఇతర కళాకారులకి తన చేతి కంకణం తీసి ఇచ్చింది. తన వెండి వడ్డాణాన్ని ఓ పేద తండ్రికి ఇచ్చి కూతురికి పెళ్లి చేయించింది. ఆమె జీవితం ఒక పెద్ద వీరగాథ. ఇప్పుడు అదొక విషాద హేల.
ఆమె బరువులెత్తి అవలీలగా విన్యాసాలు చేసేది. వంద కిలోల బండరాయిని వీపుమీద మోసేది. అది చూసిన కన్నడ దొంబరులు తమ జట్టులో చేరితే అడిగినంత డబ్బు ఎంతైనా ఇస్తామన్నారు. ఆమె తన కినె్నరను వడిలో బిగపట్టుకుని అదే తన ప్రాణం అని తెగేసి చెప్పింది. భర్త మరణించాక తను వృత్తిరీత్యా తనకి వచ్చిన పట్టీ గ్రామాలలో మిరాసి అడుక్కునేందుకు సంచారం చేసింది. ఆమె బతుకే నిత్య సంచారమైంది. తాండూరుకు పది కిలోమీటర్ల దూరంలో మంబాపూర్ ఊరికి ఆవల ఇప్పటికీ అదే గుడిసె. అదే జీవితం. అదే కినె్నర. ఆ కినె్నర మీద పలికించిన పండగ సాయన్న పాట లక్షలాది మందిలో చైతన్యం కలిగించింది. ‘ఉన్నోళ్లను కొట్టిండు-లేనోళ్లకు పెట్టిండు-పండుగోళ్ల సాయన్నరా..’ అనే పాట ఆమెకి ఇష్టం. అందుకే తాను సంపాదించిన వెండి, బంగారం ఇతరులకు పంచి పెట్టింది. కాలం కాని కాలంలో తిండికి కరువైన రోజుల్లో ఆమె ఇంటిముందున్న గుర్రాన్ని అ మ్ముకోక తప్పలేదు. గా యపడిన నడుముతో అ ప్పటినుండి ఆమె గుడిసె అనే చెరసాలలో బందీ. ఎవరైనా పట్టుకుని నడిపిస్తే తప్ప నడక మరిచిపోయింది. కినె్నర వాద్యాన్ని మాత్రం ఎలా పలికించాలో ఆమెకి తెలిసినట్టు ఏ పురుష కళాకారుడికి తెలియదంటే అతిశయోక్తి కాదు. అదే రోజు మేం వికారాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దగ్గరికి తీసుకునిపోయి పరిచయం చేసినప్పుడు బాలమ్మ కళ్లలో కనబడని కాంతి. బతకడానికింత సహాయం ఆమె కళ్లల్లో కనబడి ఉండాలి. అంతకన్నా ఇంకేం చేయగలం?
తాండూరుకి పది కిలోమీటర్లు అటుగా ఉన్న జుంటిపల్లికి వెళ్లాం. అక్కడ ప్రాచీన తోలుబొమ్మలాట ప్రదర్శించే కళాకారులున్నారు. విచిత్రం ఏమంటే ఈ తోలుబొమ్మల కళాకారులు, కినె్నర కళాకారులు అప్పటి మహబూబ్‌నగర్ నేటి వికారాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతాలలోనే ఎక్కువగా ఉన్నారు. ఆ కళ అంతరించిపోవడానికి ఆఖరిమెట్టుగా వెంకటప్ప బతికి ఉన్నాడు. అతనికి ముగ్గురు భార్యలు. కొడుకులు, కూతుళ్లు అందరు కలిసి ఒక ప్రదర్శన బృందం. తోలుబొమ్మల ప్రదర్శన పూర్తిగా అంతరించిపోవడానికి మరో పదేళ్లు కూడా పట్టదు. వెంకటప్పకి ప్రమాదం జరిగి కాలు కోల్పోయాడు. ఐనా కళాకారునిగా స్థైర్యంతో బతుకుతున్నాడు. ఆరోజు కలెక్టరుతో ఇల్లు, జాగా అడగలేదు ఆయన. తనకు తోలుబొమ్మలాట ప్రదర్శించడానికి అనుమతి, అవకాశం ఇవ్వండని మాత్రమే అతని విన్నపం.
వీళ్లతో మాట్లాడినప్పుడు ఏదో తెలియని ఆవేదన. ఒక కొత్త లోకాన్ని చూసిన అనుభూతి. వీళ్లు ఈ నేలమీదే ఇంకా ఎలా జీవించగలగుతున్నారని అనుమానం. వాళ్లు తమ మాటల్లో ‘ఆ పక్క మీ తెలంగాణాలో...’ అనడంతో అవాక్కయిపోయాను. కన్నడ సరిహద్దులకి దగ్గరగా ఉన్నంత మాత్రాన అలా ఎలా అనగలిగారనే ఆలోచన మెలిపెట్టింది. వాళ్ల జీవితంలో వికారాబాద్ కొండ కోనలు దాటినదే తెలంగాణ. నిజమేనేమో! వీళ్లని ఉమ్మడి రాష్ట్రంలోకానీ నేడు ప్రత్యేక రాష్ట్రంలో కానీ గుర్తించలేదు. ఎవరికీ పట్టని మనుషులు కొందరు ఉన్నట్టే, కొన్ని ప్రాంతాలూ ఉంటాయి. కళా సాంస్కృతిక రంగంలో ప్రధాన స్రవంతికి దూరం వీరు ఉండిపోయారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా అక్కడ సాహిత్య సాంస్కృతిక రంగంలో వారికి గుర్తింపు లేదు. మొత్తానికి తాండూరు తనదైన ఇంటి కట్టడం, భోజనం, రుచులు వంటి వాటిని కాపాడుకున్నది. గాలిలో అత్యధిక ధూళి కలిగిన చిన్న పట్టణం అది. అక్కడి ప్రజల మనసులలో మాత్రం ఇంకా కాలుష్యం చేరలేదు. వాళ్ల కళలో కూడా. ప్రాచీన కళారూపాన్ని కూడా అలాగే ఉంచారు. ఎలాంటి మార్పులు చేయలేదు. ఆ ప్రాంతంలో భూమిలో పలకరాయి లభ్యత ఎక్కువ. పర్యావరణం, పచ్చదనం ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతం కోల్పోతున్నది. బయటి నుండి డబ్బున్నవాళ్లు వచ్చి భూములు కొనుక్కుంటున్నారు. ధరలు పెరిగి సామాన్యుడికి అందుబాటు స్థాయిని దాటిపోయాయి. ఇప్పుడు అక్కడి ప్రజలు జీవించలేని పరిస్థితి. బాలమ్మ వేసుకున్న గుడిసె ప్రాంతం రేపు ఎవరో ఒకరు వచ్చి వీరిని నిర్వాసితులు చేయవచ్చు. అప్పుడు బాలమ్మ ఏమమవుతుందో? ఎక్కడికి పోతుందో? ఎండలో వానలో చలిలో కినె్నర పరిస్థితి ఏమిటి?
అలనాడు కినె్నర కింపురుషులు అని చెప్పబడిన ఒక ‘గుర్తు’ ఇక్కడ నడయాడిందని చెప్పినా ఒప్పుకోని పరిస్థితి తలెత్తబోతోందా? ఈ కళాకారులు మన దేశ పౌరులని చెప్పడానికి నాకు ధైర్యం చాలడం లేదు. వీళ్లు భారతీయ కళాప్రపంచం వారధులని నిరూపించనూ లేను. ఆద్యంతం అశక్తత నిండిన మా తాండూరు పర్యటన గురించి ఇంకా రాయలేను. *

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242