కర్నూల్

తుంగభద్ర దిగువ కాలువకు నీరు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బీడుగా మారనున్న లక్ష ఎకరాల ఆయకట్టు..
* రబీ సీజన్‌కు నీటి సరఫరా లేదు..
* డిఇ నేహీమియా
ఆదోని,డిసెంబర్ 18: తుంగభద్ర డ్యాం నుంచి తుంగభద్ర దిగువ కాలువకు శుక్రవారం నుంచి నీటి సరఫరా నిలిపివేశారు. నీటి సరఫరా నిలిచిపోవడంతో రబీ సీజన్‌లో సాగు చేసే లక్ష 4వేల ఎకరాల ఆరుతడి ఆయకట్టు భూములు నీటి సరఫరా లేక బీడు పడే పరిస్థితి ఏర్పడింది. రబీ సీజన్‌కు నీటి సరఫరా చేయడం లేదని తుంగభద్ర దిగువ కాలువ డిఇ నేహీమియా శుక్రవారం స్పష్టం చేశారు. రబీ సీజన్‌కు నీటిని విడుదల చేయమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న మిరప, పత్తి, ఇతర పంటలను గురించి ఆయన దృష్టికి తీసుకొని రాగా తాము ప్రకటించిన విధంగా ఖరీఫ్ సీజన్‌లో 25వేల ఎకరాల వరి పంటకు నీటిని సరఫరా చేశామని ఆయన స్పష్టం చేశారు. దీర్ఘకాల పంటలైన మిరప, పత్తి పంటలను వేసుకొవద్దని రైతులకు విజ్ఞప్తి చేశామన్నారు. తుంగభద్ర డ్యాంలో ప్రస్తుతం 29 టీఎంసీలు నీరు ఉండగా రాష్ట్రానికి కేటాయించిన నీటిలో కర్నూలు జిల్లాలోని ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, గోనెగండ్ల, కర్నూలుప్రాంతాలకు ప్రవహించే తుంగభద్ర దిగువ కాలువ కోటా కింద మూడు టీఎంసీల నీరు మాత్రమే మిగలడం జరిగింది. కెసి కెనాల్ కోటా కింద 2.2టీఎంసీల నీరు మిగిలింది. అనంతపురం జిల్లాకు సరఫరా అయ్యే తుంగభద్ర ఎగువ కాలువ నీటి వాటా ఖరీఫ్ సీజన్‌లోని పూర్తి అయింది. అందువల్ల కర్నూలు జిల్లాకు మిగిలిన కెసి కెనాల్, తుంగభద్ర దిగువ కాలువ కింద మిగిలిన 5.2 టీఎంసీల నీటిని ఆదోని డివిజన్‌లో ఉన్న ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం, ఆలూరు పట్టణాలతోపాటు గ్రామాలకు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇంక రబీ సీజన్‌కు తుంగభద్ర డ్యాంలోనే మన కోటా నీళ్ళు లేని పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి రబీ సీజన్‌లోనే లక్ష 4వేల ఎకరాలకు నీటిని సరఫరా చేయాల్సి ఉంది. రబీ సీజన్‌లో నీరు సరఫరా చేయమని అధికారులు ప్రకటించడంతో ఆరుతడి పంట భూములన్ని ఇక బీడు భూములుగా మిగిలాయి. అయితే అధికారులు వరి పంటలు వేసుకొమని ఖరీఫ్ సీజన్‌లో రైతులకు చెప్పారు. కాని చాలా మంది రైతులు అధికారులు చెప్పడం మాములే అని దీర్ఘకాలిక పంటలైన పత్తి, మిరప పంటలను ఖరీఫ్ సీజన్‌లో సాగు చేశారు. వరి పంట పూర్తి అయింది. కాని పత్తి, మిరప పంటలు మాత్రం ఇంక మిగిలి ఉన్నాయి. అయితే అధికారులు శుక్రవారమే నీటి సరఫరాను నిలిపివేయడంతో రైతుల్లో ఆందోళన ప్రారంభం అయింది. పత్తి, మిరప పంటలు చేతికి వచ్చాయని నీళ్లు లేకపోతే నష్టపోతామని రైతులు ప్రదీప్ తదితరులు పేర్కొన్నారు. కనీసం డిసెంబర్ చివరి వరకు అయినా నీటిని సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని తుంగభద్ర దిగువ కాలువ నీటి హక్కుల పరీరక్షణ కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతు సంఘాలు కూడా ఉన్న మిరప, పత్తి పంటలను రక్షించడానికి నీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని డిఇ నేహీమీయా దృష్టికి తీసుకొని రాగా వరి పంటలు మాత్రమే వేసుకొమని చెప్పామని పత్తి, మిరప పంటలకు నీటిని సరఫరా చేయడం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సాధ్యం కాదని ఆయన చెప్పారు. తుంగభద్ర మొత్తం సామర్థ్యం 100 టీఎంసీలు కాగా ఈ సంవత్సరం కేవలం 60 టీఎంసీల నీరు మాత్రమే డ్యాంలో వచ్చి చేరాయి. డ్యాం నిండి ప్రవహించకపోవడం డ్యాం చరిత్రలోనే ప్రథమం. అయితే అందువల్ల మన రాష్ట్రా నీటి వాటా కోట ఘననీయంగా తగ్గిపోయింది. కాని కర్నాటక రైతులకు ఇంక డ్యాంలో 23.8 టీఎంసీల నీరు మిగిలినట్లు లెక్కలు తీర్చారు. అయితే కర్నాటక అధికారులు మైనస్ ఇన్‌ప్లోపేరిట, బ్యాక్ వాటర్ పేరిట మన నీటా వాటాకు భారీ గండికొట్టారు. దాని ఫలితంగానే ఈరోజు రబీ సీజన్‌కు నీరు లేని పరిస్థితి ఏర్పడింది. లెక్కలు మాత్రం సక్రమంగా ఉన్నాయి. అయితే మైనస్ ఇన్‌ఫ్లో పేరిట కర్నాటక అధికారులు చూపిన లెక్కలను మన అధికారులు కూడా బెంగళూరులో జరిగిన తుంగభద్ర బోర్డు సమావేశంలో వ్యతిరేకించడం కూడా జరిగింది. అయినప్పటికి ఫలితం లేకుండా పోయింది. తప్పుడు లెక్కలు చూపి కర్నాటక అధికారులు ఆంధ్రుల నోట్లో మట్టికొట్టారు. లక్షల ఎకరాల భూములు బీడు పడే పరిస్థితి ఏర్పడడం ఇదే ప్రథమం.