S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/16/2019 - 04:15

నెల్లూరు రూరల్, జూన్ 15: పేదప్రజలకు ఒక రూపాయి చొప్పున అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టి రైస్‌మిల్లుకు చేరడం, సమాచారం తెలుసుకున్న విజిలెన్స్ ఎస్పీ రైస్‌మిల్లుపై దాడిచేసి 73 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని రైస్‌మిల్లు యజమానిపై కేసు నమోదుచేశారు.

06/16/2019 - 04:14

ఆత్రేయపురం, జూన్ 15: షార్ట్ ఫిల్ములకు లొకేషన్లు చూడటానికి వచ్చి, గోదావరిలో స్నానం చేస్తూ ఊబిలో చిక్కుకుని ఇద్దరు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన గరగ సుధీర్ (33) షార్ట్ఫిల్ము డైరెక్టర్.

06/16/2019 - 03:46

అమీన్‌పూర్, జూన్ 15: పటన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ మండల పరిధిలో గుర్తు తెలియని దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజ్‌పేట్‌కి చెందిన అరుందతి (58) భర్త నాగేందర్‌గౌడ్‌తో కలిసి అమీన్‌పూర్ పరిదిలోని వాణినగర్‌లో నివాసం ఉంటున్నారు. భర్త జహీరాబాద్ వద్ద ఉన్న కోహీర్‌లో బీఏఎమ్‌ఎస్ వైద్యుడుగా పనిచేస్తున్నాడు.

06/16/2019 - 03:38

నిజామాబాద్, జూన్15: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని జలాల్‌పూర్‌లో శనివారం తెల్లవారుజామున దొంగ అనే అనుమానంతో ఓ యువకుడిని గ్రామస్థులు కొట్టి చంపారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసు పికెటింగ్‌ను ఏర్పాటు చేశారు. సంఘటన వివరాలిలా ఉన్నాయి. వర్ని మండలం శంకోరా గ్రామానికి చెందిన కెతావత్ రాజేష్(26) అనే యువకుడు మేస్ర్తి పని చేసుకుంటూ జీవనం వెళ్లదీసేవాడు.

06/16/2019 - 02:51

హైదరాబాద్, జూన్ 15: కాగజ్‌నగర్ , కొమరంబీమ్ జిల్లా రేపల్లెలో ఉన్న ఆదివాసులను అక్రమంగా నిర్బంధించడంపై తెలంగాణ హైకోర్టులో శనివారం నాడు పిటీషన్ దాఖలైంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ బెంచ్ ముందు హెబియస్ కార్పస్ హౌస్ మోషన్ పిటీషన్‌ను పౌరహక్కుల సంఘం దాఖలు చేసింది.

06/16/2019 - 02:14

అచ్చంపేట, జూన్ 15: మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని ఫోన్‌లో బెదిరించారనే ఆరోపణపై గుంటూరు జిల్లాకు చెందిన ఒక యువకుడిని కడప జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అచ్చంపేట మండలంలోని తాళ్లచెరువు గ్రామంలో ఉన్న ఏరువ బాలకిరణ్‌రెడ్డి అనే వ్యక్తిని కడప జిల్లా పోలీసులు శనివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు.

06/16/2019 - 01:55

ఎ కొండూరు, జూన్ 15: మండలంలోని ఎ కొండూరు తండాకు చెందిన భూక్యా సూర్యం ఇంట్లో శుక్రవారం రాత్రి కొందరు వ్యక్తులు క్షుద్ర పూజలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.

06/16/2019 - 01:34

ఖైరతాబాద్, జూన్ 15: ప్రేమజంట ఒకే ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖనికి చెందిన సంతోష్ (27) ఏయిర్‌టెల్ కార్యాలయంలో స్టోర్ మేనేజర్‌గా విధులు నిర్వహించే వాడు. గత నాలుగు నెలల క్రితం అదే కార్యాలయంలో పనిచేసే అర్చనను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.

06/16/2019 - 01:33

ఉప్పల్, జూన్ 15: కుటుంబ సమస్యలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రామంతాపూర్ శ్రీరామ కాలనీలో నివసిస్తున్న ఎం.నిర్మల (45) గృహిణి. భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

06/15/2019 - 00:23

కుషాయిగూడ, జూన్ 14: శాంతి భద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలు తీసుకోవాలని రాచకొండ క్రైమ్ డీసీపీ రామచంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చర్లపల్లి అంబేద్కర్ నగర్, భారత్‌నగర్, పూకాట్‌నగర్ కాలనీలో 200మంది సాయుధ బలగాలతో నాఖాబందీ నిర్వహించారు.

Pages