S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/13/2019 - 23:50

జీడిమెట్ల, జూన్ 13: ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లిన బాలుడు అదృశ్యమైన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. జీడిమెట్లలో నవి రత్నా ఎన్‌క్లేవ్‌లో నివాసముండే సంపత్ సురెందర్ రెడ్డి కుమారుడు అభినవ్ చంద్ర (15) నారాయణ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 12న రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి సమాచారం ఇవ్వకుండా బయటికి వెళ్లి తిరిగి రాలేడు.

06/13/2019 - 23:50

వనస్థలిపురం, జూన్ 13: అనుమానాస్పద స్థితిలో 10వ తరగతి విద్యార్థిని స్కూల్ భవనం ఐదవ అంతస్తు పైనుంచి పడి మృతిచెందిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం నాగోలు డివిజన్ సాయి నగర్ కాలనీ నాగార్జున హైస్కూల్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

06/13/2019 - 23:49

మహేశ్వరం, జూన్ 13: అతివేగం అజాగ్రత్తతో రెండు వాహనాలు ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైన సంఘటన గురువారం తుక్కుగూడ పురపాలక సంఘం ఔటర్ సర్వీస్ రోడ్డులో చోటు చేసుకుంది.

06/13/2019 - 22:37

ముంబయి, జూన్ 13: బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తాపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో వెటరన్ నటుడు నానాపటేకర్‌కు ఊరట లభించింది. లైంగిక వేధింపుల కేసులో ఎలాంటి ఆధారాలు లభించని కారణంగా ఆయనపై విచారణ కొనసాగించలేమని ముంబయి పోలీసులు కోర్టుకు తెలియజేశారు. గత సంవత్సరం తనపై లైంగిక వేధింపులకు నానాపటేకర్ పాల్పడ్డారని తనుశ్రీ దత్తా ‘మీ టూ..’ పేరుతో సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు సంచలనం రేపిన సంగతి విదితమే.

06/13/2019 - 22:03

కోయంబత్తూరు, జూన్ 13: నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఐఎస్‌ఐఎస్ కేరళ-తమిళనాడు మాడ్యూల్ కేసులో వరుసగా రెండో రోజు గురువారం ఇక్కడ దాడులు కొనసాగించింది. బుధవారం నగరంలోని ఏడు ప్రదేశాల్లో తనిఖీలు జరిపిన ఎన్‌ఐఏ విచారణ కోసం ఆరుగురిని అదుపులోకి తీసుకుంది. ప్రధాన నిందితుడు, శ్రీలంకలోని ఈస్టర్ సండే పేలుళ్ల సూత్రధారి జహ్రా హషీమ్‌కు ఫేస్‌బుక్ స్నేహితుడు అయిన మహమ్మద్ అజారుద్దీన్‌ను అరెస్టు చేసింది.

06/13/2019 - 22:18

గౌహతి, జూన్ 13: జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ)లో పేరు నమోదు చేసేందుకు ఓ మహిళ నుంచి లంచం తీసుకున్న ఇద్దరు అధికారులు గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇక్కడి దిస్పూర్‌లోని జాతీయ పౌర రిజిస్టర్ సేవా కేంద్రంలో పనిచేసే ఫీల్డ్ లెవల్ అధికారి సయ్యద్ సహజాన్ ఒక మహిళ నుంచి రూ. 10వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

06/13/2019 - 22:02

న్యూఢిల్లీ, జూన్ 13: పాకిస్తాన్‌కు చెందిన నిషేధిత ‘్ఫలా-ఐ-ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్‌ఐఎఫ్) సభ్యునిగా భావిస్తున్న 44 ఏళ్ల నిందితుడు మహమ్మద్ ఆరిఫ్ గులామ్ బషీర్ ధరమ్‌పురియాను ఢిల్లీ కోర్టు గురువారం ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. ఇతను ఉగ్రవాద గ్రూపులకు నిధులు సమకూరుస్తున్న అభియోగంపై అరెస్టు అయ్యాడు. ఈ కేసులో జమాత్ ఉల్ దవా చీఫ్ హఫీజ్ సరుూద్‌ను సైతం పోలీసులు నిందితుడిగా చేర్చారు.

06/13/2019 - 03:52

వై రామవరం/సీలేరు, జూన్ 12: తూర్పు-విశాఖ సరిహద్దుల్లోని ఏవోబీలో పోలీసులకు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు గ్రేహౌండ్స్ దళాలు మంగళవారం రాత్రి కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.

06/13/2019 - 03:45

నార్పల, జూన్ 12: అనంతపురం జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. నార్పల మండలం మద్దలపల్లి సమీపంలో తాడిపత్రి-అనంతపురం రహదారిపై బొగ్గుపొడి లారీ టైర్ పగిలిపోవడంతో అదుపుతప్పి ముందువెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని దానిపై బోల్తాపడింది. దీంతో మోటార్‌బైక్‌పై వెళ్తున్న వెంకటేశ్వరగుప్త, శివారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.

06/13/2019 - 03:44

పలమనేరు, జూన్ 12: చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ సమీపంలోని చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి ఆంజనేయస్వామి ఆలయం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో పదిమంది గాయపడ్డారు. టెంపో ఆటోను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు పలమనేరుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆటోలో బంగారుపాళ్యం టేకుమందకు వెళ్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన టెంపో ఢీకొట్టింది.

Pages