S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/15/2019 - 22:46

విజయవాడ, మార్చి 15: రహదారి ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యంతో పాటు అధికారులు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తే రోడ్డు ప్రమాదాలను తగ్గించగలుగుతామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పునేఠా అన్నారు. శుక్రవారం నగరంలోని ఒక హోటల్‌లో జరిగిన రహదారి భద్రత సదస్సుకు హాజరైన వివిధ శాఖల అధికారులను ఉద్దేశించి పునేఠా మాట్లాడుతూ తన అనుభవంతో విదేశాల్లో రహదారి భద్రత ఎంత పటిష్టంగా ఉంటుందో వివరించారు.

03/15/2019 - 22:36

కడప, మార్చి 15: వైకాపా నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు చెబుతున్న విషయాలు, వాస్తవాలు పూర్త్భిన్నంగా ఉండడం అనుమానాలకు దారితీస్తోంది. వివేకానందరెడ్డి గురువారం రాత్రి 11 గంటలకు పులివెందులలోని తన స్వగృహానికి చేరుకుని డ్రైవర్ ప్రసాద్‌కు కారు ఇచ్చి పంపించేశారు. తెల్లవారుజామున ఫోన్ చేయగానే వచ్చేయమని చెప్పినట్లు తెలుస్తోంది.

03/15/2019 - 21:22

రామాయంపేట, మార్చి 15: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం పర్వతాపూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన కాముని కిషన్ రైతుకు చెందిన లేగదూడను వ్యవసాయ పొలం వద్ద కట్టేసి ఉదయం వెళ్లి చూసే సరికి చిరుతపులి చంపి తినేసిందని తెలిపారు. ఈవిషయమై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా పంచనామ నిర్వహించారు.

03/15/2019 - 21:19

మేళ్లచెర్వు, మార్చి 15: భార్యభర్తల మధ్య చెలరేగిన తగాదా నేపథ్యంలో క్షణకావేశంలో తీసుకున్న నిర్ణయం మూడు నిండు ప్రాణాలను బలితీసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు కుమారులకు క్రిమిసంహారకమందు తాగించి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మేళ్లచెర్వు మండలంలోని వెల్లటూరు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం..

03/15/2019 - 21:06

న్యూఢిల్లీ, మార్చి 15: సిక్కుల అల్లర్ల కేసులో తనకు ఢిల్లీ హైకోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ మాజీ నేత సజ్జన్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని, సీబీఐ శుక్రవారం సుప్రీం కోర్టును అభ్యర్థించింది.

03/15/2019 - 20:53

న్యూఢిల్లీ, మార్చి 15: బీజేపీ నాయకుడు రాజీవ్ బబ్బర్ దాఖలు చేసిన పరువునష్టం దావాలో ఢిల్లీ కోర్టు శుక్రవారం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఏప్రిల్ 30వ తేదీన న్యాయస్థానం ముందు హాజరు కావలసిందిగా ఆదేశిస్తూ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమర్ విశాల్ కేజ్రీవాల్, ఇతర నిందితులకు సమన్లు జారీ చేశారు.

03/15/2019 - 20:25

న్యూఢిల్లీ, మార్చి 15: సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం మేర వీవీ ప్యాట్‌లను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరతూ ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్లపై సమాధానం ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

03/15/2019 - 04:20

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎన్నారై చిగురుపాటి జయరాం హత్యకేసులో మరో ముగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. తొలుత ఈ కేసులో జయరాం మేనకోడలు శిఖాచౌదరి పాత్ర ఉన్నట్టు కథనాలు వెలువడ్డా విచారణ తరువాత ఆమె ప్రమేయం లేనట్టు దర్యాప్తు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డిని ఇప్పటికే అరెస్టు చేశారు.

03/15/2019 - 03:31

పెనుకొండ, మార్చి 14 : సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో గురువారం అనంతపురం జిల్లాలో పో లీసులు పలుచోట్ల వాహనాల తనిఖీలు చేపట్టి రూ. 18 లక్షల విలువ చేసే పట్టుచీరలు, రూ. 2.6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అందులో భాగంగా పెనుకొండ పట్టణ సమీపంలోని కియా కార్ల తయారీ పరిశ్రమ వద్ద జాతీయ రహదారిపై గురువారం రాత్రి రూ.

03/15/2019 - 03:30

అనంతపురం, మార్చి 14 : అనంతపురం నగరంలోని ఇన్‌కం ట్యాక్స్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న రాజశేఖరగౌడ్ గురువారం రూ. 25వేలు లంచం తీసుకుంటూ ఏసీ బీ అధికారులకు చిక్కాడు. వివరాలు.. తాడిపత్రి పట్టణానికి చెందిన ఆడిటర్ నిరంజన్‌బాబు తన క్లైంట్‌కు చెందిన ట్యాక్స్ రీఫండ్‌కు సంబంధించి ఫైల్ సమర్పించగా రూ. 2.09 లక్షలు రీఫండ్ చేయడానికి రూ. 25వేలు లంచం ఇవ్వాలని రాజశేఖరగౌ డ్ డిమాండ్ చేశాడు.

Pages