S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/16/2018 - 00:56

కొత్తకోట, మార్చి 15: మదనాపురం రైల్వే స్టేషన్ సమీపంలోని గురువారం ఉదయం ప్యాసింజర్ రైలు కింద పడి పాత్లావత్ శంకర్‌నాయక్ (26) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసు అధికారి రాఘవేందర్ తెలిపారు.

03/16/2018 - 00:14

న్యూఢిల్లీ, మార్చి 14: ఐఎన్‌ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో కార్తి చిదంబరంకు మరికొన్ని రోజుల పాటు ఊరట లభించేలాగా సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేశాయి. ఈ కేసులో కార్తి చిదంబరంను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 20వ తేదీ వరకు అరెస్టు చేయకూడదని ఢిల్లీ హైకోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాల వర్తింపును మార్చి 22వ తేదీ వరకు పొడిగించింది.

03/15/2018 - 23:33

గుత్తి, మార్చి 15 : స్థానిక గేట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సుబ్రమణ్యం (22) గురువారం మేడపై నుంచి పడి మృతి చెందాడు. మడకశిరకు చెందిన చలపతి కుమారుడు సుబ్రమణ్యం పట్టణంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటూ పట్టణ శివార్లలోని గేట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.

03/15/2018 - 04:15

మడకశిర, మార్చి 14 : మండల పరిధిలోని మెళవాయి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహమ్మద్ రఫిక్ (42) మృతి చెందాడు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కదిరి కుటాగూళ్లకు చెందిన మహమ్మద్ రఫిక్ వివిధ ప్రాంతాల్లో చింతపండు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో విక్రయించి జీవనం సాగించేవాడు. ఇందులో భాగంగా శిరా, అమరాపురం ప్రాంతాల్లో చింతపండు కొనుగోలు చేసి లారీలో విజయవాడకు తరలించారు.

03/15/2018 - 02:20

చెన్నై, మార్చి 14: కేంద్ర టెలికాం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్‌కు టెలిఫోన్ ఎక్స్ఛేంజీ కేసునుంచి విముక్తి లభించింది. సోదరులిద్దరిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని నిర్ధారణకు వచ్చిన సీబీఐ ప్రత్యేక కోర్టు వారిని విడుదల చేసింది. తమను టెలిఫోన్ ఎక్స్చేంజీ కేసు నుంచి తప్పించాలంటూ మారన్ సోదరులు కోర్టును అభ్యర్థించారు.

03/15/2018 - 01:41

న్యూఢిల్లీ, మార్చి 14: తాను లాహోర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా కుమారుడు అభయ్ చౌతాలా చేసుకున్న అభ్యర్థనపై ఢిల్లీ కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఓ పెళ్లికి హాజరుకావల్సి ఉందని, దానికి కోర్టు అనుమతి మంజూరు చేయాలని అభయ్ అభ్యర్థించారు.

03/15/2018 - 04:29

న్యూఢిల్లీ: వివాదాస్పద అయోధ్యలోని రామమందిరం-బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసులో తమను కక్షిదారులుగా చేర్చుకోవాలంటూ దాఖలైన 32 మధ్యంతర పిటిషన్లను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సారథ్యంలోని ప్రత్యేక ధర్మాసనం తోసిపుచ్చింది. తొలి నుంచి ఈ కేసులో ఉన్న కక్షిదారులు మాత్రమే వాదనలు వినిపించాలని బెంచ్ కీలక నిర్ణయం తీసుకుంది.

03/15/2018 - 01:34

ఖమ్మం(క్రైం), మార్చి 14: ఖమ్మం మునే్నరులో పడి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో ఇరువురు విద్యార్థులు మునే్నరు వద్దకు వెళ్ళారు. స్నేహితులైన ఇరువురు విద్యార్థులు ఒకేసారి మరణించడం హృదయ విదారకంగా ఉంది. ఖమ్మంలోని ప్రైవేటు కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు మొదటి నుంచి కలిసి ఉండేవాళ్ళని, మృత్యువు కూడా వాళ్ళని విడతీయలేకపోయిందని తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

03/15/2018 - 00:43

మోత్కూర్, మార్చి 14: ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు కింద పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన బుధవారం సాయంత్రం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జవ్వారి జనార్థన్, భాగ్యమ్మల పెద్ద కుమారుడు విజయ్‌సాయి (10) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్నట్లు తెలిపారు.

03/15/2018 - 00:06

తెలకపల్లి, మార్చి 14: మండల పరిధిలోని దాస్‌పల్లికి చెందిన బల్మూరి రామస్వామిగౌడ్(60) ఆయన భార్య నర్సమ్మ(55) అనే భార్య భర్తలు ఇద్దరు బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా తెలకపల్లి, రాంరెడ్డిపల్లి గ్రామాల మధ్యగల దాస్‌పల్లి బస్‌స్టేజీ ద్గర తెలకపల్లి నుండి భార్య భర్తలు ఇద్దరు టీవీఎస్ లూనాపై వెళ్తున్నారు.

Pages