S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/21/2017 - 20:51

‘గురు చిత్రానికి సంబంధించిన పాత్రేంటి? డైలాగులు ఎలా ఉన్నాయి? అని చూశానే కానీ స్క్రిప్టు ఎప్పుడూ పూర్తిగా చదవలేదు. తొలుత కొత్తగా అనిపించడంతో మొత్తం స్క్రిప్ట్ చదివాను. అది చదివాక కొత్త ఉత్సాహం వచ్చినట్లుగా అనిపించింది. అందుకే ఈ సినిమాలో పూర్తిగా లీనమై నటించే ప్రయత్నం చేశాను’ అని హీరో వెంకటేష్ తెలిపారు. వై నాట్ స్టూడియోస్ పతాకంపై సుధా కొంగర దర్శకత్వంలో ఎస్.శశికాంత్ రూపొందించిన చిత్రం ‘గురు’.

03/21/2017 - 20:50

వైవిధ్యమైన కథ, కథనాలతో రూపొందించిన కంటెంటే సినిమాకు హైలెట్‌గా వుండడంతో ‘నేనోరకం’ సినిమా అందరికీ నచ్చి విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. మంచి సినిమాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ వుంటుందని మరోసారి ఈ చిత్రం రుజువు చేసింది అని నటుడు శరత్‌కుమార్ తెలిపారు.

03/21/2017 - 20:48

శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై మద్రాస్ టాకీస్ రూపొందించిన ‘చెలియా’ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. కార్తీ, అతిధిరావు హైదరీ జంటగా రూపొందించిన ఈ చిత్రానికి దర్శకుడు మణిరత్నం. ఆడియో సీడీని సిరివెనె్నల సీతారామశాస్ర్తీ విడుదల చేసి తొలి కాపీని ఎ.ఆర్.రెహమాన్‌కు అందజేశారు.

03/21/2017 - 20:46

బాలీవుడ్ సినీ కథానాయకుడు సంజయ్‌దత్ ‘్భమి’ చిత్రంలో పోరాట సన్నివేశం చిత్రీకరణ సందర్భంగా గాయపడ్డారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చంబల్ లోయలో జరుగుతోంది. సంజయ్‌దత్, కొందరు దుండగుల మధ్య చిత్రీకరిస్తున్న ఫైట్ సీన్ సందర్భంగా ఈ ప్రమాదం సంభవించింది. పై నుంచి దూకే సీన్‌లో నేలపై పడటంతో సంజయ్‌దత్ పక్కటెముకలు విరిగాయి. నొప్పిపెడుతున్నా షూటింగ్‌లో పాల్గొన్న దత్ కొద్దిసేపటి తరువాత నొప్పి భరించలేకపోయారు.

03/21/2017 - 20:43

వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో సుఖీభవ మూవీస్ పతాకంపై ఎ.గురురాజ్ రూపొందించిన చిత్రం ‘రకక్షభటుడు’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు.

03/21/2017 - 20:41

పవన్, మను, సోనియా ప్రధాన తారాగణంగా సంతోష్ నేలంటి దర్శకత్వంలో పి.ఆర్.మూవీస్ మేకర్స్ పతాకంపై గట్టు వెంకన్న, పవన్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించారు. సంగీత దర్శకుడు కోటి ఆడియోను విడుదల చేశారు.

03/21/2017 - 20:40

అందాల భామ కాజల్ ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. లేటెస్ట్‌గా ఖైదీ నెంబర్ 150 సినిమాతో మెగా స్టార్‌తో జోడికట్టిన ఈ భామ మరోవైపు ఐటెమ్‌సాంగ్‌లు చేస్తూ దుమ్మురేపుతోంది. అయితే ప్రస్తుతం కాజల్ చేతిలో రెండు చిత్రాలు తప్ప మరేమీ లేవు. వస్తున్న అవకాశాలన్నీ ఐటెమ్‌సాంగ్‌లు చేయమని అడుగుతున్నారట.

03/21/2017 - 20:38

ఓ సంక్లిష్ట్భరితమైన కథనం తీసుకుని అందరికీ అర్థమయ్యేలా రూపొందించిన దర్శకుడు కార్తీక్ నరేన్ చిత్రాన్ని వైవిధ్యంగా డీల్ చేశాడు. ఇటువంటి మంచి కథనం వున్న ఈ సినిమా ఓ ప్రయోగం లాంటిది అని నిర్మాత రాజ్ కందుకూరి తెలిపారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరా ఫిలింస్ పతాకంపై రెహమాన్, ప్రకాష్ విజయ్, రాఘవన్, అశ్వినీకుమార్ ప్రధాన తారాగణంగా చదలవాడ పద్మావతి అందించిన ‘16’ విడుదలైన సంగతి తెలిసిందే.

03/19/2017 - 21:29

దక్షిణాదిలో కింగ్ ఆఫ్ మ్యూజిక్‌గా ఇమేజ్ తెచ్చుకున్న ఇళయరాజా అంటేనే సౌమ్యానికి పేరు. ఎప్పుడూ ప్రశాంతంగా వుండే ఆయనకు ఎందుకో కోపమొచ్చినట్టుంది. తన పాటను పాడొద్దంటూ కోర్టు నోటీసులు పంపడం విశేషం. ఆ వివరాల్లోకెళితే తన సొంత ట్యూన్స్ ఇతరులు కాపీ చేస్తుండడంతో ఇళయరాజా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలుకు తన అనుమతి లేకుండా పాడకూడదని నోటీసులు పంపారు. ఈ విషయంపై స్పందించిన బాలు ఫేస్‌బుక్ ద్వారా తన స్పందనను తెలిపారు.

03/19/2017 - 21:27

శిరీష్ హీరోగా ఆనంద్‌కృష్ణ దర్శకత్వంలో ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పలు హిట్ చిత్రాల్ని అందించిన సురేష్ కొండేటి సమర్పణలో రజనీ తాళ్లూరి నిర్మించిన మెట్రో చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేశారు.

Pages