S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/24/2016 - 22:32

పూజాగాంధీ, రఘుముఖర్జీ ప్రధాన తారాగణంగా శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ మూవీస్ పతాకంపై వెంకట్ నిర్మించిన ‘దండుపాళ్యం’ చిత్రం సంచలనం సాధించడంతో దానికి సీక్వెల్‌గా ‘దండుపాళ్యం-2’ చిత్రం గురువారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కర్నాటక ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ హెచ్.డి.గంగరాజు, ఎం.ఎన్.సురేష్‌లు పాల్గొన్నారు.

03/24/2016 - 22:30

ఆర్తీ అగర్వాల్ ప్రధాన పాత్రలో రమేష్ ముగడ దర్శకత్వంలో శ్రీ బాలగణపతి ప్రొడక్షన్స్, శ్రీ సాయిదుర్గ చిత్రాలయ పతాకంపై వీర గణేష్ కర్రి, లక్ష్మీ సరోజ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఆమె ఎవరు?’. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. సీనియర్ జర్నలిస్టు పసుపులేటి రామారావు సీడీని ఆవిష్కరించారు.

03/24/2016 - 22:26

ధనుంజయ్, పరుల్ యాదవ్ జంటగా పవన్ వడయార్ దర్శకత్వంలో వైవిధ్యభరిత ప్రేమకథతో రూపొందుతున్న చిత్రం ‘జెస్సీ’. ఆర్.ఎస్.ప్రొడక్షన్స్ పతాకంపై గతంలో సుబ్బు, మహానంది వంటి చిత్రాలను నిర్మించిన ఆర్.శ్రీనివాస్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని పాటలు త్వరలో విడుదల కానున్నాయి.

03/24/2016 - 22:24

ప్రముఖ నటుడు చిరంజీవి చిన్నకూతురు శ్రీజ వివాహం ఈనెల 28న జరుగుతున్న సందర్భంగా పెళ్లికూతురిని చేయడంతో పెళ్లిసందడి మొదలైంది. ఈ సందర్భంగా తన ముద్దుల చెల్లితో సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పెట్టాడు హీరో వరుణ్‌తేజ్. బ్యూటిఫుల్ బ్రైడ్ సిస్టర్ వెడ్డింగ్, లెట్ ద సెలెబ్రేషన్స్ బిగిన్ అంటూ కామెంట్ పెట్టాడు.

03/24/2016 - 22:22

బొద్దుగుమ్మ నమిత ఈమధ్య ఏ కార్యక్రమంలోనూ, ఏ సినిమాలోనూ కనిపించడంలేదు. ప్రస్తుతానికి ఆమెకు చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. గత కొన్ని రోజులుగా సైలెంట్‌గా వున్న ఈ హాట్ భామ బాగా స్లిమ్‌గా మారి షాక్ ఇచ్చింది. భారీ అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టే నమిత ఇంత స్లిమ్‌గా మారడానికి కారణం ఓ సినిమా కోసమేనట.

03/24/2016 - 22:20

మంచు లక్ష్మి నిర్వహిస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమం కోసం సినీ తారలు రకరకాల పనుల్లో కనపడి మరింత క్రేజ్‌ను స్వంతం చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంకోసం ఇప్పటికే రకుల్‌ప్రీత్‌సింగ్ రైతుబజార్‌లో కూరగాయలు అమ్మగా, రానా కూలీగా పనిచేశాడు. అఖిల్ ఆటో డ్రైవర్‌గా కనిపిస్తే, శ్రీయ సూపర్ మార్కెట్‌లో సేల్స్‌గర్ల్ అవతారం ఎత్తింది. ఇప్పుడు తాజాగా మోహన్‌బాబు ఇడ్లీలు అమ్మే వ్యక్తిగా మారాడు.

03/23/2016 - 22:29

ప్రముఖ నటుడు రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో 2.0 చిత్రం షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌లమధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూళ్లను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ఫినిష్ చేయడానికి జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాడు దర్శకుడు శంకర్.

03/23/2016 - 22:28

ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ క్రేజ్ టాలీవుడ్‌లో ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఆయన తాజాగా నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కె.ఎస్.రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రం ఏప్రిల్ 8న భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

03/23/2016 - 22:26

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. ఈ సినిమాపై రకరకాల వార్తలు వినిపించిన నేపథ్యంలో తన వందో చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నట్టు ప్రకటించాడు బాలకృష్ణ. పురాతనకాలంనాటి కథతో తెరకెక్కే సినిమా కావడంతో దానికి సంబంధించిన హావభావాలు, వేషభాషల విషయంలో శిక్షణ తీసుకుంటున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఆయన గుర్రపు స్వారీ కూడా నేర్చుకోవాలని సిద్ధమవుతున్నాడట.

03/23/2016 - 22:21

‘ఇలా చేస్తే ప్రేక్షకులు ఆదరించరేమో అనే అనుమానాన్ని మనమే ఎక్కువ చేసుకుంటున్నాం. నిజానికి మనం చూపించేది కరెక్టుగా వుంటే వాళ్లు తప్పకుండా రిసీవ్ చేసుకుంటారు’ అని అంటున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. ‘మున్నా’ సినిమాతో కెరీర్ ప్రారంభించి ‘బృందావనం’, ‘ఎవడు’ వంటి చిత్రాలతో స్టైలిష్ మేకర్‌గా పేరుతెచ్చుకున్నాడు. ఆయన తాజాగా రూపొందిస్తున్న చిత్రం ‘ఊపిరి’.

Pages