S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/01/2016 - 21:07

చిరంజీవి ప్రస్తుతం తన 150వ చిత్రంలో నటించడంలో బిజీగా ఉన్నారు. అదే చిత్రం కాకుండా ఇప్పుడు 151వ చిత్రంలో కూడా నటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన వరుస చిత్రాలను చేయడానికి సిద్ధవౌతున్నారు. మాస్ దర్శకుడిగా బాలకృష్ణతో సింహ, లెజెండ్ వంటి చిత్రాలను అందించిన బోయపాటి శ్రీను తయారుచేస్తున్న ఓ కథలో ఆయన నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

07/01/2016 - 21:05

రేష్మీగౌతమ్, చరణ్‌దీప్ ప్రధాన తారాగణంగా చరణ్ క్రియేషన్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో జి.ఎస్.ఎస్.పి. కళ్యాణ్ రూపొందించిన చిత్రం ‘అంతం’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఏ సర్ట్ఫికెట్ లభించిన ఈ చిత్రం గూర్చి కళ్యాణ్ మాట్లాడుతూ..

07/01/2016 - 21:04

రణధీర్, రుక్సార్ మీర్ సుప్రీత్ జంటగా రామా రీల్స్ పతాకంపై జాన్ సుందర్ పూదోట రూపొందిస్తున్న చిత్రం ‘షోటైమ్’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ఓ వైవిధ్యమైన కథనంతో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఇటీవల విడుదల చేశామని, తొలి రోజే భారీ వ్యూస్ లభించాయని, దీంతో తమ చిత్ర విజయంపై నమ్మకం ఏర్పడిందని తెలిపారు.

07/01/2016 - 21:03

కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన సినిమా ‘క్వీన్-2014’లో విడుదలైన ఈ సినిమాకుగానూ కంగనా జాతీయ ఉత్తమ నటి అవార్డుకూడా సొంతం చేసుకున్నారు. ఇక హిందీలో ఈ సినిమా విడుదలైనప్పట్నుంచే తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ కానుందని ప్రచారం జరిగినా ఇప్పటికీ ఆ రీమేక్ పట్టాలెక్కలేదు. తెలుగు రీమేక్ కోసం నయనతార, నిత్యామీనన్, సమంత.. ఇలా చాలా పేర్లే వినిపించినా ఏదీ ఖరారుకాలేదు.

07/01/2016 - 21:00

విజయ్‌కాంత్ కథానాయకుడుగా తమిళంలో రూపొందిన ‘పెరరసు’ చిత్రాన్ని తెలుగులో కాశీవిశ్వనాథ్‌గా అనువదించారు. సెవెంత్ ఛానల్ సమర్పణలో నిర్మాత బాలాజీ అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి.

07/01/2016 - 20:59

జాకీచాన్ రూపొందించిన హాలీవుడ్ చిత్రం ది లెజెండరీ అమెజాన్స్. ఈ చిత్రంలో రీచాజన్, సెసిలియా చియాంగ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఫ్రాంకీచాన్ దర్శకత్వంలో ఇండో ఓవర్సీస్ పతాకంపై రూపొందించారు. హాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగులో సాయిశ్రీజ విఘ్నేష్ ఫిలిమ్ ప్రొడక్షన్స్ పతాకంపై జి.వంశీకృష్ణ వర్మ అందిస్తున్నారు.

07/01/2016 - 20:57

రామకృష్ణ, అంకిత జంటగా జయకమల్ ఆర్ట్స్ పతాకంపై అమనిగంటి వెంకట శివప్రసాద్ దర్శకత్వంలో అయితం ఎస్.కమల్ రూపొందిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ఉందా..లేదా?. ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్తిచేసి, రెండో షెడ్యూల్ ఈ వారంలో ప్రారంభిస్తున్నారు.

07/01/2016 - 20:56

సంచలన తారగా దక్షిణాదిలో పాపులర్ అయిన నయరతారకు సినిమాల్లోకంటే.. ప్రేమాయణాలతోనే బాగా పాపులర్ అయింది! ఇప్పటికే రెండు ప్రేమాయణాలకు బ్రేక్‌అప్ చెప్పి.. ఇప్పుడు మూడో ప్రేమాయణం సాగిస్తోంది. ఈమధ్య ఎందుకో దర్శకుడు విఘేష్ శివన్‌తో బ్రేక్‌అప్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. శింబుతో ఆమె క్లోజ్‌గా ఉండడంతో ఆమె లవ్‌కు బ్రేక్ అప్ పడిందని గుసగుసలు వినిపించాయి.

06/30/2016 - 21:13

కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ‘సరైనోడు’ సూపర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ స్టార్ స్టేటస్ తారాస్థాయికి చేరిపోయింది. ఈ స్టేటస్‌ను అలాగే కొనసాగించాలన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా కొత్త సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు అల్లు అర్జున్. దర్శకుడు హరీష్ శంకర్‌తో అల్లు అర్జున్ తన కొత్త సినిమా చేయనున్నట్లు తెలిసిందే.

06/30/2016 - 21:11

సింగపూర్‌లో జరుగుతున్న ‘సైమా’ వేడుకల్లో తెలుగు చిత్రసీమకు చెందిన తారలు హైలెట్‌గా నిలుస్తున్నారు. మంచు లక్ష్మి తన తనయతో కలసి రెడ్‌కార్పెట్‌పై సందడి చేస్తే అలీ తన భార్యతో సహా వేడుకలకు హాజరయ్యారు. ఇక అందాల తార రకుల్‌ప్రీత్‌సింగ్, రానా, దేవిశ్రీప్రసాద్‌సహా పలువురు ప్రముఖులు ఇప్పటికే సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. దక్షిణాది సినీరంగాలకు చెందినవారికి సైమా అవార్డులను అందచేస్తారు.

Pages