S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/04/2018 - 12:30

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నడిరోడ్డుపై తుపాకీతో బెదిరించి రూ.70 లక్షలు ఎత్తుకెళ్లిన సంఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీకి చెందిన కాశిష్ బన్సాల్ అనే వ్యక్తి గురువారం గురుగ్రామ్ బయలుదేరి వెళ్లారు. ఆయన కారులో నరైనా ప్రాంతంలో ఫ్లైఓవర్‌పై వెళుతుండగా..ముగ్గురు వ్యక్తులు కారును ఆపారు. వారిలో ఒకరు తుపాకీ చూపించగా.. ఇద్దరు కారు డిక్కీలో ఉన్న రూ.70 లక్షల క్యాష్‌బ్యాగ్‌ను ఎత్తుకువెళ్లారు.

08/04/2018 - 12:26

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని పోషియాన్ జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు ఐదుగురు ఉగ్రవాదులు మృతిచెందారు. శనివారంనాడు జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. నిన్నరాత్రి మట్టుబెట్టిన ఉగ్రవాదిని లష్కరేతోయిబాగా గుర్తించారు. ఘటనాస్థలి నుంచి ఏకే 47ను స్వాధీనం చేసుకున్నారు.

08/04/2018 - 05:52

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాతే ప్రధాన మంత్రి అభ్యర్థిని ఖరారు చేసుకోవాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ అధినాయకుడు అఖిలేష్ యాదవ్ మధ్య ఈ మేరకు ఓ అంగీకారం కుదిరినట్టు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి.

08/04/2018 - 05:00

న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశంలో వౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని, నిధుల కొరత లేదని, నాణ్యత విషయంలో రాజీపడకుండా ఉన్నత ప్రమాణాలతో పనులను చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నతాధికారులను ఆదేశించారు. శుక్రవారం ఇక్కడ రోడ్లు, గ్రామీణ, పట్టణాభివృద్ధి, రైల్వే, విమానాశ్రయాలు, రేవుల అభివృద్ధిపై సమీక్షించారు.

08/04/2018 - 05:25

నూఢిల్లీ, ఆగస్టు 3: రానున్న 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి సోనియాగాంధీ పోటీ చేయబోవడం లేదా.. అవునంటున్నంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఈ దఫా ఆ స్థానం నుంచి కుమార్తె ప్రియాంక వాద్రాను పోటీచేయించేందుకు సోనియాగాంధీ సుముఖంగా ఉన్నారని, ఈమేరకు పార్టీ అధిష్టానం సైతం నిర్ణయించిందని ఆ వర్గాలు తెలిపాయి.

08/04/2018 - 04:57

న్యూఢిల్లీ, ఆగస్టు 3: సామాజిక మాధ్యమాలను పర్యవేక్షించేందుకు సామాజిక మాధ్యమాల కమ్యూనికేషన్ హబ్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదన తమ పరిశీలనలో లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియచేసింది. సామాజిక మాద్యమాల ద్వారా వదంతులు, అబద్ధాలతో కూడిన సమాచారం ప్రచారమవుతున్నాయని, దీనిని అరికట్టేందుకు సామాజిక మాధ్యమాల నియంత్రణకు హబ్ ఏర్పాటు చేస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది.

08/04/2018 - 04:56

న్యూఢిల్లీ, ఆగస్టు 3: జమిలి ఎన్నికలను తాము అంగీకరించమని, ఈ విధానం సమాఖ్య విధానానికి వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని లా కమిషన్‌కు విన్నవించినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. శుక్రవారం ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, పి చిదంబరం, కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ, ఆనంద్ శర్మ, జేడీ శీలం తదితర నేతలు లా కమిషన్ ప్యానెల్ అధికారులను కలిశారు.

08/04/2018 - 02:40

న్యూఢిల్లీ, ఆగస్టు 3: కేంద్ర ప్రభుత్వం సంస్థలు, సేవారంగం, పబ్లిక్ రంగ సంస్థల్లో కాపులకు 5% కోటా ఉండేలా ప్రైవేట్ మెంబర్ బిల్లును టీడీపీ సభ్యుడు అవంతి శ్రీనివాస్ శుక్రవారం లోక్‌సభలో ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదించిన ‘రిజర్వేషన్స్ ఇన్ పోస్ట్స్ అండ్ సర్వీసెస్ ఫర్ కాపు కమ్యూనిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2018 చట్టం’ బిల్లుపై చర్చ ఇప్పుడిప్పుడే జరుగకపోవచ్చు.

08/04/2018 - 02:39

న్యూఢిల్లీ, ఆగస్టు 3: గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ ఫిరాయించిన నలుగురు ఎంపీలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కోరారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రక్రవారం కలిసి, ఫిరాయింపుఎంపీలపై చర్యలు తీసుకోవాలని ఓ వినతిపత్రం ఇచ్చారు.

08/04/2018 - 05:45

న్యూఢిల్లీ, ఆగస్టు 3: మధ్యాహ్న భోజన పథక కార్మికులను కనీస వేతన చట్టం పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్‌ను టీఆర్‌ఎస్ ఎంపీ కవిత కోరారు. శుక్రవారం కవిత నేతృత్వంలో మధ్యాహ్న భోజన పథక కార్మికులు, టీఆర్‌ఎస్ ఎంపీలు జవడేకర్‌ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు.

Pages