S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/06/2018 - 01:13

పూణే, ఆగస్టు 5: ఒక ఆటో డ్రైవర్ మేయర్‌గా ఎంపికయ్యారు. ప్రజాస్వామ్య విశిష్టతను చాటే ఆసక్తికరమైన ఈ ఉదంతం మహారాష్టల్రోని పారిశ్రామిక నగరం పింప్రి చించివాడలో జరిగింది. ఒక ఆటో డ్రైవర్ మేయర్‌గా ఎంపికయ్యే మహాభాగ్యాన్ని భారతీయ జనతా పార్టీ కల్పించింది. కొత్త మేయర్ పేరు రాహుల్ జాదవ్. వివరాల్లోకి వెళితే, జాదవ్ చాలా సంవత్సరాల పాటు ఆటో డ్రైవర్‌గా పనిచేశారు. ఆరు సీట్ల ఆటోను 1996 నుంచి 2003వరకు నడిపాడు.

08/06/2018 - 01:12

ముంబయి, ఆగస్టు 5: ప్రతిభావంతులకు, అర్హులైన నిపుణులకు అమెరికా ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటుందని అమెరికా కాన్సుల్ జనరల్ ఎడ్గర్డ్ కగాన్ స్పష్టం చేశారు. ఒక వైపు హెచ్-1 బీ వీసాల మంజూరు నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేస్తుందని సమాచారం వెలువడుతున్న సమయంలో ఎడ్గర్డ్ కగాన్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

08/06/2018 - 00:27

న్యూఢిల్లీ, ఆగస్టు 5: దేశ రక్షణ కోసం పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకునే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ప్రకటన చేశారు.

08/05/2018 - 05:46

న్యూఢిల్లీ: రాజకీయాలను పక్కన పెట్టి, సభలో మాత్రం ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని ఉపరాష్టప్రతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులకు సూచించారు. కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులకు నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు.

08/05/2018 - 05:41

న్యూఢిల్లీ, ఆగస్టు 4: తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన జిల్లాల ప్రాతిపదికపై రూపొందించిన కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా 371 డీ అధికరణ కింద సవరణలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు విజ్ఞప్తి చేశారు. శనివారం ప్రధానితో సుమారు 45 నిమిషాలు సమావేశమైన కేసీఆర్ పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం.

08/04/2018 - 22:50

జమ్మూ, ఆగస్టు 4: జమ్మూలో మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్ధుల్లా, ఓమర్ అబ్దుల్లా నివాస గృహ సముదాయంలోకి భద్రతా నిబంధనలను ఉల్లంఘించి కారులో దూసుకువచ్చిన ఒక ఆగంతకుడిని సీఆర్‌పీఎఫ్ బలగాలు కాల్చి చంపాయి. ఈ యువకుడి పేరు సయ్యద్ ముర్ఫాదద్ షా అని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటన జరుగుతున్న సమయంలో ఫరూక్ అబ్దుల్లా ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు వెళుతున్నారు. ఈ ఘటన జమ్మూలోని భటిండాలో శనివారం ఉదయం జరిగింది.

08/04/2018 - 22:49

నూఢిల్లీ, ఆగస్టు 4: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేస్తున్న ముగ్గురు న్యాయమూర్తులు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. దీంతో సుప్రీం కోర్టులో న్యామూర్తుల సంఖ్య 25కు చేరింది.

08/04/2018 - 12:36

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సోనియాగాంధీ హాజరుకా లేదు. అనారోగ్య కారణాల రీత్యా ఆమె హాజరుకావటం లేదని తెలిసింది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈశాన్య రాష్ట్రాల నేతలు తరుణ్ గగోయ్, బిపున్ బోరా, దేబబత్ర సైకియా, గౌరవ్ గగోయ్, సుస్మితా దేవ్‌లు కూడా హాజరయ్యారు.

08/04/2018 - 12:35

న్యూఢిల్లీ: దేశంలోని పలు హైకోర్టులకు చీఫ్ జస్టీస్‌లను నియమిస్తూ శనివారం ఉదయం న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జమ్మూకాశ్మీర్‌కు మొట్టమొదటి మహిళా చీఫ్ జస్టీస్‌గా గీతా మిట్టల్ నియమితులయ్యారు.

08/04/2018 - 12:33

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్ జిల్లా నికాముద్దీన్‌పూర్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఆగివున్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ఈ ప్రమాదం సంభవించింది. అలహాబాద్‌లోని కాడె మాణిక్‌పూర్ ఆలయానికి వెళుతుండగా.. ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Pages