S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/07/2018 - 03:28

న్యూఢిల్లీ, ఆగస్టు 6: దేశ రాజకీయాల్లో సైద్ధాంతిక రాహిత్యం పెరిగిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మేధోశూన్యత ఆవహించిందని సోమవారం ఇక్కడ అన్నారు. ‘యువతకు సోషలిజయంకు కమ్యూనలిజానికి తేడా తెలియదు.. అలాగే సోషలిజంకు ప్రజాస్వామ్యానికి మధ్య తేడా తెలియకుండా పోయింది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

08/07/2018 - 03:18

న్యూఢిల్లీ, ఆగస్టు 6: కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్కే ధావన్ సోమవారం ఇక్కడ ఓ ప్రేవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీకి ఆయన అత్యంత సన్నిహితుడు. ఢిల్లీలోని బీఎల్ కపూర్ ఆసుపత్రిలో రాత్రి 7 గంటల ప్రాంతంలో ధావన్ మృతి చెందినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 81 ఏళ్ల రాజేందర్ కుమార్ ధావన్ గత మంగళవారం ఆసుపత్రిలో చేరారు. ఇందిరా గాంధీ పర్సనల్ సెక్రెటరీగా ధావన్ పనిచేశారు.

08/07/2018 - 04:00

న్యూఢిల్లీ, ఆగస్టు 6: తెలంగాణలో కొత్తగా 31 కాంగ్రెస్ కమిటీల ఏర్పాటుకు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమోదం తెలిపారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాలతోపాటు పట్టణ కాంగ్రెస్ కమిటీల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసినట్టు సోమవారం కాంగ్రెస్ కార్యాలయం నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు.

08/07/2018 - 02:56

న్యూఢిల్లీ, ఆగస్టు 6: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదేశం మూలంగానే ఏపీలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికోసం విడుదల చేసిన రూ.350కోట్లను రిజర్వ్ బ్యాంక్ తిరిగి తీసుకున్నదని తెలుగుదేశం సభ్యుడు కింజారపు రామ్మోహన్ నాయకుడు ఆరోపించారు. రామ్మోహన్ నాయుడు సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేటాయించిన నిధులను ఎలా ఉపసంహరించుకుంటారని నిలదీశారు.

08/07/2018 - 02:13

న్యూఢిల్లీ, ఆగస్టు 6: సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో మరో ఐదు నదుల అనుసంధాన బృహత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్గరీ సోమవారం నాడిక్కడ వెల్లడించారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) నుంచి ఆర్థిక సాయం కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.

08/07/2018 - 02:03

గౌహతి, ఆగస్టు 6: తాను మహాభారతంలో అర్జునుడు లాంటి వాడినని, లక్ష్యంపై గురి తప్ప మరేమీ పట్టించుకోనని అస్సాం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) సమన్వయకర్త ప్రతీక్ హజేలా అన్నారు. పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా తన కర్తవ్యాన్ని నిర్వహించానని, ఇందులో ఎలాంటి రాజకీయ వత్తిళ్లు తనపై ప్రభావం చూపలేదని స్పష్టం చేశారు.

08/07/2018 - 01:09

న్యూఢిల్లీ, ఆగస్టు 6: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎంపిక ఈ నెల తొమ్మిదో తేదీన జరుగుతుందని చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు సోమవారం ప్రకటించారు. ఈ పదవికి పోటీ పడాలనుకునేవారు 8వ తేదీ మధ్యాహ్నం పనె్నండు గంటలలోగా నామినేషన్లు దాఖలు చేయాలని ఆయన తెలిపారు. బీజేపీ అధినాయకత్వం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి జేడీ(యూ)కు చెందిన సీనియర్ సభ్యుడు హరివంశ్‌ను రంగంలోకి దించుతోంది.

08/07/2018 - 01:29

చెన్నై, ఆగస్టు 6: అనారోగ్యం కారణంగా కొద్దిరోజుల కిందట ఇక్కడి కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి అరోగ్యం సోమవారం బాగా క్షీణించింది. వయోభారం రీత్యా ఆయన ఆరోగ్య పరిస్థితిని నిలకడగా ఉంచడం తమకు సవాల్‌గా మారిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 94 ఏళ్ల కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు తాజా బులెటిన్‌ను విడుదల చేశాయి.

08/07/2018 - 01:37

న్యూఢిల్లీ: తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి భారీ మెజారిటీతో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రమేష్‌కు 106 ఓట్లు పడితే బీజేపీ అభ్యర్థి భూపేందర్ యాదవ్‌కు 69 ఓట్లు, జేడీ(యూ) అభ్యర్థి హరివంశ్‌కు 26 ఓట్లు లభించటం గమనార్హం. పీఏసీకి చెందిన రెండు రాజ్యసభ ఖాళీలను భర్తీ చేసేందుకు సోమవారం ఎన్నికలు జరిగాయి. ఈ రెండు ఖాళీలకు టీడీపీ సభ్యుడు రమేష్, బీజేపీ సీనియర్ నేత

08/07/2018 - 21:22

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలయ్యే వరకు నిరసన కొనసాగిస్తామని తెలుగుదేశం ఎంపీలు స్పష్టం చేశారు. ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు చేతబట్టి కేంద్రానికి వ్యతిరేకంగా సోమవారం తెలుగుదేశం ఎంపీలు పార్లమెంట్ అవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా గల్లా జయ్‌దేవ్ మాట్లాడుతూ పార్లమెంట్‌లో నిరసన తెలపడం తమకు రాజ్యాంగం కల్పించిన హక్కని అన్నారు.

Pages