S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/14/2018 - 02:57

న్యూఢిల్లీ, మే 13: శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ, రాష్ట్రంలో అత్యధికంగావున్న కాపు సామాజిక వర్గానికి పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను నియమించింది.

05/13/2018 - 04:05

చిత్రం: నేపాల్ నుంచి శనివారం ఢిల్లీకి చేరుకున్న మోదీకి ఘనస్వాగతం పలుకుతున్న సుష్మా స్వరాజ్

05/13/2018 - 04:06

ఖాట్మాండు, మే 12: రెండు రోజుల నేపాల్ పర్యటన ఫలప్రదమైందని, భారత్ విదేశాంగ విధానంలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలి పోతుందని భారత ప్రధాని నరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య ఉన్న సంబంధాలు నూతన శకం వైపు మార్గనిర్దేశనం చేసేందుకు వీలుగా ఈ పర్యటన దోహదపడుతుందని ఆయన ట్వీట్ చేశారు. ‘ ఈ పర్యటనను నేను ఎప్పుడూ మర్చిపోలేను. నేపాల్ ప్రజల ఆదరాభిమానాలు ఆకట్టుకున్నాయి.

05/13/2018 - 04:08

ఖాట్మాండు, మే 12: నేపాల్ అభివృద్ధికి అన్ని రకాలుగా భారత్ సహకరిస్తుందని భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. నేపాల్-్భరత్ దేశాల మధ్య మైత్రి శాశ్వతమని, ఎవరూ విడదీయలేని బంధమని ఆయన అన్నారు.

05/13/2018 - 02:53

కౌలాలంపూర్, మే 12: ఇటీవల జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలైన మలేసియా మాజీ నేత నజీబ్ రజాక్‌కు కౌలాలంపూర్ విమానాశ్రయం వద్ద గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భార్యతో సహా ఇండోనేసియాకు వెళ్తున్న ఇతడిని కోపోద్రిక్తులై ఎయిర్‌పోర్టును చుట్టుముట్టిన గుంపు అడ్డుకుంది. ప్రభుత్వం కూడా అతని విదేశీ ప్రయాణంపై నిషేధం విధిస్తూ అతను దేశం వదలివెళ్లరాదని ఉత్తర్వులు జారీ చేసింది.

05/13/2018 - 04:11

చిత్రం: పెళ్లి పీటల నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న రెండు జంటల ఆనందం ఇది....

05/13/2018 - 04:15

లాహోర్, మే 12: పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు చురుగ్గాపనిచేస్తురని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వెల్లడించారు. పనామా పేపర్ల కుంభకోణం కేసులో సుప్రీం కోర్టు అనర్హతవేటుకు గురైన నవాజ్ మిలిటెంట్ల కార్యకలాపాలపై బహిరంగ ప్రకటన చేశారు. పాక్‌లో మిలిటెన్సీ చురుగ్గా ఉందన్న ఆయన ‘ముంబయిలో దాడులకు పాల్పడిందీ పాక్ ఉగ్రవాదులే’అని అంగీకరించారు. ముంబయి పేలుళ్లతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

05/13/2018 - 02:14

న్యూఢిల్లీ, మే 12: కర్నాటకలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా. ఇదే జరిగితే మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడ నాయకత్వంలోని జేడీఎస్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో కింగ్ మేకర్ కావడం ఖాయం. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే మీ మద్దతు ఎవరికి అనే ప్రశ్నకు దేవెగౌడ సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.

05/13/2018 - 04:17

ఖాట్మాండు, మే 12: నేపాల్ భూభాగాన్ని భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించేందుకు ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించే ప్రసక్తిలేదని నేపాల్ ప్రధానమంత్రి కెపి శర్మ ఓలి స్పష్టం చేశారు. ఇదే విషయం చర్చల్లో ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింతది. నేపాల్‌లో భారత ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన శనివారం ముగిసింది.

05/13/2018 - 02:00

న్యూఢిల్లీ, మే 12: ఆంధ్రప్రదేశ్ భూసేకరణ సవరణ చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం ముద్ర వేసినట్లు తెలిసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఏపీ భూసేకరణ సవరణ బిల్లు గురించి అధికారులతో చర్చించిన తరువాత తన ఆమోదం తెలిపారని తెలిసింది. రవిశంకర్ ప్రసాద్ ఆమోదముద్ర పడిన వెంటనే ఏపీ భూసేకరణ సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ పరిశీలనకు పంపించారు.

Pages