S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/05/2018 - 13:45

న్యూఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం సుప్రీంకోర్టు గడప తొక్కారు. ఈడీ సమన్లను వ్యతిరేకిస్తూ.. ఆయన సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఈడీ అధికారాన్ని కార్తి సవాల్‌ చేశారు. ఎఫ్ఐఆర్‌లో నమోదుచేయని విషయాలపై సీబీఐ, ఈడీలు తనను ప్రశ్నిస్తున్నాయని కార్తి చిదంబరం అన్నారు.ప్రస్తుతం కార్తి సీబీఐ కస్టడీలో ఉన్నారు.

03/05/2018 - 13:49

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది సహా నలుగురు మరణించారు. పొహన్‌ సమీపంలో ఒక కారును ఆపేందుకు యత్నించగా.. అందులోని వ్యక్తులు ఆగకుండా వేగంగా వెళ్లడంతో భద్రతా బలగాలు వారిపైకి కాల్పులు జరిపాయని పోలీసు అధికారి తెలిపారు.

03/05/2018 - 16:31

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలుచేయాలని కోరుతూ పార్లమెంట్ ఆవరణలో తెలుగదేశం, వైకాపా సభ్యులు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ మహాత్ముని విగ్రహం వద్ద టీడీపీ సభ్యులు ప్లకార్డులు చేతపట్టి ఆందోళన చేశారు. పార్లమెంట్ స్ట్రీట్ వద్ద వైకాపా సభ్యులు ఆందోళన చేశారు.

03/05/2018 - 13:53

న్యూఢిల్లీ: లోకసభ వాయిదా పడింది. బడ్జెట్ మలివిడిత సమావేశాలు ప్రారంభంకాగానే ఉభయ సభల్లో ఆందోళన ప్రారంభమైంది. తొలుత సమావేశాలు ఆరంభంకాగానే ఇటీవల మృతిచెందిన సభ్యులకు నివాళులర్పించారు. అనంతరం స్పీకర్ సుమిత్రామహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభంకాగానే సభ్యులు ఆందోళన చేపట్టడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కనిపించటంతో చైర్మన్ వెంకయ్యనాయుడు సభను కొద్దిసేపు వాయిదా వేశారు.

03/05/2018 - 04:56

కోహిమా, మార్చి 4: నెఫియో రియోకు అసెంబ్లీలో మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నదున ఆయనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సింగా ఆహ్వానిస్తామని నాగాలాండ్ గవర్నర్ పి.బి. ఆచార్య ఆదివారం స్పష్టం చేశారు. కాగా నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీడీపీ) అధినేత నెఫియో రియో, గవర్నర్‌ను కలిసి తనకు అసెంబ్లీలో 32 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని అందువల్ల తనకే ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఇవ్వాలని కోరారు.

03/05/2018 - 04:54

ముంబయి, మార్చి 4: ఐఎన్‌ఎక్స్ మీడియాకేసులో శనివారం అరెస్టయిన కార్తి చిదంబరాన్ని సీబిఐ అధికార్లు ఆదివారం ముంబయిలోని బైకుల్లా జైలుకు తరలించారు. ఒకప్పటి ఐఎన్‌ఎక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌కు మాజీ డైరెక్టర్, ఇంద్రాణి ముఖర్జీ, షీనా బోరా హత్యకేసులో ఇదే జైల్లో ఉన్నారు.

03/05/2018 - 04:51

న్యూఢిల్లీ, మార్చి 4: సంకుచిత జాతీయవాదాన్ని పక్కనపెట్టి, సముద్ర మార్గాల్లో స్వేచ్ఛను పరిరక్షించుకున్న నాడే ఇండో ఆసియా పసిఫిక్ దేశాల్లో శాంతి, సామరస్యం పరిఢవిల్లుతుందని వియత్నాం అధ్యక్షుడు ట్రాన్ డాయ్ క్వాంగ్ అన్నారు. భారత్ విషయంలో డ్రాగన్ చైనా ధోరణిని పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

03/05/2018 - 04:47

తిరువనంతపురం, మార్చి 4: దేశానికి బలమైన వామపక్షాలు అవసరమని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ పేర్కొన్నారు. వామపక్షాలు పూర్తిగా దెబ్బతినడం దేశానికి శ్రేయస్కరం కాదన్నారు. త్రిపుర ఎన్నికల్లో వామపక్షాలు ఓటమిపాలైన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల్లో వామపక్షాలకు వ్యతిరేకంగా పోటీ చేస్తాం. కానీ ఆ పార్టీలు పూర్తిగా దెబ్బతినడం దేశానికి మంచిదికాదు’ అని పేర్కొన్నారు.

03/05/2018 - 04:47

లక్నో, మార్చి 4: ఈశాన్య రాష్ట్రాల్లో భాజపా సాధించిన చారిత్రక విజయంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ అమలు పరుస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమిత్ షా సంస్థాగత నిర్వహణ సామర్థ్యం ఈ విజయాలకు కారణమన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భాజపా అధికారాన్ని హస్తగతం చేసుకునే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.

03/05/2018 - 04:45

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు ఆదివారం అగర్తలాలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బిప్‌లాబ్ కుమార్ దేవ్

Pages