S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/07/2018 - 01:06

న్యూఢిల్లీ, మార్చి 6: బీజేపీ మిత్రపక్షాలు తెలుగుదేశం, శివసేన, అన్నా డీఎంకేతోపాటు తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు పోడియంను చుట్టుముట్టి ఎన్‌డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ గొడవ చేయటంతో మంగళవారం కూడా పార్లమెంటు ఉభయ సభలు పూర్తిగా అదుపు తప్పాయి. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ అధ్యక్షుడు ఎం.

03/07/2018 - 01:02

న్యూఢిల్లీ, మార్చి 6: తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్ల శాతం పెంచాలని కోరుతూ టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసన చేపట్టారు. మంగళవారం ఉదయం పార్లమెంట్ అవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ ఎంపీలు ముస్లిం రిజర్వేషన్లు కల్పించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ రెండోరోజు నిరసన కొనసాగించారు.

03/07/2018 - 01:01

భావ్‌నగర్, మార్చి 6: గుజరాత్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో 32 మంది దుర్మరణం చెందారు. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్ అదుపుతప్పి ఓ వంతెన పైనుంచి కాల్వలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో 32 మంది పెళ్లివారు మృతిచెందారు. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయడానికి డ్రైవర్ ప్రయత్నించగా ఈ దారుణం చోటుచేసుకుంది.

03/07/2018 - 01:00

న్యూఢిల్లీ, మార్చి 6: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలుచేయాలని కోరుతూ వరసగా రెండోరోజు పార్లమెంట్‌లో టీడీపీ, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు నిరసనను కొనసాగించారు. మంగళవారం ఉదయం పార్లమెంట్ అవరణ ఎంపీల నిరసనలతో హోరెత్తింది. గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలు అమలు చేయాలని నినాదాలిస్తూ ఆందోళన కొనసాగించారు.

03/06/2018 - 16:27

అగర్తల: త్రిపురలో రెండు దశాబ్దాల తరువాత అధికారాన్ని చేపట్టిన బిజెపి ప్రభుత్వం బెలోనియా కాలేజీ స్క్వేర్ వద్దనున్న వ్లాదిమిర్ లెనిన్ విగ్రహాన్ని కూల్చివేసింది. దీనికి సంబంధించిన వీడియో బయటపడటంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. విగ్రహాం కూల్చివేత సందర్భంగా భారత్‌మాతకు జై అని నినదించారు.

03/06/2018 - 16:46

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి గీతాంజలి గ్రూప్ వైస్ ప్రెశిడెంట్‌గా పనిచేస్తున్న విపుల్ చితాలియాను మంగళవారంనాడు అరెస్టు చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటి వరకు 18మందిని అదుపులోకి తీసుకున్నారు. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, అతని మేనమామ మెహల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 12,636 కోట్ల రూపాయల వరకు టోకరా ఇచ్చిన విషయం విదితమే.

03/06/2018 - 13:06

న్యూఢిల్లీ: హర్యానాలోని కార్నాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఇంధన ట్యాంకు పేలి మరో వాహనాన్ని ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు ప్రాణాలుకోల్పోయారు. మంగళవారం ఉదయం కార్నాల్ జిల్లా షామ్‌గాద్ గ్రామం సమీపంలోని జీటీ రోడ్డుపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

03/06/2018 - 17:06

న్యూఢిల్లీ: ఉభయ తెలుగు రాష్ట్రాల ఎంపీల ఆందోళనల మధ్య లోకసభ కొనసాగుతుంది. స్పీకర్ సుమిత్రా మహాజన్ లోకసభను కొనసాగిస్తున్నారు. ఆర్థికబిల్లుకు ఆమోదం తెలపాలని కేంద్రమంత్రి విజ్ఞప్తి చేశారు. ఆందోళనల మధ్య ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా పంజామ్ నేషనల్ బ్యాంక్ స్కామ్‌పై చర్చకు కాంగ్రెస్ పట్టుపట్టింది. ప్లకార్డులతో టీడీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకువెళ్లారు.

03/06/2018 - 16:59

న్యూఢిల్లీ: కార్తీచిదంబరాన్ని సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టింది. కార్తీని ఐదురోజులు కస్టడీ సిబిఐ కోరింది. సీల్డ్ కవర్‌లో నివేదికను సిబిఐ కోర్టుకు సమర్పించింది. ఇదిలావుండగా కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కోర్టుకు చేరుకున్నారు. బెయిల్ కోరుతూ కార్తీ పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. మరో మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీని పొడిగించింది.

03/06/2018 - 13:43

న్యూఢిల్లీ: మేఘాలయలో పదేళ్ల కాంగ్రెస్ పాలనకు నేటితో తెరపడింది. ఆ రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) అధ్యక్షుడు కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంతో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణం చేశారు.

Pages