S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/27/2017 - 03:09

అహ్మదాబాద్, నవంబర్ 26: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న గుజరాత్‌లో ఓటర్లను ఆకట్టుకోవడానికి అధికార బీజేపీ మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘చాయ్‌వాలా’ ప్రచారాన్ని అనుసరించింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సహా ఆ పార్టీ నేతలంతా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో కలిసి చాయ్ (తేనీరు) తాగుతూ రేడియోలో ప్రధానమంత్రి ‘మన్ కీ బాత్’ను విన్నారు.

11/27/2017 - 03:00

న్యూఢిల్లీ, నవంబర్ 26: రాజ్యంలోని మూడు విభాగాలయిన న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అధికారాల పంపిణీ ఎంతో జఠిలమయినదని, కీలకమయినదని, ఈ మూడు విభాగాలూ సమానమైన హోదా గలవని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఈ మూడు వ్యవస్థల మధ్య అధికారాల విభజనలో గల సున్నితమైన సమతుల్యతను, సాభ్రాతృత్వాన్ని కొనసాగించాలని, చెదరగొట్టకూడదని ఆయన పిలుపునిచ్చారు.

11/27/2017 - 02:57

న్యూఢిల్లీ, నవంబర్ 26: ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా నిరోధన ధ్యేయంగా హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మూడు రోజుల మాస్కో పర్యటన మొదలైంది. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఈ అంశాలపై కీలక ఒప్పందాలు కుదిరే అవకాశముందని అధికారులు తెలిపారు. ఆదివారం నాడు మాస్కోకు బయలుదేరిన రాజ్‌నాథ్‌సింగ్ అనేక ద్వైపాక్షిక అంశాలపై రష్యా నాయకత్వంతో చర్చలు జరిపే అవకాశముందని అధికారులు తెలిపారు.

11/27/2017 - 02:41

న్యూఢిల్లీ, నవంబర్ 26: 26/11 ముంబయి ఉగ్రదాడి నేపథ్యంలో, మరోసారి అటువంటి ప్రమాదం సంభవించకుండా దేశంలోని అనేక పోర్టుల రక్షణ సామర్థ్యంపై కేంద్రం దృష్టిపెట్టింది. 227 పోర్టుల్లోని భద్రతాంశాలపై సమీక్ష నిర్వహించిన కేంద్రం, పోర్టుల పటిష్టానికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్టు అధికార్లు వెల్లడించారు.

11/27/2017 - 02:40

న్యూఢిల్లీ, నవంబర్ 26: తెలుగుదేశం పార్టీకి కేంద్ర మంత్రి సుజనా చౌదరి భారీ విరాళం ప్రకటించారు. ఆ పార్టీ జాతీయ కార్యాలయంలో కార్యకర్తల కోసం ఏర్పాటుచేసిన భోజన సదుపాయాల నిమిత్తం రాజసభ సభ్యుడిగా తాను పొందిన జీతభత్యాల మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నట్టు సుజనా చౌదరి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటివరకు రాజ్యసభ సభ్యుడిగా 90 నెలలుపాటు కొనసాగినా సుజనా చౌదరి, దాదాపు 90 లక్షల రూపాయలు అందుకున్నారు.

11/27/2017 - 03:17

ముంబయి/న్యూఢిల్లీ, నవంబర్ 26: ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని యావద్భారతం ముక్తకంఠంతో ఉద్ఘాటించింది. తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజున ముంబయిపై ఉగ్రమూకలు జరిపిన నరమేధంలో అసువులు బాసిన వారికి ఘన నివాళులర్పిస్తూ ఈ జాడ్యాన్ని కూకటివేళ్లతో పెకలించి వేస్తామని స్పష్టం చేసింది. ముంబయి, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా అనేకచోట్ల జరిగిన కార్యక్రమాల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రణన్నినాదాలే చేశారు.

11/27/2017 - 01:59

న్యూఢిల్లీ, నవంబర్ 6: నాగరిక సమాజానికి పెను సవాల్‌గా మారిన ఉగ్రవాదాన్ని ఉమ్మడి శక్తితో తరిమికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. దేశ వాణిజ్య రాజధాని ముంబయిపై పాక్ ఉగ్రమూకలు దాడి జరిపి తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆనాటి ఆ నరమేధంలో అశువులు బాసిన పౌరుల త్యాగాలను గుర్తు చేసుకున్న ఆయన ‘ఉగ్రవాదం దయనందిన సవాల్‌గా మారింది.

11/27/2017 - 00:27

న్యూఢిల్లీ, నవంబర్ 26: హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరుకావాలని ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడును తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి ఆదివారం వెంకయ్యను కలిసి, డిసెంబరు 15 నుంచి 19 వరకు జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనాలని ఆహ్వానం పలికారు.

11/27/2017 - 00:27

న్యూఢిల్లీ, నవంబర్ 27: నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని సీపీఐ పార్టీ ధ్వజమెత్తింది. రెండు రోజులపాటు జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఒక ప్రకటనను విడుదల చేశారు.

11/27/2017 - 00:26

భోపాల్, నవంబర్ 26: అత్యాచారాలపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోదింది. 12 సంవత్సరాలు ఆలోపు వయస్సు కలిగిన బాలికలపై అత్యాచారం చేసే దోషులకు మరణశిక్ష విధించాలని ఆదివారం తీర్మానించింది. ఇందుకు సంబంధించి కేబినెట్ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే నేరశిక్షాస్మృతిలో కొన్ని మార్పులు చేస్తూ అత్యాచార దోషులపై విధించే జరిమానాను, శిక్షాకాలాన్ని పెంచాలని కూడా నిర్ణయించింది.

Pages