S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/24/2017 - 03:42

చెన్నై, నవంబర్ 23: ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన తనకు లేదని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారా? రారా? అన్న చర్చ కొంతకాలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘రాజకీయాల్లోకి రావడానికి ఇప్పుడు బలమైన అవసరం ఏదీ లేదు’ అని ఆయన గురువారం ఇక్కడ మీడియా ప్రతినిధులతో అన్నారు.

11/24/2017 - 03:41

న్యూఢిల్లీ, నవంబర్ 23: చైనా విషయంలో టిబెటన్ల ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా వైఖరిలో మార్పు వచ్చిందా? టిబెట్ గురించి దలైలామా గురువారం ఇక్కడ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రశ్నకు తావిస్తున్నాయి. టిబెట్ చైనా నుంచి స్వాతంత్య్రం కావాలని కోరుకోవడం లేదని, అయితే మరింత అభివృద్ధి కావాలని ఈ ప్రాంతం, ప్రజలు కోరుకుంటున్నారని దలైలామా అన్నారు.

11/24/2017 - 03:39

చెన్నయి, నవంబర్ 23: సత్యభామ విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం విద్యార్థిని రాగమోనికా ఆత్మహత్యకు పాల్పడటంతో అధికారులపై ఆగ్రహించిన తోటి విద్యార్థులు బుధవారం విశ్వవిద్యాలయ ఆవరణలో విధ్వంసానికి పూనుకున్నారు. విశ్వవిద్యాలయ ఆస్తులకు నిప్పు పెట్టారు. దీంతో సాయుధ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

11/24/2017 - 03:35

ఫరుఖాబాద్/ ఫిరోజాబాద్ (ఉత్తరప్రదేశ్), నవంబర్ 23: ఉత్తరప్రదేశ్‌లో కుల, మత రాజకీయాలకు బ్రేకులు వేసినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ పాలనలో ఇక అభివృద్ధి రాజకీయాలే కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ‘గూండారాజ్’ స్థానంలో చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరించామని ఆయన పేర్కొన్నారు.

11/24/2017 - 03:34

ఉత్తర భారతం మంచు దుప్పటి పరచుకుని కొత్త అందాలను సంతరించుకుంటోంది. జమ్మూ-కాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం తదితర రాష్ట్రాల్లో మంచు విపరీతంగా కురుస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తోంది. హిమాచల్‌లోని లాహా ప్రాంతంలో గురువారంనాటి దృశ్యమిది.

11/24/2017 - 03:31

ముంబయి, నవంబర్ 23: లింగమార్పిడి శస్తచ్రికిత్స కోసం తనకు సెలవు మంజూరు చేయాలంటూ 28 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ ముంబయి హైకోర్టును ఆశ్రయించింది. మహారాష్టల్రోని బీద్ జిల్లాలో పనిచేస్తున్న లలితా సాల్వే లింగమార్పిడి చేయించుకోవాలని, ఇకపై తనను అందరూ ‘లలిత్’గా పిలవాలని కోరుకుంటోంది. శస్తచ్రికిత్స కోసం నెలరోజులపాటు సెలవు ఇప్పించేలా మహారాష్ట్ర డిజిపిని ఆదేశించాలని ఆమె హైకోర్టులో పిటిషన్ వేసింది.

11/24/2017 - 03:27

న్యూఢిల్లీ, నవంబర్ 23: పాకిస్తాన్ జైలులో ఉన్న మాజీ నేవీ అధికారి కులభూషణ్‌ను కలిసేందుకు ఆయన తల్లి, భార్య అక్కడికి వెళితే వారికి భద్రత ఇస్తారా? అని పాకిస్తాన్‌ను భారత్ ప్రశ్నించింది. అనేక విజ్ఞప్తుల ఫలితంగా కులభూషణ్‌ను కలిసేందుకు అతని భార్యకు అనుమతి ఇస్తామని పాక్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

11/24/2017 - 02:37

న్యూఢిల్లీ, నవంబర్ 23: విభజన చట్టంలో పేర్కొన్న విధంగా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌కు తెలంగాణ గనుల శాఖ మంత్రి కేటీ రామారావు విజ్ఞప్తి చేశారు. గురువారం రామారావు కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, చౌదరీ బీరేంద్రసింగ్, హర్‌దీప్‌సింగ్ పూరీలతో సమావేశమయ్యారు.

11/24/2017 - 02:31

న్యూఢిల్లీ, నవంబర్ 23: విశాఖలో రూ.6వేల కోట్ల పెట్టుబడితో ఉక్కు ఆధారిత ఆటో మొబైల్ విడిభాగాల తయారీ పరిశ్రమ ‘కోల్డ్ స్టీల్ రోలింగ్ యూనిట్’ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీల అమలుపై గురువారం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల గనుల శాఖ మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

11/24/2017 - 02:26

న్యూఢిల్లీ, నవంబర్ 23: పాకిస్తాన్ మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే కార్యక్రమాలు ప్రారంభించింది. ముంబాయి ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి హఫీజ్ సరుూద్‌ను గృహ నిర్బంధం నుండి విడుదలు చేయాలని నిర్ణయించిన పాకిస్తాన్ పాలకులు జమ్ముకాశ్మీర్ వివాదంపై మరోసారి అంతర్జాతీయ కోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించింది.

Pages