S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/16/2017 - 03:07

పణజి, జూన్ 15: రాజకీయ నాయకుల కంటే రాజ్యాంగ వ్యవస్థల్లోనే అవినీతికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అన్నారు. అసలైన అధికారం అధికారుల దగ్గరే ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో రూ.16.86కోట్లు ఖర్చు అయినట్లుగా రాష్ట్ర ఎన్నికల అధికారులు లెక్కలు చూపించటాన్ని ఆడిట్ తప్పుపట్టడంపై పారికర్ స్పందించారు.

06/16/2017 - 01:53

న్యూఢిల్లీ, జూన్ 15: దేశ న్యాయవ్యవస్థలో ప్రజాహిత పిటిషన్ల సంస్కృతిని ప్రవేశపెట్టి క్రియాశీలతను పాదుగొల్పిన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పిఎన్ భగవతి (95) గురువారం ఇక్కడ కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. శనివారం ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. భారత దేశ 17వ ప్రధాన న్యాయమూర్తిగా 1985 జూలై నుంచి 86 డిసెంబర్ వరకూ ఆయన పనిచేశారు.

06/16/2017 - 01:39

న్యూఢిల్లీ, జూన్ 15: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. ప్రాజెక్టుకోసం అవసరమైన అటవీ భూములను వినియోగించుకోవడానికి కేంద్ర అడవులు, పర్యావరణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అటవీ సలహా కమిటీ అనుమతించటానికి సూత్రప్రాయంగా అంగీకరించింది.

06/16/2017 - 01:29

న్యూఢిల్లీ, జూన్ 15: మాంసం కోసం పశువుల అమ్మకాలను నిషేధిస్తూ కేంద్రం జారీ చేసిన కొత్త నిబంధనలను అమలు చేయాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి చేయదని, అంతేకాకుండా మాంసం ఎగుమతులు దెబ్బతినకుండా ఉండడానికి ప్రత్యేకంగా మాంసం మార్కెట్లను అనుమతించే విషయాన్ని కూడా పరిశీలిస్తుందని అదనపు సొలిసిటర్ జనరల్ పి నరసింహ గురువారం తెలిపారు.

06/16/2017 - 01:20

న్యూఢిల్లీ, జూన్ 15: పెట్రోలు, డీజిలు ధరలు తగ్గాయి. పెట్రోలు లీటరుకు రూపాయి 12 పైసలు, డీజిలు లీటరుకు రూపాయి 24 పైసలు తగ్గింది. తగ్గిన ధరలు శుక్రవారం ఉదయంనుంచి అమలులోకి వచ్చాయి. కాగా, శుక్రవారంనుంచి ప్రతి రోజూ పెట్రోలు, డీజిలు ధరలను సవరించనున్న దృష్ట్యా ప్రతి 15 రోజులకోసారి జరిపే ధరల సమీక్షలో ఇదే చివరిదవుతుంది.

06/16/2017 - 01:07

న్యూఢిల్లీ, జూన్ 15: విలీన వ్యవహారం అటకెక్కడంతో అన్నాడిఎంకె వైరి వర్గాల మధ్య మళ్లీ సమరం మొదలైంది. అసలు అన్నాడిఎంకె తమదేనని, తమకే అధికారిక రెండాకుల గుర్తు దక్కాలంటూ మాజీ ముఖ్యమంత్రి పనీర్‌సెల్వం గ్రూపు గురువారం ఎన్నికల కమిషన్‌కు రెండు వాహనాల్లో తెచ్చిన అఫిడవిట్లను సమర్పించింది.

06/16/2017 - 00:15

ముంబయి, జూన్ 15: రాష్టప్రతి ఎన్నికల్లో ఎన్‌డిఏ నిలబెట్టిన అభ్యర్థికి 54 శాతం ఓట్లు వస్తాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు. జూలై 17న రాష్టప్రతి ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. రాష్టప్రతి ఎన్నికల్లో అధికార పార్టీని ఎవరూ బ్లాక్‌మెయిల్ చేయలేరని ఆయన అన్నారు. ఎన్‌డిఏ అభ్యర్థికే మెజారిటీ ఓట్లు పడతాయని అన్నారు.

06/16/2017 - 00:15

బెంగళూరు, జూన్ 15: మైనింగ్ అక్రమాల కేసులో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామికి ఊరట లభించింది. జూన్ 20వరకూ ఆయన్ని అరెస్టు చేయడానికి వీల్లేదని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో కుమారస్వామి హైకోర్టును ఆశ్రయించారు.

06/16/2017 - 00:14

న్యూఢిల్లీ, జూన్ 15: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు రూల్స్ ఫైల్ ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపించినట్టు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ పిఆర్‌టియు నేతలకు తెలిపారు. ఢిల్లీలో కేంద్రం హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో తెలంగాణలోని ఉపాధ్యాయ సంఘం పిఆర్‌టియు నేతలు జనార్దన్ రెడ్డి, పూల రవీందర్, వి.మోహన్‌రెడ్డి, సరోత్తంరెడ్డి, చెన్నకేశవరెడ్డి సమావేశమయ్యారు.

06/15/2017 - 04:16

చిత్రం.. చండీగఢ్‌లోని వెస్టన్‌కమాండ్ ఆఠ్మీ ఆసుపత్రిలో బుధవారం విధులను చేపట్టిన అనంతరం ఆనందోత్సాహంతో సెల్ఫీతీసుకుంటున్న నర్సులు

Pages