S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/13/2017 - 02:03

ముంబయి, జూన్ 12: 1993 నాటి ముంబయి వరస పేలుళ్ల కేసులో అక్రమ బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు కొత్త చిక్కులు తప్పేట్లు కనిపిస్తోంది. ఈ కేసులో అయిదేళ్ల శిక్షాలం పూర్తి కావడానికి ఎనిమిది నెలలు ముందే ఆయనను ఎందుకు విడుదల చేశారో కారణాలు తెలియజేయాలని బొంబాయి హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్రమ ఆయుధాలను కలిగి ఉన్నారన్న ఆరోపణపై సంజయ్‌దత్‌కు అయిదేళ్లు శిక్ష విధించిన విషయం తెలిసిందే.

06/13/2017 - 01:59

న్యూఢిల్లీ, జూన్ 12: నిరాధారమైన ఆరోపణలను చేసి తమను అపఖ్యాతి పాలు చేసేవారిపై ధిక్కార చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ లేఖ రాసింది. భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కును ఈ రకమైన ఆరోపణలు చేసేవారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని న్యాయమంత్రిత్వశాఖకు రాసిన లేఖలో పేర్కొంది.

06/13/2017 - 01:48

న్యూఢిల్లీ, జూన్ 12:ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 25, 26 తేదీల్లో అమెరికాలో పర్యటించబోతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు వెళుతున్న మోదీ 26న ఆయనతో శిఖరాగ్ర సమావేశం జరుపబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరి మధ్య అనేక సందర్భాల్లో టెలిఫోన్ సంభాషణలు జరిగినప్పటికీ ముఖాముఖీ భేటీ కావడం ఇదే మొదటిసారి అవుతుంది.

06/13/2017 - 01:47

న్యూఢిల్లీ, జూన్ 12: బిజెపి అధినాయకత్వం కొత్త రాష్టప్రతి ఎంపిక కోసం ప్రతిపక్షాలతో చర్చించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా సోమవారం కొత్త రాష్టప్రతి ఎంపికపై చర్చించేందుకు ముగ్గురు సీనియర్ మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, సమాచార, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఈ కమిటీ సభ్యులు.

06/13/2017 - 01:45

న్యూఢిల్లీ, జూన్ 12: రైతుల రుణాలు మాఫీ చేయటం వలన కలిగే భారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించవలసి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. పంట రుణాలు మాఫీ చేసే రాష్ట్రాలకు కేంద్రంనుండి ఎలాంటి ఆర్థిక సహాయం అందదని సోమవారం మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వనరుల ఆధారంగానే రైతుల రుణాలు మాఫీ చేయాలని సూచించారు.

06/13/2017 - 01:16

న్యూఢిల్లీ, జూన్ 12: తెలుగు రాష్ట్రాలలో ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు విధానంపై త్వరగా ఆమోదించాలని కేంద్రహోంశాఖ అధికారులను ఏపి రాష్ట్రోపాధ్యా సంఘం కోరింది. సోమవారం ఢిల్లీలోని కేంద్రహోంశాఖ కార్యాలయంలో జాయింట్ సెక్రటరీ దిలీప్‌కుమార్‌తో ఉపాధ్యాయసంఘం నాయకులు చర్చలు జరిపారు.

06/13/2017 - 00:02

న్యూఢిల్లీ, జూన్ 12: ఓ వైపు భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ సోమవారం మన దేశం 11 మంది పాకిస్తానీ ఖైదీలను విడుదల చేసి వాఘా సరిసద్దు వద్ద ఆ దేశ అధికారులకు అప్పగించింది. తమ జైలుశిక్షలను పూర్తి చేసుకున్న తర్వాత వీరిని విడుదల చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వీరిలో దాదాపు అందరు కూడా వివిధ సమయాల్లో పొరబాటున సరిహద్దులు దాటి మన భూభాగంలోకి ప్రవేశించినవారే.

06/13/2017 - 00:01

లఖింపూర్‌ఖేరి (యూపీ), జూన్ 12: భార్యతో గొడవపడ్డ ఓ వ్యక్తి ఆమె తల నరికేసి సరాసరి పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని బెహ్‌జాం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉషాదేవి (50), రామ్ సేవక్ (52) దంపతులు. ఓ విషయంపై దంపతులు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రేకుడైన భర్త ఉషాదేవి తల నరికివేసి దాంతో సరాసరి పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు.

06/13/2017 - 00:01

చెన్నై, జూన్ 12: ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పనిచేయాల్సిన ముఖ్యమంత్రి కె పళనిస్వామి నాటకాలు ఆడుతున్నారని అన్నాడిఎంకె రెబర్ నేత ఓ పన్నీర్ సెల్వం ధ్వజమెత్తారు. రెండు వర్గాలు కలిసి పనిచేసే వాతావరణాన్ని పళని శిబిరం దెబ్బతీస్తోందని సోమవారం ఆయన ఆరోపించారు.

06/12/2017 - 23:58

సంభల్ (ఉత్తరప్రదేశ్), జూన్ 12: దేశంలో లింగ సమానత్వం కోసం జరుగుతున్న ప్రయత్నాలకు విఘాతం కలిగించే ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం జరిగింది. ఒకే విడతలో మూడుసార్లు తలాక్ చెప్పి నవవధువు (22)కు విడాకులిచ్చిన 45 ఏళ్ల వ్యక్తికి కుల పంచాయితీ పెద్దలు రూ.2 లక్షల జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి రూ.60 వేల పరిహారాన్ని చెల్లించాల్సిందిగా అతడిని ఆదేశించి సరిపుచ్చారు.

Pages