S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/15/2017 - 04:14

న్యూఢిల్లీ, జూన్ 14: గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగు పరచడంతో పాటు ఉపాధి అవకాశాలనూ పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ వినూత్న పథకాన్ని అమలు చేయబోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు క్యాబ్‌లు నడిపేందుకు వీలుగా స్వయం సహాయ బృందాలకు వడ్డీ లేని రుణాలను ఇవ్వాలన్నదే ఈ పథకం ఉద్దేశం. ప్రధాన మంత్రి గ్రామ్ పరివాహన్ యోజన పేరుతో ఈ పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తారు.

06/15/2017 - 04:13

న్యూఢిల్లీ, జూన్ 14: రాష్టప్రతి పదవికి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, జార్కం డ్ గవర్నర్ ద్రౌపదీ ముర్ము, ఉప రాష్టప్రతి పదవికి కేంద్ర మంత్రి తావర్‌చంద్ గెహ్లోట్ పేర్లను బిజెపి అధినాయకత్వం పరిశీలిస్తోందా? లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజ న్ అభ్యర్థిత్వంపై ప్రతిపక్షాలతో ఏకాభిప్రాయం కుదరని పక్షంలో ద్రౌపదీ ముర్ము పేరును తెర మీదికి తీసుకురావాలని బిజెపి ఆలోచిస్తుందనే మాట వినిపిస్తోంది.

06/15/2017 - 03:48

న్యూఢిల్లీ, జూన్ 14: మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న రైతు ఉద్యమాలను దృష్టిలో పెట్టుకుని వారికి మరింత ఊరట లభించే రీతిలో కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు లక్షల రూపాయల వరకూ వీరికి ఇస్తున్న స్వల్పకాల పంట రుణాలపై వడ్డీ సబ్సిడీనిన కొనసాగించాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

06/15/2017 - 03:47

న్యూఢిల్లీ, జూన్ 14: క్యారికేచర్లే ఆ బాలిక బాధకు అద్దం పట్టాయి. శారీరకం గా ఆమెపై జరిగిన దాడిని కళ్లకు కట్టాయి. అంతిమంగా ఇంట్లోనే ఉన్న ఓ కామాంధుడ్ని పట్టించాయి. తన శరీరంపై జరిగిన ఉన్మాద దాడిని కారికేచర్ల రూపంలో గీసిన పదేళ్ల ఆ బాలిక ఢిల్లీ న్యాయమూర్తిని కదిలించింది. ప్రతి రంగులోనూ ఓ బాధను, ఆ నాటి దృశ్యాలను కళ్లకు కట్టిన ఆ బాలిక చిత్రాలనే న్యాయమూర్తి తిరుగులేని సాక్ష్యాలుగా పరిగణించారు.

06/15/2017 - 02:38

న్యూఢిల్లీ, జూన్ 14: రెండు తెలుగు రాష్ట్రాల ఉపాధ్యాయులకు సంబంధించిన ఏకీకృత సేవల నియమ, నిబంధనలను తక్షణమే విడుదల చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తమ కార్యదర్శిని ఆదేశించారు. కేంద్ర సమాచార, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం ఉదయం రాజ్‌నాథ్ సింగ్‌ను కలుసుకుని రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయుల ఏకీకృత సేవల నిబంధనలను జారీ చేయవలసిన అవసరం గురించి వివరించారు.

06/15/2017 - 00:59

చెన్నై, జూన్ 14: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బుధవారం తమిళనాడు అసెంబ్లీని కుదిపేసింది. అధికార అన్నాడిఎంకె శాసన సభ్యుల కొనుగోలు వ్యవహారంపై డిఎంకె సభలోపట్టుబట్టింది. ఈ సందర్భంగా సభాకార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలగడమేకాకుండా నినాదాలతో అట్టుడికిపోయింది. ప్రతిపక్ష డిఎంకె డిమాండ్‌కు అంగీకరించని స్పీకర్ వారందరినీ సభలోంచి బయటకు పంపించేశారు.

06/15/2017 - 00:58

న్యూఢిల్లీ, జూన్ 14: దేశ వ్యాప్తం గా పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 21న రైతు సంఘాలు ‘శవ ఆందోళన’ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఢిల్లీలో బుధవారం దేశ వ్యాప్తంగా రైతుల ఆందోళనలు జరుగుతున్న పరిస్థితులలో దేశ వ్యాప్తంగా ఉన్న 14 రైతు సంఘాలు గాంధీజీ సమాది రాజ్‌ఘాట్ వద్ద రైతులకు సంఘీభావంగా మూడు గంటలపాటు వౌన దీక్షను నిర్వహించాయి.

06/15/2017 - 00:57

లక్నో, జూన్ 14: ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టి న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. శారీరక వైకల్యంగల వారికీ రుణమాఫీ వర్తింపచేయాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది. రైతు రుణమాఫీ తరహాలోనే దీన్ని అమలుచేయనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. యూపీ ప్రభుత్వ దివ్వాంగ శాశక్తికరణ్ విభాగ్ వద్ద 3.88 కోట్ల రుణాలు పెండింగ్‌లో ఉన్నాయి.

06/15/2017 - 00:56

న్యూఢిల్లీ, జూన్ 14: బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనకు భారత్ కట్టుబడి ఉందని జెనీవా నగరంలో జరగుతున్న 108వ అంతర్జాతీయ కార్మిక సంస్థ సమావేశాలలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. భారత్‌లో కార్మికుల సంక్షేమానికి ప్రధానంగా బాల కార్మికుల నిర్మూలనకు తీసుకుంటున్న పటిష్టమైన చర్యలను బండారు దత్తాత్రేయ ఈ సమావేశాలలో వివరించారు.

06/15/2017 - 00:55

కేంద్రపార(ఒడిశా), జూన్ 14: కేంద్ర గిరిజన శాఖ మంత్రి జాల్ ఓరమ్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత చవిచూశారు. సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రిపై జనం కోడుగుడ్లు విసిరి నిరసన తెలిపారు. కేంద్రపార జిల్లా అవుల్ మార్కెట్‌లో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. మంత్రి పర్యటనకు నిరసనగా జనం నల్లజండాలు ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా ఆయన వాహనంపై కోడి గుడ్ల వర్షం కురిపించారు.

Pages