S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/06/2017 - 07:13

న్యూఢిల్లీ, మార్చి 5: నీటి బిల్లులు, విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించని అభ్యర్థులను ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించడానికి వీలుగా చట్టాల్లో మార్పులు చేయాలని ఎన్నికల కమిషన్ కోరుతోంది. అలాంటి వారిని లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించేందుకు 1951 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణ చేయాలని ఎన్నికల కమిషన్ న్యాయమంత్రిత్వ శాఖను కోరింది.

03/06/2017 - 07:12

న్యూఢిల్లీ, మార్చి 5: ప్రభుత్వ ఉద్యోగుల్లో స్ర్తి,పురుష సమానత్వం సాధించడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని, అందువల్ల సివిల్ సర్వీస్ పరీక్షలకోసం దరఖాస్తు చేయాలని మహిళా అభ్యర్థులను ప్రోత్సహించడం జరుగుతోందని యుపిఎస్‌సి తెలిపింది. ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్‌లాంటి సివిల్ సర్వీస్ అధికారులను ఎంపిక చేయడానికి యుపిఎస్‌సి సివిల్ సర్వీస్ పరీక్షలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

03/06/2017 - 07:12

ముంబై, మార్చి 5: భారత రిజర్వు బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను ఉద్యోగానికి రాజీనామా చేయాలంటూ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. రాజీనామా చేయకపోతే పటేల్, ఆయన కుటుంబానికి హాని చేస్తామంటూ ఓ యువకుడు ఈ-మెయిల్ ద్వారా బెదిరించాడు. ఫిబ్రవరి 23న తనకు మెయిల్ వచ్చినట్లు పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై పోలీస్ సైబర్ సెల్ ఈ మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని విచారణ జరిపింది.

03/06/2017 - 07:11

సోనేభద్ర (యుపి), మార్చి 5: ఉత్తరప్రదేశ్‌లో వరుస రోడ్‌షోలు నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నాలేవీ ఫలించవని ముఖ్యమంత్రి, అధికార సమాజ్ వాది పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. గతంలోనూ ప్రధాని మోదీ ఈ రకమైన రోడ్ షోలను నిర్వహించినా ఎలాంటి ఫలితమూ రాలేదని వ్యాఖ్యానించారు. ఇలా ప్రయోజనం లేని రోడ్‌షోలు నిర్వహించడం వల్ల బిజెపికి ఏ రకమైన ఉపయోగం ఉండదని అఖిలేశ్ అన్నారు.

03/06/2017 - 07:10

సోనేభద్ర, మార్చి 5: రైతుల రుణాలను మాఫీ చేశామంటూ కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ చెప్పుకోవడంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు. దేశంలో 50 మంది సంపన్నులకు సంబంధించిన 1.40 లక్షల కోట్ల రుణాలను మాత్రమే మోదీ సర్కారు మాఫీ చేసిందని, 50వేల కోట్ల రూపాయలున్న పేద రైతుల రుణాలను మాఫీ చేసేందుకు నిరాకరించిందని ఆదివారం నాడిక్కడ జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో రాహుల్ అన్నారు.

03/06/2017 - 04:40

కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యం నాకుంది

దేశ సమస్యలు తీర్చగలను నోట్ల రద్దుతో అవినీతిపరులు ఏకమయ్యారు
అఖిలేశ్, రాహుల్‌ది వారసత్వ బలమే ధైర్యంగా ముందుకెళ్లలేరు
ఇక కాంగ్రెస్ గురించి పురాతత్వ రికార్డులు పరిశీలించాల్సిందే
వారణాసి సభలో ప్రధాని నరేంద్ర మోదీ విసుర్లు

03/06/2017 - 04:36

న్యూఢిల్లీ, మార్చి 5: కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివర్లో దాదాపు 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, అలాగే 58 లక్షల పింఛనుదారులకు 2 శాతం కరవుభత్యం పెంపును ప్రకటించే అవకాశం ఉంది. ఉద్యోగులు, పింఛనుదారుల ఆదాయాలపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వం కరవుభత్యాన్ని ఇస్తుంది.

03/06/2017 - 04:34

న్యూఢిల్లీ, మార్చి 5: ఇకపై దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులు లావాదేవీలు జరిపేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. లేకపోతే ఎడాపెడా చార్జీల వడ్డన జరిగిపోతుంది. ఎటిఎంలతో సహా దాదాపుగా అన్ని రకాల ప్రధాన సేవల చార్జీలను సవరిస్తూ ఎస్‌బిఐ నిర్ణయం తీసుకుంది.

03/05/2017 - 03:31

భద్రాచలం, మార్చి 4: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ దండకారణ్య ప్రాంతం మావోయిస్టులకు కంచుకోట. అయితే రెండేళ్లుగా మావోయిస్టుల దూకుడుకు పోలీసులు చెక్ పెట్టారు. 2016 సంవత్సరంలో జరిగిన ఎన్‌కౌంటర్లలోనైతే ఏకంగా 120 మందికి పైగా మావోయిస్టులు, వారి సానుభూతిపరులు చనిపోయారు. ఇది ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర చరిత్రలోనే రికార్డు. కాగా గడిచిన రెండు నెలలుగా పోలీసుల దూకుడుకు అడ్డుకట్ట పడింది.

03/05/2017 - 02:51

లక్నో, మార్చి 4: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి బుధవారం జరిగిన ఆరోదశ పోలింగ్ 57 శాతం ఓట్లు పోలయ్యాయి. 49 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ పోటీ చేస్తున్న మావు, బిజెపి ఫైర్ బ్రాండ్ యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గాలు ఆరో విడతలోనే ఉన్నాయి. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని యూపీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వెల్లడించారు.

Pages