S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/03/2017 - 02:37

న్యూఢిల్లీ, మార్చి 2: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పచ్చి అబద్ధాలు చెప్తూ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. రైతులు, మాజీ సైనికులు, పేదలు ఇలా ఏ ఒక్క వర్గానికీ మోదీ వల్ల మేలు జరగలేదని ఆయన గురువారం వ్యాఖ్యానించారు.

03/03/2017 - 02:36

న్యూఢిల్లీ, మార్చి 2: భారత నౌకాదళం మొదటి సారి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన కలవరి జలాంతర్గామి నుంచి నౌకా విచ్ఛేద క్షిపణిని గురువారం విజయవంతంగా ప్రయోగించింది. నీటి గర్భంలోంచి సముద్ర ఉపరితలంపై ఉన్న శత్రు నౌకలను ఛేదించే లక్ష్యంతో ఈ క్షిపణిని రూపిందించారు. అరేబియా మహా సముద్రంలో నిర్వహించిన ఈ పరీక్ష విజయవంతమైదని నౌకాదళ అధికారులు తెలియజేశారు.

03/03/2017 - 02:28

న్యూఢిల్లీ, మార్చి 2: కేంద్ర ప్రభుత్వం కొత్త రాజధాని ఎంపికకు ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటీ సిఫారసు చేసిన ప్రమాణాలు అమరావతికి సరిపోతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయవాది ఏ.పి.గంగూలీ గురువారం జాతీయ హరిత ట్రిబ్యునల్ ముందు వాదించారు. అమరావతి పర్యావరణ అనుమతులపై దాఖలైన పిటిషన్లను హరిత ట్రిబ్యునల్ నేడు విచారించింది.

03/03/2017 - 02:28

భద్రాచలం, మార్చి 2: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా, ఒడిశా సరిహద్దుల్లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు దళకమాండర్ మృతి చెందాడు. బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ముగ్గురు గ్రామస్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సుక్మా జిల్లా దర్బా పోలీస్ స్టేషన్ పరిధిలోని కందనార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారని పోలీసు బలగాలకు సమాచారం అందింది.

03/03/2017 - 02:25

న్యూఢిల్లీ, మార్చి 2: భావప్రకటనా స్వేచ్ఛను తాను సమర్థిస్తానని, అయితే అదికూడా చట్టాల పరిధిలోనే ఉండాలని రక్షణమంత్రి మనోహర్ పారికర్ అన్నారు. గురువారం ఇక్కడ జరిగిన డిఆర్‌డిఓ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం సందర్భంగా విలేఖరులు ఎబివిపికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని గుర్‌మెహర్ కౌర్ వివాదం గురించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా పారికర్ ఈ వ్యాఖ్యలు చేవారు.

03/03/2017 - 02:24

బలియా, మార్చి 2:ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ చేసినవన్నీ తప్పులేనంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అదే రీతిలో సమాధానమిస్తూ, ఏ పనీ చేయకపోవడమే ప్రధాని చేసిన అతి పెద్ద తప్పని అన్నారు.‘ మోదీజీ మా తప్పుల గురించి మాట్లాడుతున్నారు. అభివృద్ధిపై చర్చించడానికి ఆయన భయపడుతున్నారు.

03/03/2017 - 02:15

ఉజ్జయినీ/న్యూఢిల్లీ, మార్చి 2: కేరళ ముఖ్యమంత్రి పినారాయి విజయన్ తల నరికితే కోటి రూపాయల బహుమతి ఇస్తానని ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త కుందన్ చంద్రావత్ ప్రకటించారు. కేరళలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల్ని సిపిఎం కార్యకర్తలు చంపడానికి ప్రతీకారం తీర్చుకునేందుకే ఈ రివార్డు ప్రకటించినట్టు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ విభాగం ఆర్‌ఎస్‌ఎస్ సహ్ ప్రచార్ ప్రముఖ్‌గా ఉన్న చంద్రావత్ తెలిపారు.

03/03/2017 - 01:56

న్యూఢిల్లీ, మార్చి 2: పాకిస్తాన్ సైన్యం వద్ద అత్యంత ప్రమాదకరమైన జీవరసాయనాయుధాలు ఉన్నట్లుగా తెలుస్తోందని, శత్రువు నుంచి ఎదురయ్యే ఏ సవాలునైనా దీటుగా ఎదుర్కోవటానికి సైన్యం సిద్ధంగా ఉండాలని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ భారత సైన్యానికి పిలుపునిచ్చారు.

03/03/2017 - 01:56

న్యూఢిల్లీ, మార్చి 2: దేశవ్యాప్తంగా గల వివిధ మెడికల్ కళాశాలలు, ఆసుపత్రుల్లో కలిపి 2017-18 విద్యాసంవత్సరంలో మరో నాలుగు వేలకు పైగా పోస్టు గ్రాడ్యుయేట్ (పిజి) సీట్లను సృష్టించే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా గురువారం ఇక్కడ ఈ విషయం వెల్లడించారు.

03/03/2017 - 02:07

న్యూఢిల్లీ, మార్చి 2: ఆన్‌లైన్‌లో రైల్వే టిక్కెట్ల బుకింగ్‌కు ఆధార్ కార్డును తప్పని సరి చేయాలని ఆ శాఖ నిర్ణయించింది. పెద్ద ఎత్తున టిక్కెట్లను బ్లాక్ చేయకుండా నిరోధించటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేమంత్రి సురేష్‌ప్రభు చెప్పారు. తప్పుడు ఆధారాలు చూపించి టిక్కెట్లను కొనుగోలు చేస్తున్న వారికి చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని వారు చెప్తున్నారు.

Pages