S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/15/2017 - 02:00

నంద్యాల, ఫిబ్రవరి 14: విజయవాడ - ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలును ఇక నుంచి కడప జిల్లా మీదుగా నడుపనున్నారు. రాజధాని అమరావతి నుండి రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, కర్నూలు జిల్లా వాసులకు అనుకూలంగా ఉండేలా గత ఏడాది విజయవాడ - ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలును వారానికి మూడు రోజులు నడిపేలా ఏర్పాటుచేశారు.

02/15/2017 - 00:54

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: సుప్రీం తీర్పుతో శశికళ రంగం నుంచి తప్పుకోవడంతో తమిళనాడు అన్నాడిఎంకెలో ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందన్నది మరింత ఆసక్తికరంగా మారింది. శశికళ విధేయుడిగా ఎడప్పడి పళనిస్వామి రంగంలోకి వచ్చారు. ఆయన్ని శాసన సభా పక్ష నేతగా శశివర్గం ఎన్నుకుంది. వెంటనే గవర్నర్‌ను కలుసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు పళనిస్వామి సంసిద్ధత వ్యక్తం చేశారు.

02/15/2017 - 00:49

న్యూఢిల్లీ/ చెన్నై, ఫిబ్రవరి 14:జయలలిత వారసురాలిగా తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలన్న శశికళ కలలు కల్లలయ్యాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితకు సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, విఎన్ సుధాకరన్, ఎళావరసిలలను సుప్రీం కోర్టు మంగళవారం దోషులుగా నిర్థారించింది. నాలుగేళ్ల పాటు జైలు శిక్షతో పాటు శశికళపై పదికోట్ల రూపాయల జరిమానా విధించింది.

02/15/2017 - 00:46

వినీలాకాశంలో భారత పతాక మాత్రమే రెపరెపలాడే క్షణాలు ఆసన్నమయ్యాయి. నింగిని జయించి నేలకు దించేందుకు -ఓటమెరుగని భారత ఆకాశ బ్రహ్మాస్త్రం పిఎస్‌ఎల్‌వి కవ్వింపుతో చూస్తోంది. ఒకటో రెండో కాదు అచ్చంగా -104 ఉపగ్రహాలను కడుపున మోసుకెళ్లి కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు నిటారుగా నిలబడిన పిఎస్‌ఎల్‌వి -సి 37 వాహక నౌకను 120 కోట్ల జన హృదయాలు ఊపిరి బిగబట్టి మరీ చూస్తున్నాయి.

02/14/2017 - 03:55

చెన్నై, ఫిబ్రవరి 13: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం తనచేత బలవంతంగా రాజీనామా చేయించారన్న ఆరోపణలను అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి వికె శశికళ పరోక్షంగా అంగీకరించారు. పార్టీ ఆగర్భ శత్రువైన డిఎంకెతో పన్నీర్ జతకట్టినట్టు తేలటంతోనే ఆయన్ను పదవినుంచి తప్పించాల్సి వచ్చిందని అన్నారు. సోమవారం పోయెస్ గార్డెన్ నివాసంలో పార్టీ కార్యకర్తలతో ఆమె మాట్లాడారు. ‘నేను ఆయనే్న కొనసాగించాలని కోరుకున్నా.

02/14/2017 - 03:53

చిత్రం..హరిద్వార్‌లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాహుల్ ఓ ఆలయంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌తో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దృశ్యం

02/14/2017 - 03:51

లఖింపూర్ ఖిరి, ఫిబ్రవరి 13: ఉత్తరప్రదేశ్‌లో రెండో దశ పోలింగ్ సమీపిస్తున్న వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శనాస్త్రాలు సంధించారు. ‘చేసిన పనులే చెబుతాయి’ (కామ్ బోల్తా హై) అంటూ ఇటీవల తనపై దాడికి దిగిన అఖిలేశ్‌పై మోదీ ఎదురుదాడికి దిగారు.

02/14/2017 - 03:46

చెన్నై, ఫిబ్రవరి 13: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తాజాగా జరుగుతున్న రాజకీయ పోరాటంలో ఎంతమాత్రం వెనక్కితగ్గటం లేదు. తాను పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రిగానే వ్యవహరిస్తున్నారనటానికి సోమవారం సచివాలయానికి వచ్చారు. ఫిబ్రవరి 5న రాజీనామా చేసిన అనంతరం ఆయన సచివాలయానికి రావటం ఇదే మొదటిసారి.

02/14/2017 - 03:44

చెన్నై, ఫిబ్రవరి 13: అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి వికె శశికళ ఇద్దరు ఎమ్మెల్యేలను ఒక రిసార్ట్‌లో నిర్బంధించారంటూ దాఖలైన హైబియస్ కార్పస్ పిటిషన్లపై మద్రాసు హైకోర్టు సోమవారం తన తీర్పును రిజర్వ్ చేసింది. ఎంఎల్‌ఏలు టి రామచంద్రన్, మతివణ్ణన్ తరపున దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో సోమవారం వాడివేడిగా చర్చలు జరిగాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజారత్నం, ఎంఎల్‌ఏల తరపు న్యాయవాదులు వారి వారి వాదనలను వినిపించారు.

02/14/2017 - 03:43

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: శ్రోతలను కట్టిపడేసే సమ్మోహన శక్తి అప్పుడు ఇప్పుడూ రేడియోకు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సోమవారం ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా మోదీ ఓ సందేశం ఇచ్చారు. ఆల్ ఇండియా రేడియో శ్రోతలు, అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ అందరికీ ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు. రేడియో మాధ్యమం మరింతగా మిమ్మల్ని ఆకట్టుకోవాలి.

Pages